News
News
X

Kannababu: టీడీపీ నేతలే వ్యక్తిగత దాడులు ప్రారంభించారు... బాబాయ్ గొడ్డలి నినాదాలు చేశారు... అసెంబ్లీ వివాదంపై మంత్రి కన్నబాబు

చంద్రబాబు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. టీడీపీ నేతలే సభలో బాబాయ్ గొడ్డలి అని నినాదాలు చేశారన్నారు.

FOLLOW US: 

చంద్రబాబు విలువలతో కూడిన రాజకీయం ఎప్పుడూ చేయలేదని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎంపీ వంగా గీతతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవసాయంపై ఆధారపడిన రైతులను ఏ విధంగా ఆదుకోవాలని చర్చిస్తుంటే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వ్యక్తిగత దాడులు ప్రారంభించిందని ఆరోపించారు. బాబాయ్ గొడ్డలి నినాదాలు చేస్తూ సభను తప్పుదోవ పట్టించిందన్నారు. చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. ఒక అసత్యాన్ని సత్యంగా చిత్రీకరించడం సబబుకాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం వేల కోట్లు  ఖర్చు పెడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళను అమ్మ అనే సంబోధించేతత్వం సీఎం జగన్ కు ఉందన్నారు. 

Also Read:ఆడపడుచులను కించ పరచడం అరాచకమే.. ఏపీ అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన

మహిళల సాధికారతకు సీఎం జగన్ కృషి

ఎంపీ వంగా గీత మాట్లాడుతూ సీఎం జగన్ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మహిళలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు. దేశంలో వ్యవసాయ బిల్లుల మీద వ్యతిరేకంగా రైతుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు చట్టాలను రద్దు చేసిందని గుర్తుచేశారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ రైతులను క్షమాపణ కోరారని తెలిపారు.

Also Read: ఏపీ అసెంబ్లీ ఘటనపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏం చేయాలో జగన్‌కు సలహా !

చంద్రబాబు కర్మఫలితం అనుభవిస్తున్నారు : ఎమ్మెల్యే ద్వారంపూడి 

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు వివాదంపై  కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు ఎన్టీఆర్ ని ఎంత ఆత్మ క్షోభ పెట్టారో అని వీడియోలను ప్రదర్శించారు. కుప్పం ఓటమితో దిమ్మతిరిగి అసెంబ్లీలో చంద్రబాబు వింత వింతగా ప్రవర్తిస్తున్నారన్న ద్వారంపూడి ఆరోపించారు. ఎన్. టి.రామారావును బాధపెట్టారు కాబట్టి చంద్రబాబు కర్మఫలం అనుభవిస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో గెలుపుకోసం బాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు భార్యను వైసీపీ నేతలు ఒక్కరూ ఏమీ అనలేదన్నారు. ప్రజలందరూ చంద్రబాబు ఏడుపు, యాక్షన్ నమ్మరని తెలిపారు. 

Also Read: వరద బాధిత ప్రాంతాలకు చంద్రబాబు.. బాధితుల్ని ఆదుకోవాలని పార్టీ శ్రేణులకూ సూచనలు !

Also Read: మా భువనేశ్వరిపై కామెంట్స్ బాధకరం .. విలువలతో పెరిగాం.. ఆ విషయంపై మేం రాజీపడే ప్రసక్తే లేదు: పురంధేశ్వరి

Also Read: అనాగరికం... సాటి మనుషులపై క్రూరత్వం... నీచ సంస్కృతికి దిగజారకండి - వైసీపీ తీరుపై నాగబాబు హాట్ కామెంట్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Nov 2021 08:54 PM (IST) Tags: tdp AP News AP Assembly session chandrababu emotional kannababu comments

సంబంధిత కథనాలు

Independence Day 2022: కోనసీమ జిల్లాలో ఆ గ్రామానికి ఇండిపెండెన్స్ డే వెరీ వెరీ స్పెషల్, ఈ విశేషాలు మీకు తెలుసా

Independence Day 2022: కోనసీమ జిల్లాలో ఆ గ్రామానికి ఇండిపెండెన్స్ డే వెరీ వెరీ స్పెషల్, ఈ విశేషాలు మీకు తెలుసా

Tirumala: టీటీడీలో టిక్కెట్ల మోసం - ఇంటి దొంగతో పాటు, మరో ఐదు మంది దళారులు అరెస్టు

Tirumala: టీటీడీలో టిక్కెట్ల మోసం - ఇంటి దొంగతో పాటు, మరో ఐదు మంది దళారులు అరెస్టు

Garbage Tax: చెత్త పన్ను చెల్లించకపోతే చేయూత పథకం కట్, ఆడియోలు వైరల్!

Garbage Tax: చెత్త పన్ను చెల్లించకపోతే చేయూత పథకం కట్, ఆడియోలు వైరల్!

Breaking News Live Telugu Updates: జూరాల ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద, 36 గేట్లు ఎత్తిన అధికారులు

Breaking News Live Telugu Updates: జూరాల ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద, 36 గేట్లు ఎత్తిన అధికారులు

TDP Politics: టీడీపీలో వర్గపోరు - కళా వెంకట్రావును తప్పించారా ! అసలేం జరుగుతోంది?

TDP Politics: టీడీపీలో వర్గపోరు - కళా వెంకట్రావును తప్పించారా ! అసలేం జరుగుతోంది?

టాప్ స్టోరీస్

Revanth Reddy : మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరిండు - రేవంత్ రెడ్డి

Revanth Reddy : మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరిండు - రేవంత్ రెడ్డి

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

Bandi Sanjay: ఈడీని వాడితే ఒక్కరూ మిగలరు, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు - గన్‌ ఫైరింగ్‌పై కూడా

Bandi Sanjay: ఈడీని వాడితే ఒక్కరూ మిగలరు, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు - గన్‌ ఫైరింగ్‌పై కూడా

India National Anthem: జాతీయగీతాన్ని తొలిసారి ఎక్కడ ఆలపించారు? సింధు పదంపై వివాదమెందుకు?

India National Anthem: జాతీయగీతాన్ని తొలిసారి ఎక్కడ ఆలపించారు? సింధు పదంపై వివాదమెందుకు?