Mudragada : మీ పతనం చూడాలనే ఆత్మహత్య చేసుకోలేదు.. చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ !
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై ముద్రగడ పద్మనాభం చంద్రబాబు లేఖ రాశారు. కాపు ఉద్యమం చేసినప్పుడు తనను.. తన కుటుంబాన్ని పోలీసులతో కొట్టించి.. తిట్టించారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుతో టీడీపీ అధినేత చంద్రబాబు కంటతడి పెట్టిన వ్యవహారంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున చంద్రబాబుకు మద్దతు తెలుపుతూంటే కొంత మంది మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. మీ పతనం చూడాలనే తాను ఆత్మహత్య చేసుకోలేదంటూ కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా ఓ లేఖను విడుదల చేశారు. ఈ మధ్య మీ శ్రీమతి గారికి జరిగిన అవమానం గురించి వెక్కి వెక్కి ఏడవడం టివిలో చూసి ఆశ్చర్యపోయానని ముద్రగడ లేఖలో తెలిపారు.
మా జాతికి ఇచ్చిన హమీని అమలు చేయమని ఉద్యమం చేస్తే...తనను తన కుటుంబాన్ని చాలా అవమానపరిచారని ఆరోపించారు. మీ కుమారుడు లోకేష్ ఆదేశాలతో పోలీసులు బూటు కాలితో తన్నారని.. తన భార్యను.. కుమారుడ్ని.. కోడల్ని కూడా బూతులు తిడుతూ లాఠీలతో కొట్టారన్నారు. తనను 14 రోజుల పాటు గా హస్పటల్ గదిలో కారణం లేకుండానే బంధించారని... మీ రాక్షస ఆనందం కోసం హస్పటల్ లో మా దంపతులను ఫోటోలు తీయించి చూసేవారని విమర్శించారు.
Also Read: మళ్లీ 3 రాజధానులా? అసలు జీతాలకు డబ్బులున్నాయా? ఆత్మ పరిశీలన చేసుకోండి: సోము వీర్రాజు
మీరు చేసిన హింస తాలుక అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో రాత్రుళ్లు నిద్రపోలేదని.. అణిచివేతతో తమ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించారని ముద్రగడ మండిపడ్డారు. కుటుంబాన్ని అవమాన పరచిన మీ పతనం నా కళ్ళతో చూడాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానన్నారు. తన కుటుంబాన్ని ఎంతగానో అవమానించిన మీ నోటి వెంట ఇప్పడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయన్ని ఎద్దేవా చేశారు.
Also Read: Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా మహిళా ఉద్యోగి రాజీనామా.. 2024లో మళ్లీ సీఎం అయ్యాకే..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి