By: ABP Desam | Updated at : 24 Nov 2021 01:33 PM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ట్రావెల్స్ యాజమాన్యం పరారవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా ఆ ట్రావెల్స్ సంస్థను నమ్ముకొని వెళ్లిన ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. టూరిస్టులను నట్టేట ముంచినట్లుగా వారందరినీ ట్రావెల్ ఏజెన్సీ యాత్ర మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఎదురైన సమస్యలకు యాత్రికులు నానా యాతన పడుతున్నారు. అసలేం జరిగిందంటే..
కర్ణాటకలోని మైసూరు కేంద్రంగా అకుల్ టూరిజం పేరుతో ఓ ట్రావెల్స్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థ దేశంలోని వేర్వేరు పుణ్యక్షేత్రాలకు, పర్యటక ప్రదేశాలకు బస్సులను తిప్పుతుంటారు. ప్రత్యేక ప్యాకేజీలు వసూలు చేసి యాత్రికులను గమ్యస్థానాలకు తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ప్యాకేజీని ప్రకటించారు. మనకు గోదావరి పుష్కరాల తరహాలోనే ఉత్తరాదిన ఉండే సింధూ పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ఓ ప్రత్యేక ప్యాకేజీని రూపొందించారు.
Also Read: Hyderabad Crime: 40 ఏళ్లయినా పెళ్లికాలేదని తొందరపడితే కోటి పోయింది..
ఈ క్రమంలోనే శ్రీకాకుళం నుంచి పలువురు యాత్రికులు అకుల్ ట్రావెల్స్ యాజమాన్యం ద్వారా సింధూ పుష్కరాలకు వెళ్లారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల వరకూ వసూలు చేశారు. ఇలా జమ్ము కశ్మీర్ తీసుకెళ్లాక యాత్రికులను వదిలేసి అకుల్ ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు పరారయ్యారు. దీంతో దాదాపు 120 మంది యాత్రికులు దిక్కులేని వారయ్యారు. జమ్ముకశ్మీర్‌లోని కట్రా వద్ద హోటల్లో యాత్రికులంతా చిక్కుకుపోయారు. వారు వెళ్లిపోయేందుకు హోటల్ యాజమాన్యం అంగీకరించడం లేదు. డబ్బులు కట్టాలని 120 మందిని హోటల్ యాజమాన్యం నిర్బంధించింది. ఒక్కొక్కరు రూ.పది వేలు కట్టాలంటూ యాత్రికులను నిర్బంధించింది.
హోటల్ సిబ్బంది నిర్బంధించడంతో దిక్కుతోచని స్థితిలో యాత్రికులు ఉన్నారు. హోటల్‌లో చిక్కుకుపోయిన వారిలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట వాసులు ఉన్నారు. వారంతా తమను విడిపించాలని వేడుకుంటున్నారు.
Also Read: TG Venkatesh : రాజధాని ఫార్ములా రెడీ.. జగన్ సై అంటే బీజేపీని ఒప్పిస్తానన్న ఎంపీ టీజీ వెంకటేష్ !
Also Read: ప్రజలంతా కష్టాల్లో ఉంటే.. సీఎం జగన్ విందులు, వినోదాల్లో ఉన్నాడు
Also Read: ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.. ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష
Also Read: రూ.99కే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్.. టెంప్ట్ అయినందుకు రూ.33 లక్షలు హాంఫట్, ఏం జరిగిందంటే..
Also Read: Cheating Woman: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్
Anantapur News : అనంతలో ఉన్నతాధికారి ఆత్మహత్య, ఉసురు తీసిన ఆన్లైన్ బిజినెస్!
YSRCP Permanent President : వైఎస్ఆర్సీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్ ! ఎందుకంటే ?
Chandrababu Tour : 35 ఏళ్ల నాటి విషయాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు, మళ్లీ నల్లారి ఇంటికి!
Eluru Borewell News: ఎట్టకేలకు బయటికొచ్చిన బాలుడు, 5 గంటలుగా బోరుబావిలో నరకయాతన
Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?
2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!
UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!
Viral Video : లవర్ చెప్పినట్లే చేశాడు ! పెళ్లి కూడా అయింది - ఎలాంటిదంటే ?
Anasuya: 'జబర్దస్త్' వదిలేసిన అనసూయ - ఆ స్టార్ డైరెక్టరే కారణమా?