News
News
X

Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా మహిళా ఉద్యోగి రాజీనామా.. 2024లో మళ్లీ సీఎం అయ్యాకే..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు అసెంబ్లీలో అవమానం జరగడాన్ని జీర్ణించుకోలేక రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇటీవల కానిస్టేబుల్ రాజీనామా చేయగా, తాజాగా మరో ఉద్యోగి రిజైన్ చేశారు.

FOLLOW US: 

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై, ఆయన కుటుంబంపై అసెంబ్లీ సాక్షిగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని తన భార్య భువనేశ్వరిపై సైతం తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు బాధను తట్టుకోలేక ప్రెస్ మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. అది మొదలుకుని టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు పెరుగుతోంది. చంద్రబాబుపై అభిమానంతో ఇటీవల ఓ కానిస్టేబుల్ రాజీనామా చేయడం తెలిసిందే. తాజాగా మరొకరు ఉద్యోగానికి రాజీనామా చేశారు.

చంద్రబాబుకు అవమానం జరగడంపై కలతచెందిన కడప జిల్లాకు చెందిన ఓ మహిళ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం వై.కోటకు చెందిన దుద్యాల అనితాదీప్తి మెప్మాలో టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ జాబ్‌కు రిజైన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేకోడూరులో ఆదివారం దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం తన రాజీనామా పత్రాన్ని ఉన్నతాధికారులకు అందజేయనున్నానని తెలిపారు.
Also Read: Prakasam: చంద్రబాబును అవమానించారని కానిస్టేబుల్ రాజీనామా

టీడీపీ నేత, శాప్ మాజీ డైరెక్టర్ జయచంద్ర కుమార్తెనే ఈ అనితాదీప్తి. 2014లో ఎర్రగుంట్లలో మెప్మా టౌన్ మిషన్ కో ఆర్డినేటర్‌గా చేరారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబుకు అవమానం జరగడాన్ని జీర్ణించుకోలేక, అందుకు నిరసనగా ఉద్యగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడేళ్లుగా ఉద్యోగం చేస్తున్నానని.. కానీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తనను బాధించాయన్నారు. 2024లో చంద్రబాబు తిరిగి సీఎం అయ్యేందుకు తనవంతుగా పనిచేస్తానన్నారు. ఆయన తిరిగి సీఎం అయ్యాక ఉద్యోగంలో మళ్లీ చేరుతానని వ్యాఖ్యానించారు.

Koo App
శాసనసభలో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వైకాపా శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోరుతూ తెలుగు మహిళలు ఆధ్వర్యంలో ఏ.ఎం.జీ స్కూల్ నుండి పాదయాత్ర చేసి దుమ్ములుపేట సెంటర్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సిఎం డౌన్ డౌన్, ద్వారంపూడి క్షమాపణ చెప్పాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. #kakinada #tdp - Daily News (@daily_news05) 22 Nov 2021

ఇటీవల కానిస్టేబుల్ రాజీనామా
ప్రకాశం జిల్లాకు చెందిన విజయ్ కృష్ణ అనే కానిస్టేబుల్ 1998 బ్యాచ్.. రాతపరీక్షలోనూ టాపర్‌గా నిలిచారు. 2002 ఒంగోలు పీటీసీలో బెస్ట్ షూటర్‌గా నిలిచారు. 2003లో కూడా బెస్ట్ షూటర్ గా అవార్డు పొందారు. చంద్రబాబు హయాంలోనే ఆయనకు ఉద్యోగం వచ్చిందని, అలాంటి వ్యక్తికి అసెంబ్లీ సాక్షిగా అవమానం జరగడాన్ని తట్టుకోలేకపోయారు.

చంద్రబాబుకు మద్దతుగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నైతిక విలువలు, నిబద్దత కోల్పోయిన ఈ ప్రభుత్వం మరింత దారుణంగా ప్రవర్తిస్తుందన్నారు. తాను ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేశానని, ఎక్కడా చేయి చాచలేదని ఏపీలో పరిస్థితులు పోలీసులకు తెలునంటూ ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అయింది.

Also Read: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన... కడప-అనంతపురం మధ్య రాకపోకలు బంద్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Nov 2021 11:21 AM (IST) Tags: AP News Chandrababu AP Assembly Sessions Mepma Employee Anitha Deepthi Constable Resign For Chandrababu Anitha Deepthi Employee Resign For Chandrababu

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 17 August: నేడు వాహనదారులకు శుభవార్త, చాలా దిగొచ్చిన ఇంధన ధరలు

Petrol-Diesel Price, 17 August: నేడు వాహనదారులకు శుభవార్త, చాలా దిగొచ్చిన ఇంధన ధరలు

TTD Darshan Tickets: భక్తులకు టీటీడీ శుభవార్త - రేపు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

TTD Darshan Tickets: భక్తులకు టీటీడీ శుభవార్త - రేపు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

Gold-Silver Price: నేడు భారీగా తగ్గిన బంగారం ధర, వెండి కిలోకు రూ.1,400 కిందికి - నేటి తాజా ధరలు ఇవీ

Gold-Silver Price: నేడు భారీగా తగ్గిన బంగారం ధర, వెండి కిలోకు రూ.1,400 కిందికి - నేటి తాజా ధరలు ఇవీ

Farmer Family Protest: రోడ్డుపై అడ్డంగా పడుకుని రైతు కుటుంబం నిరసన - కారణం తెలిస్తే చలించిపోతారు 

Farmer Family Protest: రోడ్డుపై అడ్డంగా పడుకుని రైతు కుటుంబం నిరసన - కారణం తెలిస్తే చలించిపోతారు 

Weather Updates: మరో అల్పపీడనం ముప్పు, ఏపీలో ఎఫెక్ట్ ఇలా - తెలంగాణలో 2 రోజులు IMD ఎల్లో అలర్ట్

Weather Updates: మరో అల్పపీడనం ముప్పు, ఏపీలో ఎఫెక్ట్ ఇలా - తెలంగాణలో 2 రోజులు IMD ఎల్లో అలర్ట్

టాప్ స్టోరీస్

KCR : బీజేపీ వల్లే సమస్యలు - తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కేసీఆర్ పిలుపు !

KCR  : బీజేపీ వల్లే సమస్యలు -  తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కేసీఆర్ పిలుపు !

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

Milk Price : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు

Milk Price  : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు