ugadi panchangam in telugu 2024-2025: ఉగాది వరకూ ఈ రాశులవారికి ఆదాయం - ఆ 5 రాశులవారికి అసహనం!
Ugadi 2024-2025: మార్చి రెండో వారంలో నాలుగు గ్రహాలు రాశిమారుతున్నాయి. దాదాపు ఉగాది వరకూ మీ రాశిపై వాటి ప్రభావం ఉంటుంది. మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉందో ఇక్కడ తెలుసుకోండి...
Ugadi Panchangam in Telugu 2024-2025: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రహాల కదలిక మొత్తం 12 రాశిచక్రాలను ప్రభావితం చేస్తుంది. గ్రహాల గమనం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తే కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. గ్రహాల గమనాన్ని బట్టి జాతకాన్ని లెక్కిస్తారు. సూర్యుడు, కుజుడు, బుధుడు, శని గ్రహాల కదలికలు మారనున్నాయి...
- మార్చి 14న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు
- మార్చి 15న కుజుడు కుంభరాశిలో ప్రవేశిస్తాడు
- బుధుడు మార్చి 9 నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు
- శుక్రుడు మార్చి 7 నుంచి ఈ నెలాఖరు వరకూ కుంభంలోనే ఉంటాడు...
సూర్యుడు, కుజుడు, బుధుడు,శుక్రుడి గమనంలో మార్పు కారణంగా మార్చి రెండో వారం నుంచి దాదాపు ఉగాది వరకూ కొన్ని రాశులవారికి శుభ ఫలితాలుంటే..మరికొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శని గ్రహాల గమనంలో మార్పు ప్రభావం 12 రాశులపై ఎలా ఉందో తెలుసుకుందాం...
Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!
మేష రాశి
మీలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతారు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో ఇబ్బందులు ఉండవచ్చు.కొంత గందరగోళంగా అనిపిస్తుంది కానీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు
వృషభ రాశి
మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కళలు సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆస్తి పెరుగుదల ఉండవచ్చు. మేధోపరమైన పనుల్లో బిజీ పెరగవచ్చు.
మిథున రాశి
మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది కానీ మీ ఆలోచనల్లో హెచ్చుతగ్గులుంటాయి. కుటుంబం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉంటుంది. ప్రమోషన్ కూడా ఉండవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
కర్కాటక రాశి
ఈ రాశివారు మనసు కలత చెందుతుంది. సహనం, ఓపిక అవసరం. అనవసరమైన కోపం, చర్చలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అదనపు ఖర్చులు ఉంటాయి. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. శ్రమ ఎక్కువగా ఉంటుంది.
సింహ రాశి
ఏదో నిరాశ మిమ్మల్ని ఆవహిస్తుంది. మనసులో నిరాశ, అసంతృప్తి ఉంటాయి. కోపం తగ్గించుకోవాలి, అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు ఆదాయంలో తగ్గుదల ఉండొచ్చు.
కన్యా రాశి
మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు కానీ ఏదో గందరగోళం వెంటాడుతుంది. విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలి..చదువుపై పూర్తిగా శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో ఇబ్బందులు ఉండవచ్చు. తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది
తులా రాశి
మీ మనసులో ఒడిదుడుకులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది.
వృశ్చిక రాశి
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు మీ పనిలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు. కానీ కార్యాలయంలో మార్పు ఉండవచ్చు. శ్రమ ఎక్కువగా ఉంటుంది.
Also Read: మీ నక్షత్రం , రాశి ఏంటో తెలియదా - మీ పేరు ఆధారంగా ఇలా తెలుసుకోండి!
ధనుస్సు రాశి
మనస్సు చంచలంగా ఉంటుంది. స్వీయ నియంత్రణలో ఉండండి. కోపం తగ్గించుకోవాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి.
మకర రాశి
మీరు ఆనందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో పెరుగుతుంది. ఆస్తి క్రయ, విక్రయాలు స్నేహితుని సహాయంతో సాగుతాయి. ఉద్యోగులు అధికారుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది
కుంభ రాశి
వ్యాపారులు, ఉద్యోగలు, విద్యార్థులకు శుభసమయం. గ్రహాల సంచారం మీకు అనుకూల ఫలితాలనిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకోని బహుమతులు అందుకుంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
మీన రాశి
సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడి సంచారం మీన రాశివారికి శుభఫలితాలను అందిస్తోంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. వ్యాపారం బావుంటుంది. మీ పురోగతికి మంచి సమయం ఇది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఉత్సాహంగా ఉంటారు.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం