News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

MP Raghurama: ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.. ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు.

FOLLOW US: 
Share:

కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని సీఎం జగన్ ముందుగానే గ్రహించారని.. ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అందుకోసమే.. మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్నారని చెప్పారు. అమరావతి రైతులు ఎట్టిపరిస్థితుల్లో మహాపాదయాత్రను కొనసాగించాలని కోరారు.అసెంబ్లీలో సీఎం జగన్ అబద్ధాలు మాట్లాడారని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. అమరావతిలో సిటీని నిర్మించడం గొప్ప అవకాశమని చెప్పారు. అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తామని చెప్పి.. తాజాగా అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. సీఆర్డీఏలో రాజ్‌భవన్‌, సచివాలయం, హైకోర్టు ఉంటాయని గతంలోనే అగ్రిమెంట్‌ చేశారని రఘురామ గుర్తు చేశారు. మళ్లీ.. 3 రాజధానుల అంశంలో వెనక్కి వెళ్లేదిలేదని సీఎం జగన్ చెప్పారని.. నిన్న నేతలు  మాట్లాడని మాటలు సరికావని రఘురామ విమర్శించారు. సీఎం జగన్‌, పెద్దిరెడ్డి, బుగ్గన, బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు రికార్డుల్లో ఉన్నాయన్నారు.

రాజధాని మారిస్తే రైతులకు రూ.99వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందనే విషయం వారికి తెలుసని..  నష్టపరిహారం చెల్లించకుండా.. ఎలాంటి బిల్లు పెట్టకుండా ఉండాలంటే హైకోర్టులో కేసును కొనసాగించాలన్నారు. రాజధానికి రూ.5లక్షల కోట్లు అవుతుందని చెబుతున్నారని.. ప్రభుత్వం పెట్టే ఖర్చు ఎంత? అని ప్రశ్నించారు. రూ. 10వేల కోట్లు ఖర్చుపెడితే అద్భుతంగా ప్లాన్‌ చేసిన సిటీ ఏర్పాటు చేయొచ్చని.. రఘురామ సూచించారు. కానీ ఓ కులంపై ద్వేషంతో చేసిన వ్యవహారంతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. 

మన ప్రభుత్వం వచ్చాక రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేశామని అంటున్నారు. కానీ ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేశామా? అంటే ఏదీ లేదు. ఇసుక పాలసీని నాశనం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు రాజధానికి సంబంధం లేదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. హైదరాబాద్‌ నిజాం హయాంలోనే మహానగరమని అందరికీ తెలిసిందే. చెన్నై, ముంబయి బ్రిటీష్‌ కాలంలోనే మహా నగరాలుగా ఉన్నాయి. ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని దుస్థితి వచ్చింది. సీఎంకు కక్ష దేనికి? రాజధాని అంటే ఏం చెప్పాలి ఎక్కడ అని చెప్పాలి?
                                                                                                                  - రఘురామకృష్ణరాజు, ఎంపీ
ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నప్పుడు విశాఖకు పోర్టు వచ్చిందని రఘురామ ప్రశ్నించారు. సంవత్సరానికి రూ.60 కోట్లు ఖర్చు అవుతుందని  శాసన మండలి రద్దు చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. అధికార వికేంద్రీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు చాలా తేడా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రఘురామ చెప్పారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజధాని ఆపే శక్తి కోర్టుకు మాత్రమే ఉందని.. న్యాయస్థానం న్యాయం చేయాలని రఘురామ కోరారు.

Also Read: YSRCP Kadapa : పంచాయతీ నిధులు తీసేసుకున్న ఏపీ ప్రభుత్వం.. కడప జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ సర్పంచ్‌ల రాజీనామా

Also Read: Mudragada : మీ పతనం చూడాలనే ఆత్మహత్య చేసుకోలేదు.. చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ !

Published at : 23 Nov 2021 05:32 PM (IST) Tags: cm jagan mp raghurama Ap assembly AP Three capitals mp raghu rama krishna raju comments

ఇవి కూడా చూడండి

Chandrababu Case : చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు శుక్రవారం - మరోసారి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు  !

Chandrababu Case : చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు శుక్రవారం - మరోసారి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు !

Minister RK Roja: షూటింగ్ అనుకొని బాలకృష్ణ తొడలు కొడుతున్నారు, బావ కళ్లలో ఆనందం కోసమే - రోజా ఎద్దేవా

Minister RK Roja: షూటింగ్ అనుకొని బాలకృష్ణ తొడలు కొడుతున్నారు, బావ కళ్లలో ఆనందం కోసమే - రోజా ఎద్దేవా

MP Nandigam Suresh: చంద్రబాబు లాగే వెన్నుపోటు పొడవాలని లోకేశ్ ఆలోచిస్తున్నారేమో - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

MP Nandigam Suresh: చంద్రబాబు లాగే వెన్నుపోటు పొడవాలని లోకేశ్ ఆలోచిస్తున్నారేమో - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా

Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా

Top Headlines Today: బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక; బస్సు యాత్రకు కోమటిరెడ్డి రెడీ - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక; బస్సు యాత్రకు కోమటిరెడ్డి రెడీ - నేటి టాప్ న్యూస్

టాప్ స్టోరీస్

ఖలిస్థాన్ వివాదం భారత్‌ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?

ఖలిస్థాన్ వివాదం భారత్‌ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?

AP News : పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం విచారణ !

AP News  :  పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం విచారణ !

వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్

వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్

TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ

TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ