Jaggareddy : ఏపీ అసెంబ్లీ ఘటనపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏం చేయాలో జగన్‌కు సలహా !
చంద్రబాబు కుటుంబాన్ని కించ పరుస్తూ ఏపీ అసెంబ్లీలో చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. రేపు రివర్స్ అయితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన ఘటనలపై తెలంగాణ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ్మినేని సీతారాం స్పీకర్‌గా అనర్హుడని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఓ సీనియర్ రాజకీయ నాయకుడిని ఇంత దారుణంగా అవమానించడం తప్పన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ తీరును కూడా జగ్గారెడ్డి తప్పు పట్టారు. చంద్రబాబు కుటుంబాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు తిట్టేటప్పుడు జగన్ నవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే నీ పరిస్థితి ఏంటి జగన్ ప్రశ్నించారు.
Also Read : ఆడపడుచులను కించ పరచడం అరాచకమే.. ఏపీ అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన
ఏపీలో ప్రజాస్వామ్యం లేని పాలన అనిపిస్తుందిన్నారు. అసెంబ్లీ హల్ లాగా లేదు.. గొర్రెను కభేలా లకు పంపినట్టు ఉందని విమర్శించారు. తన మాటలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా తన అభిప్రాయం చెబుతున్నానన్నారు. చంద్రబాబు తనను గుర్తు పడతారో లేదో తెలియదని..అంత పరిచయం కూడా లేదన్నారు. కానీ ఓ సీనియర్ నాయకుడిని ఇలా అవమానించడం సరికాదన్నారు. ఇవాళ జగన్ తోపు కావొచ్చు కానీ.. ఇలాగే పాలన కొనసాగిస్తే రివర్స్ అవుతుందని జోస్యం చెప్పారు.
వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, జగన్ ప్రవర్తన సరి కాదని.. సమాజానికి తప్పుడు సంకేతం పంపారని విమర్శించారు. వారు అన్న మాట జగన్‌నో.. నానినో అని ఉంటే ఎలా ఉంటుందో ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా టార్గెట్ చేశారనే కాదు.. ఫ్యామిలిని తిట్టారనే చంద్రబాబు ఏడ్చారని అన్నారు. ఏడుపు అపుకొనే ప్రయత్నం చేసినా.. ఆగలేదని, కుటుంబ సభ్యుల పై విమర్శలు వస్తే.. ఎవరు కంట్రోల్ చేసుకోలేరని పేర్కొన్నారు. ఏపీతో తనక్కూడా అనుబంధం ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నానని అన్నారు. మంత్రి అనిల్ అయితే కుస్తీ కి దిగినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబునీ అలా తిట్టడం కనకు బాధ అనిపించిందన్నారు. కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయమే బాబుకు జరిగిందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తన అభిప్రాయాలను నిక్చచ్చిగా చెప్పే ఎమ్మెల్యేగా జగ్గారెడ్డికి పేరుంది. అందుకే ఆయన మాటలు తరచూ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఆయన ఏపీ రాజకీయాలపై వ్యాఖ్యానించడం కూడా చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. అయితే తాను పార్టీ తరపున స్పందించడం లేదని.. ఆయన నేరుగానే చెప్పారు.