News
News
వీడియోలు ఆటలు
X

Simhachalam: మొదలైన సింహాచలం అప్పన్న చందనోత్సవం, నిజరూపంలో దర్శనమిస్తున్న అప్పన్న స్వామి

మొదలైన సింహాచలం అప్పన్న చందనోత్సవం 

ఉదయం 4 గంటల నుండి లైన్లో భక్తులు 

రాత్రి ఏడు గంటల వరకూ క్యూలో ఉన్న భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం 

FOLLOW US: 
Share:

ప్రతీ ఏటా వైభవంగా జరిగే సింహాచలం అప్పన్న చందనోత్సవం ఈ రోజు (ఏప్రిల్ 23) ఉదయం 4 గంటల నుండి మొదలైంది. స్వామి నిజరూపదర్శనం చేసుకునే అవకాశం కలగడం దానికి ఆదివారం సెలవు రోజు కలిసి కావడంతో భక్తులు భారీగా సింహాచలం కొండకు తరలివస్తున్నారు. రాత్రి 7 గంటల వరకూ లైన్లో ఉన్న భక్తులకు స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని విశాఖ  జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున తెలిపారు. ఈ ఏడాది 11 లక్షల మంది వరకూ భక్తులు సింహాచలం స్వామి దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసారు. అసలే వేసవి కాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎక్కడికక్కడ భక్తుల కోసం మంచినీరు, మజ్జిగ పేకెట్ లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. 1500,1000 రూపాయల టికెట్స్ కొన్నవారి కోసం ప్రత్యేక దర్శనం అవకాశం ఉంటుందని అలాగే వీఐపీల దర్శనాల వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశామని దేవాలయ అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు 300 రూపాయల టికెట్స్, ఉచిత దర్శనాలు కూడా ఉన్నాయి.

కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం 

సింహాచలం కొండపైకి వచ్చే భక్తుల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించినట్లు అధికారులు తెలిపారు. గోశాల ప్రాంతం నుండి దేవస్థానానికి చెందిన 4 బస్సులతో పాటు ఆర్టీసీ కి చెందిన 56 బస్సులను ఉదయం నుండి ఉచితంగా నడుపుతున్నారు. అలాగే హనుమంత వాక ఘాట్ రోడ్డు లో కూడా కొన్ని మినీ బస్సులను నడుపుతున్నారు. ప్రోటోకాల్ పరిధిలో ఉండే వీఐపీ లకు మాత్రమే సొంత వాహనాల్లో కొండపైకి వచ్చే అవకాశం ఇచ్చారు.

ప్రసాదాలు కొండ క్రిందనే

ఈ ఏడాది సింహాచలం వరాహ లక్ష్మీ నారాయణ స్వామి ప్రసాదాలను కొండపైన కౌంటర్ల లో అమ్మడం లేదు. కొండ కింద గోశాల, పాత అడవివరం జంక్షన్ ల దగ్గర కౌంటర్లలో అమ్ముతున్నారు. అలాగే పిఠాపురానికి చెందిన శ్రీ పాద భావనాచార్యుల మహా అన్నదాన ట్రస్ట్ వారు 40 వేల మందికి చక్కర పొంగలి, కదంబం లాంటి ప్రసాదాలు పంచిపెడుతున్నారు. అలాగే ఎండను దృష్టి పెట్టుకుని 50కి పైగా స్వచ్చంద సంస్థలు కొండా క్రింద నీరు, ORS పేకెట్లను పంచిపెడుతున్నారు.

అంతరాలయ దర్శనం 6 వేలమందికే

ఈసారి అప్పన్న స్వామి అంతరాలయ దర్శనం 6 వేలమందికే కల్పిస్తున్నారు. పోయినేడాది 5 వేలమందికి అంతరాలయ దర్శనం కల్పించామని ఈ ఏడు మరో వెయ్యి మందికి మాత్రమే అదనంగా అంతరాలయ దర్శనం కల్పించగలమని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఈ సంఖ్యను తప్పకుండా పెంచుతామని వారు అంటున్నారు.  

Published at : 23 Apr 2023 09:07 AM (IST) Tags: simhachalam chandanotsavam Simhachalam Chandanotsavam 2023 simhachalam appanna swamy simhachalam latest news

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గధాయుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గధాయుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Visakha Crime News: అనకాపల్లి జిల్లాలో మద్యం వ్యాన్ బోల్తా, బీర్ బాటిళ్ళ కోసం పోటీపడ్డ జనం

Visakha Crime News: అనకాపల్లి జిల్లాలో మద్యం వ్యాన్ బోల్తా, బీర్ బాటిళ్ళ కోసం పోటీపడ్డ జనం

Top 10 Headlines Today: పోలవరం టూర్‌కు జగన్, నాగర్ కర్నూల్‌లో కేసీఆర్ పర్యటన, తిరుపతిలో ఆదిపురుష్‌ వేడుక

Top 10 Headlines Today: పోలవరం టూర్‌కు జగన్, నాగర్ కర్నూల్‌లో కేసీఆర్ పర్యటన, తిరుపతిలో ఆదిపురుష్‌ వేడుక

Top 10 Headlines Today: ఏపీకి గుడ్‌ న్యూస్ చెప్పిన కేంద్రం, ఒడిశా ప్రమాద బాధితులపై మమత

Top 10 Headlines Today: ఏపీకి గుడ్‌ న్యూస్ చెప్పిన కేంద్రం, ఒడిశా ప్రమాద బాధితులపై మమత

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

టాప్ స్టోరీస్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?