Bigg Boss Telugu 6 : 'జబర్దస్త్' ప్రోగ్రామ్‌కు 'బిగ్ బాస్' నుంచి భారీ ఝలక్
కామెడీ రియాలిటీ షో 'జబర్దస్త్'కు 'బిగ్ బాస్' నుంచి మరో ఝలక్ తగిలింది. ఈసారి ఏకంగా ముగ్గురు మెయిన్ కమెడియన్లను తమ షోలోకి తీసుకుంది.
బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' (Bigg Boss Telugu). స్టార్ మా ఛానల్‌లో ఇప్పటికి ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆరో సీజన్ (Bigg Boss Telugu 6) ఈ రోజు (ఆదివారం, సెప్టెంబర్ 4న) ప్రారంభం అవుతోంది. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరెవరు? అనేది ఆల్రెడీ బయటకు వచ్చింది. ఆ లిస్టు చూస్తే... ఈటీవీలో ప్రసారం అయ్యే కామెడీ రియాలిటీ షో 'జబర్దస్త్'కు 'బిగ్ బాస్' భారీ ఝలక్ ఇచ్చినట్లు అర్థం అవుతోంది.
'బిగ్ బాస్'లోకి బింబిసారుడిలా ఎంట్రీ ఇచ్చిన 'చలాకీ' చంటి
Chalaki Chanti enters into Bigg Boss Telugu 6 In Bimbisara Getup : 'జబర్దస్త్' కార్యక్రమంలో సీనియర్ కమెడియన్లలో 'చలాకీ' చంటి ఒకరు. ఇప్పుడు ఆయన 'బిగ్ బాస్ 6'లోకి అడుగు పెట్టారు. నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సూపర్ డూపర్ హిట్ సినిమా 'బింబిసార' ఉంది కదా! అందులోని బింబిసారుడి గెటప్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చారు చంటి. 'లోపల ఎవరిని చూపించబోతున్నావ్' అని కింగ్ అక్కినేని నాగార్జున అడిగితే... 'లోపల వేరే! సుర్రు సుమ్ము అయిపోతుంది' అని చంటి సమాధానం ఇచ్చారు.
చంటితో పాటు ఫైమా, తన్మయి కూడా!
Jabardasth Faima Enters Into Bigg Boss 6 Telugu : 'చలాకీ' చంటితో పాటు ఇటీవల 'జబర్దస్త్'లో మంచి పేరు తెచ్చుకున్న ఫైమా (ఫాతిమా) కూడా 'బిగ్ బాస్ 6'లో అడుగుపెట్టారు. ఆమెతో పాటు లేడీ గెటప్ వేసే తన్మయి, గీతూ రాయల్ కూడా ఉన్నారు. గీతూ రాయల్ ఫుల్ టైమ్ 'జబర్దస్త్' కమెడియన్ కాదు గానీ... ఈ మధ్య షోలో అప్పుడప్పుడూ కనిపిస్తున్నారు. బుల్లితెర వీక్షకులను నవ్విస్తున్నారు. వీళ్ళను 'బిగ్ బాస్'లోకి తీసుకు రావడం ద్వారా 'జబర్దస్త్'కు భారీ ఝలక్ ఇచ్చారని అనుకోవాలి.
'జబర్దస్త్' నుంచి ఒక్కొక్కరూ...
ఇప్పుడు 'జబర్దస్త్' షోలో చేయాలంటే... అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేయాలి. ఆ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో ఎక్కువ సంపాదన కోసం ఇతర టీవీ ఛానల్స్‌లో కామెడీ కార్యక్రమాల మీద కమెడియన్లు కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఆల్రెడీ 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు టాటా బైబై చెప్పేశారు 'సుడిగాలి' సుధీర్. ఈటీవీ కార్యక్రమంలో ఆయన కనిపించినా... ఇంకా 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు రాలేదు. 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'ఢీ 14' చేస్తున్న 'హైపర్' ఆది... 'జబర్దస్త్' ఎందుకు చేయడం లేదో క్లారిటీ లేదు. ఈ టైమ్‌లో 'చలాకీ' చంటి, ఫైమా వంటి కమెడియన్లను చేసే కామెడీ వీక్షకులకు వినోదం పంచుతోంది. ఇప్పుడు వాళ్ళను 'బిగ్ బాస్' లాగేసుకుంది. వాళ్ళ స్థానంలో కొత్త కమెడియన్ల కోసం 'జబర్దస్త్' వెతుకుతోందని టాక్.
ఇంతకు ముందు అవినాష్ కూడా...
'చలాకీ' చంటి, ఫైమా తరహాలో గతంలో అవినాష్ కూడా 'జబర్దస్త్' నుంచి 'బిగ్ బాస్'కు వచ్చాడు. అయితే, అగ్రిమెంట్ కారణంగా పది లక్షలు మల్లెమాల సంస్థకు కట్టి రావాల్సి వచ్చింది. ఆయన నాలుగో సీజన్‌లో పార్టిసిపేట్ చేశారు. అవినాష్ ఉదాహరణ కళ్ళ ముందు ఉండటంతో 'చలాకీ' చంటి, ఫైమా ముందు నుంచి జాగ్రత్త పడ్డారట.
Also Read : కప్పుతోనే బయటకొస్తా - మ్యాటర్ లీక్ చేసిన సింగర్ రేవంత్!
'బుల్లెట్' భాస్కర్ టీమ్ చేసే స్కిట్స్‌లో ఫైమా కామెడీ హైలైట్ అవుతూ వస్తోంది. ఇక, 'చలాకీ' చంటి స్కిట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మినిమమ్ గ్యారెంటీ కామెడీ అందిస్తారు. వీళ్ళిద్దరికీ రీప్లేస్‌మెంట్ దొరకడం అంత ఈజీ కాదని చెప్పుకోవాలి.
Also Read : ఈ రోజు నుంచే ‘బిగ్ బాస్’, లక్ పరీక్షించుకోబోతున్న సెలబ్రిటీస్ వీళ్లే!