By: ABP Desam | Updated at : 22 Nov 2021 04:53 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
చిన్నప్పటి నుంచి ఆమెకు డాక్టర్ కావాలని ఆశ.. డాక్టర్ అయింది. కానీ అది వేరే దారిలో.. బైక్ లు తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ.. పథకాలు పెట్టి.. వందల మందిని.. మోసం చేసింది. ఆమె ఎందుకలా చేసింది. మోసం చేయడం ఎలా మెుదలుపెట్టింది?
తక్కువ ధరకే.. ద్విచక్ర వాహనాలు.. ఇప్పిస్తామంటూ.. కునుకుల పల్లవిరెడ్డి అనే మహిళ కొన్ని స్కీములు ప్రకటించారు. ఇంకేం తక్కువ ధరకే అని చెప్పగానే.. చాలా మందికి ఆశ పుట్టింది. ఆ ఆశే ఆమెకి బిజినెస్ అయింది. వందలాది మంది నమ్మేశారు. డబ్బులు చెల్లించారు. అలా డాక్టర్ కావాలనుకుని ఆమె చీటర్ అయింది. హైదరాబాద్ జవహర్ నగర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుంటే.. ఆసక్తికర విషయాలు తెలిశాయి.
మోసం చేయాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది అని అడిగారు పోలీసులు.. ఆమె చెప్పిన సమాధానం విని పోలీసులే షాక్ అయ్యారు.
'ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందంటూ అంతర్జాలంలో వెతికా. ఒక వెబ్‌సైట్‌ను సంప్రదిస్తే ఫ్రాంచైజీ తీసుకోవాలని చెప్పారు. మరో వ్యక్తి పేరుతో సభ్యత్వం తీసుకున్నాను. ఆ తర్వాత వాళ్లు ఎలా మోసం చేస్తున్నారో పరిశీలించేదానిని. కుషాయిగూడ, దమ్మాయిగూడ, పీర్జాదిగూడ.. మరికొన్ని ప్రాంతాల్లో షోరూంలను ప్రారంభించాను. 40 మందితో ప్రత్యేకంగా కాల్‌సెంటర్ తెరిచా.
వెంటనే.. ఎవరూ ముందుకు రాలేదు. వ్యక్తిగత వివరాలను.. అమ్మేసే.. వెబ్ సైట్ల గురించి ఎంక్వైరీ చేశాను. ఒక యాప్ లో రూ.2 వేలు పెట్టి.. 10 వేల ఫోన్ నంబర్లను సంపాదించా. ఆల్ రెడీ పెట్టుకున్న 40 మంది టెలీకాలర్స్ తో కాల్ చేయించా. తక్కువ ధరలకే బైక్స్ అంటూ కొన్ని స్కీములు చెప్పించాను. మాయమాటలు చెప్పి.. షోరూంకి రప్పించా. అక్కడికి వచ్చిన వారికి స్టాంప్ కాగితంపై ఒప్పందం రాసిచ్చా. నమ్మకం కుదిరాక.. మెుదట చేరిన వారే.. మిగతా వారిని చేర్పించారు. వందలమంది సభ్యులుగా చేరారు.' అని ఆమె పోలీసులకు వివరించింది. బాధితుల సంఖ్య వేలల్లో ఉంటుందని జవహర్‌నగర్ పోలీసులు అంచనా వేశారు. రూ.5 కోట్లపైనే వసూలు చేసి ఉండొచ్చని చెబుతున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారించి పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
బురిడీ కొట్టించి.. దోచుకున్న డబ్బులతో విలాస జీవితం గడిపినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. సెక్యూరిటీ కోసం బౌన్సర్లు కూడా ఉండేవారు. అయితే ఆమెకు డాక్టర్ కావాలనే కల మాత్రం అలానే ఉండిపోయింది. సేవా కార్యక్రమాలను నిర్వహించి.. సోషల్ మీడియాలో ప్రచారం చేయించారు. దీనికోసం ఓ పీఆర్ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక డాక్టర్ ఎలాగైనా.. కాలేకపోయానని.. పేరు పక్కనైనా డాక్టర్ ఉండాలని.. డబ్బులు చెల్లించి.. మధ్యవర్తి సాయంతో డాక్టరేట్ ను కొన్నట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.
Also Read: Warangal: ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..
Also Read: Kadiri: పరాయి వ్యక్తితో బెడ్‌రూంలో భార్య, భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి.. చివరికి ఏమైందంటే..
Also Read:Acid Attack: ఇద్దరు పిల్లలున్నా వింత కోరిక.. కాదన్నాడని ప్రియుడిపై యాసిడ్ పోసేసిన మహిళ..
Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Gujarat: ఆశారాం బాపూకి షాక్ ఇచ్చిన గుజరాత్ కోర్టు, అత్యాచార కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం
Kothhagudem Crime News: వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి - 15 మంది బాలికలకు విముక్తి!
Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?