అన్వేషించండి
Advertisement
Vijayawada: విజయవాడలో ఒళ్లుగగుర్పొడిచేలా హత్య! మటన్ కత్తితో తల నరికిన దుండగుడు
AP News: వన్ టౌన్ లోని రమణయ్య కూల్ డ్రింక్ షాప్ సెంటర్లో, గుర్తు తెలియని వ్యక్తి మటన్ కత్తితో గణేష్ అనే వ్యక్తిని నరకడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
Andhra Pradesh News: విజయవాడలో గురువారం (డిసెంబర్ 14) సాయంత్రం దారుణమైన రీతిలో హత్య జరిగింది. విజయవాడ వన్ టౌన్ పరిధిలో రమణయ్య కూల్ డ్రింక్ షాప్ వద్ద ఒక వ్యక్తి మటన్ నరికే కత్తితో మరో వ్యక్తి మెడ మీద నరికినట్లు సమాచారం. దీంతో బాధిత వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికుల వివరాల ప్రకారం.. వన్ టౌన్ లోని రమణయ్య కూల్ డ్రింక్ షాప్ సెంటర్లో, గుర్తు తెలియని వ్యక్తి మటన్ కత్తితో గణేష్ అనే వ్యక్తిని నరకడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య చేసిన వ్యక్తిని వన్ టౌన్ సీఐ సురేష్ రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion