News
News
X

Warangal: ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..

జిల్లాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూళ్ళకు పాల్పడిన వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు సొమవారం అరెస్టు చేశారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

FOLLOW US: 

వరంగల్ కమిషనరేట్ పరిధితో పాటు చుట్టు ప్రక్కల జిల్లాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూళ్ళకు పాల్పడిన వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు సొమవారం అరెస్టు చేశారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితుల నుండి రూ.21.7 లక్షల నగదు, రెండు ఖరీదైన కార్లతో పాటు రెండు సెల్‌ఫోన్లు, నకిలీ గుర్తింపు కార్డులు, ఇతర నకిలీ పత్రాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగానికి సంబంధించిన బెల్ట్, టోపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు సంబందించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడు వినయ్ పాల్ రెడ్డి 2009లో ములుగు జిల్లా బండారు పల్లె గ్రామ వీఆర్వోగా విధులు నిర్వహించేవాడు. నిందితుడికి ఇదే సమయంలో ములుగు రెవెన్యూ విభాగం ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పోరిక అనసూయతో పరిచయం అయింది. ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లి జరిగినా.. కొద్ది కాలం సహజీవనం చేసి వివాహం చేసుకున్నారు. నిందితులిద్దరు రెవెన్యూ విభాగంలో ఉద్యోస్తులు కావడంతో నిందితులు ఇద్దరు నకిలీ దస్తావేజులు, డాక్యుమెంట్లను తయారు చేసి అవినీతికి పాల్పడ్డారు. 2012 సంవత్సరంలో నిందితులపై ములుగు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నుండి తొలగించారు.

కొద్ది కాలం అనంతరం నిందితులకు నకిలీ జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఇండియా విభాగం కమిషనర్ రాజ్ కె.పి. సిన్హా అనే వ్యక్తితో ఢిల్లీలో పరిచయం అయింది. ఇతని ద్వారా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఇండియా విభాగం పేరుతో నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుండి డబ్బులు వసూళ్ళ పాల్పడేందుకు నిందితులు ప్రక్కా ప్రణాళికను రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా నిందితుల్లో ప్రధాన నిందితుడైన వినయ్ పాల్ రెడ్డి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ ఏ.పి విభాగం, భార్య పోరిక అనసూయను స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ విభాగానికి కమిషనర్లుగా, మరో నిందితుడు సాకేతను అసిస్టెంట్ కమిషనర్‌గా నకిలీ హోదాలతో నిరుద్యోగులను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ నియామాలను చేపట్టడం జరుగుతుందని ప్రచారం చేయడంతో నిరుద్యోగులు ఉద్యోగాన్ని బట్టి ఒక్కోక్క నిరుద్యోగి నుండి సుమారు 5 లక్షల నుండి 3లక్షల వరకు డబ్బులు వసూళ్ళకు పాల్పడ్డారు. కొద్దికాలం అనంతరం 2019 ఆగస్టు నుంచి గత సంవత్సరం ఆగస్టు వరకు 241 మంది నిరుద్యోగులను వరంగల్, నల్గొండ ప్రాంతాల్లో 15 రోజుల పాటు శిక్షణ అందజేసి శిక్షణ అనంతరం వరంగల్, నర్సంపేట్, నెక్కొండ, హన్మకొండ, నల్గొండ, మంచిర్యాల్, ములుగు, కరీంనగర్ జిల్లా లోని వివిధ పాఠశాల్లో విధులు నిర్వహించాల్సిందిగా నకిలీ ఉత్తర్వులను అందజేశారు. ఈ ఉత్తర్వులు నకిలీ అని తెలియడంతో అందరూ కంగుతిన్నారు. 

దీంతో బాధిత నిరుద్యోగులు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను విచారించగా వారు పాల్పడిన మోసాలను అంగీకరించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏఎస్పీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్స్ స్పెక్టర్, మట్వాడా ఇన్స్‌స్పెక్టర్ గణేష్, ఎస్.ఐ అశోక్ శ్రీనివాస్ జీ, సంతోష్, హెడ్ కానిస్టేబుళ్ళు శ్యాంసుందర్, శ్రీకాంత్, లియాఖత్ ఆలీ, సృజన్, మహేందర్, శ్రీనివాస్‌ను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Also Read: ఆర్టీసీపై పాట.. భీమ్లా నాయక్ స్టైల్‌లో.. కిన్నెర మొగులయ్య పాడితే.. రీ ట్వీట్ చేసిన సజ్జనార్

Also Read: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం ! కొత్త వ్యూహం ఏమిటి ?

Also Read: సాగు చట్టాల విషయంలో కేంద్రంలాగే ఏపీ ప్రభుత్వం కూడా మనసు మార్చుకుందా ? కొత్త మార్గంలో 3 రాజధానులు తెస్తారా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Nov 2021 02:39 PM (IST) Tags: Mulugu District warangal police fake jobs scam fake jobs in warangal vro scam in warangal Warangal police commissioner

సంబంధిత కథనాలు

What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!

What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!

Banda Boat Accident : ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం, యమునా నదిలో పడవ బోల్తా , 17 మంది గల్లంతు!

Banda Boat Accident : ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం, యమునా నదిలో పడవ బోల్తా , 17 మంది గల్లంతు!

Rayachoti Crime : కోడలి తల నరికిన అత్త, తలతో పోలీస్ స్టేషన్ కు!

Rayachoti Crime :  కోడలి తల నరికిన అత్త, తలతో పోలీస్ స్టేషన్ కు!

Hyderabad Crime : జీడిమెట్లలో దారుణం, బ్యూటిషన్ పై స్నేహితుడే అత్యాచారం!

Hyderabad Crime : జీడిమెట్లలో దారుణం, బ్యూటిషన్ పై స్నేహితుడే అత్యాచారం!

Maharastra News : మహారాష్ట్రలో మరో పార్థా - లీడర్ మాత్రేమ కాదు నోట్ల గుట్టలు మాత్రం సేమ్ టు సేమ్ !

Maharastra News : మహారాష్ట్రలో మరో పార్థా - లీడర్ మాత్రేమ కాదు నోట్ల గుట్టలు మాత్రం సేమ్ టు సేమ్ !

టాప్ స్టోరీస్

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!