అన్వేషించండి

NTR Reaction : ఆడపడుచులను కించ పరచడం అరాచకమే.. ఏపీ అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన

అడవాళ్లను కించ పర్చడం అరాచకానికి నాంది అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఏపీ అసెంబ్లీ ఘటనపై ఆయన వీడియో విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు దారుణంగా మాట్లాడటంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగియడంతో కుటంబసభ్యులతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ్నుంచే వీడియో సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

 

Also Read : పవిత్రమైన అసెంబ్లీలో ఎన్టీఆర్ కుమార్తెపై దారుణమైన మాటలా ? ఇక సహించబోమన్న నందమూరి కుటుంబం !

జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నారంటే   
 " మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సర్వ సాధారణం. అవి ప్రజా సమస్యలపై జరగాలే కానీ, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలుగా ఉండకూడదు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచి వేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పాలనకు నాంది పలుకుంది. స్త్రీ జాతిని గౌరవించటం అనేది మన సంస్కృతి. మన నవ నాడుల్లో, మన జవ జీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయిన ఒక సంప్రదాయం. దాన్ని రాబోయే తరాలకు జాగ్రత్తగా అప్పగించాలి. అంతేకానీ, మన సంస్కృతిని కలచి వేసి, కాల్చేసి ఇదే రాబోయే తరాలకు  బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు"  

Also Read : అనాగరికం... సాటి మనుషులపై క్రూరత్వం... నీచ సంస్కృతికి దిగజారకండి - వైసీపీ తీరుపై నాగబాబు హాట్ కామెంట్స్

" ఈ మాటలు నేను ఒక వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఈ దేశానికి చెందిన ఒక పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడే ఆపేయండి. ప్రజాసమస్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నా"అని ఎన్టీఆర్ వీడియోను ముగించారు. 

Also Read : మా భువనేశ్వరిపై కామెంట్స్ బాధకరం .. విలువలతో పెరిగాం.. ఆ విషయంపై మేం రాజీపడే ప్రసక్తే లేదు: పురంధేశ్వరి

భువనేశ్వరిపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై నందమూరి కుటుంబం అంతా ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలకృష్ణ ఇంట్లో కుటుంబసభ్యులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. నందమూరి కల్యాణ్ రామ్, నారా రోహిత్ వంటి వాళ్లు ట్వీట్ల ద్వారా తమ అభిప్రాయం తెలియచేశారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించరా అని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిన తరుణంలోఆయన వీడియో విడుదల చేశారు. అయితే ఇందులో ఎక్కడా అసెంబ్లీలో ఆ మాటలు అన్న ఎమ్మెల్యేల పేర్లను కానీ చంద్రబాబు, భువనేశ్వరిల ప్రస్తావన కానీ తీసుకురాలేదు. 

Also Read: AP Chandra Babu : మళ్లీ గెలిచాకే అసెంబ్లీకి వెళ్తా.. కుటుంబాన్ని అవమానించారని విలపించిన చంద్రబాబు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Mega DSC Notification: నిరుద్యోగుల‌కు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ పై ప్రభుత్వం కీలక ప్రకటన
నిరుద్యోగుల‌కు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ పై ప్రభుత్వం కీలక ప్రకటన
Telangana Alert on Bird flu: బర్డ్‌ఫ్లూపై తెలంగాణ సర్కార్ అలర్ట్, ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలు వెనక్కే
బర్డ్‌ఫ్లూపై తెలంగాణ సర్కార్ అలర్ట్, ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలు వెనక్కే
Pawan Kalyan: ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే
ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే
Vishwak Sen: ప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Toyaguda Villagers Meet After 40 Years | నాలుగు దశాబ్దాల నాటి జ్ఞాపకాల ఊరిలో | ABP DesamDwarapudi Adiyogi Statue | కోయంబత్తూరు వెళ్లలేని వాళ్లకోసం ద్వారపూడికే ఆదియోగి | ABP DesamKarthi Visits Tirumala | పవన్ తో వివాదం తర్వాత తొలిసారి తిరుమలకు కార్తీ | ABP DesamRam Mohan Naidu Yashas Jet Flight Journey | జెట్ ఫ్లైట్ నడిపిన రామ్మోహన్ నాయుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Mega DSC Notification: నిరుద్యోగుల‌కు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ పై ప్రభుత్వం కీలక ప్రకటన
నిరుద్యోగుల‌కు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ పై ప్రభుత్వం కీలక ప్రకటన
Telangana Alert on Bird flu: బర్డ్‌ఫ్లూపై తెలంగాణ సర్కార్ అలర్ట్, ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలు వెనక్కే
బర్డ్‌ఫ్లూపై తెలంగాణ సర్కార్ అలర్ట్, ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలు వెనక్కే
Pawan Kalyan: ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే
ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే
Vishwak Sen: ప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Ayodhya Temple Priest Passes Away: అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
ICC Champions Trophy: ఆసీస్ కు కొత్త కెప్టెన్.. జ‌ట్టును వేధిస్తున్న గాయాలు.. కొత్త ఆట‌గాళ్ల‌తో బ‌రిలోకి..
ఆసీస్ కు కొత్త కెప్టెన్.. జ‌ట్టును వేధిస్తున్న గాయాలు.. కొత్త ఆట‌గాళ్ల‌తో బ‌రిలోకి..
Actor Prudhvi: నా తల్లి బతికున్నప్పుడు తిడితే నరికేవాడిని... ఆస్పత్రి బెడ్ నుంచి పృథ్వీ ఇంటర్వ్యూ - వైసీపీ సోషల్ మీడియాకు వార్నింగ్
నా తల్లి బతికున్నప్పుడు తిడితే నరికేవాడిని... ఆస్పత్రి బెడ్ నుంచి పృథ్వీ ఇంటర్వ్యూ - వైసీపీ సోషల్ మీడియాకు వార్నింగ్
Revanth Reddy: హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
Embed widget