Bigg Boss 6 Telugu Live Updates: 'బిగ్ బాస్ 6' షురూ - ఫైమా ‘జబర్దస్త్’ ఎంట్రీ, భావోద్వేగంతో గుండె బరువెక్కించేసింది
బుల్లి తెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్-6 ఈ రోజు (04.09.2022) మొదలైంది. 'విక్రమ్'లో కమల్ హాసన్ డైలాగుతో షో స్టార్ట్ చేసిన నాగార్జున
LIVE
Background
తెలుగులో నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకెళ్తున్న బిగ్ బాస్(Bigg Boss) మళ్లీ వచ్చేసింది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు 6వ సీజన్‌తో అలరించేందుకు సిద్ధమైపోతోంది. ఈ హౌస్‌లోకి ఎంటరయ్యే సెలబ్రిటీల ఎంపిక, క్వారంటైన్ వంటి పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. అంతేకాదు, సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ స్టేజ్‌పై దుమ్మురేపే డ్యాన్సులతో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే ‘బిగ్ బాస్’ షోలో ఇవన్నీ మీరు చూడొచ్చు. హోస్ట్ నాగార్జున ఒక్కో సెలబ్రిటీని ఆహ్వానించి, బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించనున్నారు.
ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కొంతమంది సెలబ్రిటీల జాబితా లీకైంది. ఆ జాబితా ప్రకారం.. బిగ్ బాస్ సీజన్-6లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే. ఈ సారి సామాన్యులకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. వారు ఎవరనేది కూడా ఈ రోజే తేలిపోతుంది.
‘బిగ్ బాస్’ షోలో పాల్గొనే కంటెంస్టెంట్ల జాబితా:
1. బాలాదిత్య (హీరో)
2. అభినయ శ్రీ (నటి)
3. రోహిత్, మెరీనా (రియల్ కపుల్)
4. రేవంత్ (సింగర్)
5. నేహా (యాంకర్)
6. చలాకీ చంటి (కమెడియన్)
7. సుదీప (నటి, నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్)
8. శ్రీ సత్య (సీరియల్ నటి)
9. ఇనయా సుల్తానా (నటి)
10. శ్రీహాన్ (యూట్యూబర్)
11. ఆరోహి రావ్
12. వాసంతి
13. అర్జున్
14. ఆర్జే సూర్య
15. కీర్తి భట్ (కార్తీకదీపం హీరోయిన్)
16. రాజశేఖర్
17. గీతూ (యూట్యూబర్)
18. ఫైమా (కమెడియన్)
19. తన్మయ్ (జబర్దస్త్ లేడి గెటప్)
20. ఆది రెడ్డి (యూట్యూబర్)
ఈ లిస్ట్ లో 20 మంది ఉన్నారు. వీరిలో 18 మందిని ఫైనల్ చేసి హౌస్ లోకి పంపించనున్నారు. వీరితో పాటు ఓ సర్‌ప్రైజ్ కంటెస్టెంట్ ఉన్నట్లు సమాచారం. అది ఎవరో తెలియాలంటే సాయంత్రం 6 గంటల వరకు ఎదురుచూడాల్సిందే. ఈసారి అబ్బాయిల నెంబర్ కంటే అమ్మాయిలే ఎక్కువ మంది హౌస్ లో కనిపించబోతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ ని చాలా కొత్తగా డిజైన్ చేశారట. అయితే హౌస్ లో 8 బెడ్స్ మాత్రమే ఉన్నాయట. అందులో కొన్ని సింగిల్ బెడ్స్ కూడా ఉంటాయి. 18 మందికి కేవలం 8 బెడ్సే అంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇంత మంది బిగ్ బాస్ హౌస్ లో ఎలా అడ్జస్ట్ అవుతారో చూడాలి.
మొత్తం 18 మంది పోటీదారులు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఇక టాస్క్ ల విషయానికొస్తే.. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారని సమాచారం. గత సీజన్లలో కూడా టాస్క్ లకు సంబంధించి ఇలానే చేశారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం మా లైవ్ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ప్రవేశించిన మొత్తం కంటెస్టెంట్లు వీళ్లే
బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన మొత్తం కంటెస్టెంట్లు వీళ్లే:
1. కీర్తి భట్ (‘కార్తీక దీపం’ సీరియల్ నటి)
2. సుదీప (‘నువ్వు నాకు నచ్చావ్’లో బాలనటి)
3. శ్రీహన్ (సిరి బాయ్ ఫ్రెండ్, యూట్యూబర్)
4. నేహా (యాంకర్)
5. శ్రీ సత్య (మోడల్)
6. అర్జున్ కళ్యాణ్ (సీరియల్ నటుడు)
7. చలాకీ చంటి (‘జబర్దస్త’ కమెడియన్)
8. అభినయ శ్రీ (నటి, డ్యాన్సర్)
9. గీతూ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
10. బాలాదిత్య (నటుడు)
11. మరీనా (సీరియల్ నటి, రోహన్ భార్య)
12. రోహన్ (సీరియల్ నటి, మరినా భర్త)
13. వాసంతి కృష్ణన్ (సీరియల్ నటి)
14. షాని (నటుడు)
15. ఆర్జే సూర్య (ఆర్జే)
16. ఆది రెడ్డి (యూట్యూబర్)
17. ఆరోహిరావు (టీవీ యాంకర్)
18. ఫైమా (‘జబర్దస్త్’ కమెడియన్)
19. రాజశేఖర్ (నటుడు)
20. ఇనయా (నటి)
21. రేవంత్ (సింగర్)
చివరి కంటెస్టెంట్‌గా సింగర్ రేవంత్
సింగర్ రేవంత్ 20వ కంటెస్టెంట్‌గా ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ప్రవేశించాడు. రాజన్నలోని పాటతోనే తనకు మంచి గుర్తింపు వచ్చిందని రేవంత్ అన్నాడు. మంచితనంతో గెలుద్దామని వచ్చా, కష్టాలు వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్తానని ఆశిస్తున్నా అని రేవంత్ తెలిపాడు. ఈ సందర్భంగా నాగ్ నాలుగు జతల కళ్లు చూపించారు. ‘‘ప్లే బాయ్‌గా నువ్వు బాగా గుర్తు పెట్టే కళ్లేవో చెప్పు’’ అని నాగ్ అడిగారు. దీంతో రేవంత్ అందులో ఒకటి తన భార్య కళ్లు కావచ్చని చెప్పాడు. అనంతరం నాగ్.. అన్వితాను స్టేజ్ మీదకు పిలిచి.. రేవంత్ నీ కళ్లను గుర్తుపట్టలేకపోయాడని ఆటపట్టించారు. ఒక పాటతో ఆమెకు క్షమాపణలు చెప్పాలని నాగ్ కోరారు. దీంతో రేవంత్ పాటతో ఇంప్రెస్ చేశాడు.
19వ కంటెస్టెంట్‌గా ఆరోహి రావ్
19వ కంటెస్టెంట్‌గా ఆరోహి రావ్ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది. అంజలిగా పల్లెటూరు అమ్మాయిగా జీవించిన తాను, మార్పు కోసం హైదరాబాద్ వచ్చానని ప్రోమోలో తెలిపింది. పల్లెటూరు అమ్మాయి నుంచి తాను ఆరోహి రావ్ అనే మోడ్రన్ యువతిగా మారానని పేర్కొంది.
‘బిగ్ బాస్’లోకి యూట్యూబర్ ఆదిరెడ్డి
‘బిగ్ బాస్’లోకి యూట్యూబర్ ఆదిరెడ్డి వచ్చేశాడు. ‘బిగ్ బాస్’ రివ్యూలను చెబుతూ పాపులారిటీ సంపాదించిన ఆదిరెడ్డి, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడం ఆశ్చర్యకరం.
‘జబర్దస్త్’ సెన్సేషనల్ ఫైమా వచ్చేసింది
‘జబర్దస్త్’ సెన్సేషనల్ ఫైమా వచ్చేసింది. ఎమోషనల్ ప్రోమోతో ఫైమా ‘బిగ్ బాస్’లో అడుగు పెట్టింది. 16వ కంటెస్టెంట్‌గా వచ్చిన ఫైమా భావోద్వేగంగా మాట్లాడింది. ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ రాసిన లేఖతో కాసేపు ఫన్ క్రియేట్ చేశారు. 100 రోజులు నిన్ను చూసే బాధ తప్పుతుందని, దయచేసి మేకప్ లేకుండా కెమేరా ముందుకు రావద్దని ఆటపట్టిస్తూ.. ప్రేమ మాటలతో గుండెలు పిండేశాడు ప్రవీణ్. ఆ లెటర్‌లోని మాటలకు ఫైమా కన్నీళ్లు పెట్టుకుంది.