Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Ram Gopal Varma News Today: పోలీసుల కేసులకు భయపడిపోలేదని షూటింగ్ కోసం అవుట్ డోర్ వెళ్లినట్టు చెప్పుకొచ్చారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. అజ్ఞాత ప్రాంతం నుంచి ఓ వీడియో రిలీజ్ చేశారు.
Ram Gopal Varma Comments: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రాత్రి ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను భయపడి పారిలేదని సినిమా షూటింగ్ విషయంలో తిరుగుతున్నట్టు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తనపై రిజిస్టర్ అయిన కేసులో విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
నేను పారిపోలేదు: ఆర్జీవీ
భయపడి పారిపోయాడనే వాళ్లకు ఈ వీడియో చాలా నిరాశ కలిగిస్తుందని ప్రారంభించిన రామ్‌గోపాల్ వర్మ... ఎవరికీ తాను భయపడేది లేదన్నాడు. ఎప్పుడో ఏడాది క్రితం చేసిన ట్వీట్‌తో ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని వివిధ ప్రాంతాల్లో ఉన్న నలుగురు వ్యక్తులు కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు ఆ ట్వీట్ ఎవరిపై పెట్టానో వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదని కానీ సంబంధం లేదని మూడో వ్యక్తులు ఇబ్బది పడటమేంటని ప్రశ్నించారు.
నాకు ఆ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?: ఆర్జీవీ
ఇంకా ఏమన్నారంటే... థర్డ్ పార్టీ వ్యక్తుల ఫిర్యాదుతో ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?. ఇది నాకే కాదు మా వాళ్లందరికీ ఇదే అనుమానం కలుగుతోంది. పోలీసులను ఆయుధంగా చేసుకుని రాజకీయ నాయకులు పాలన సాగిస్తున్నారని అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరఫ్ లాంటి దేశాల్లో ఇదే జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతేనేమో. " అని కామెంట్స్ చేశారు.
Also Read: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
షూటింగ్‌లో ఉన్నాను: ఆర్జీవీ
తాను ఎక్కడికీ పారిపోలేదని షూటింగ్ కోసం అవుట్‌డోర్‌కు వచ్చానని చెప్పుకొచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చానని అన్నారు. తనకు సమయం ఇస్తే కచ్చితంగా విచారణకు హాజరవుతారనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వస్తే షూటింగ్ మధ్యలో ఆగిపోయి నిర్మాతలకు నష్టం వస్తుందని వివరణ ఇచ్చారు. అందుకే ఇప్పుడు రాలేకపోతున్నట్టు పేర్కొన్నారు.
నేడు ముందస్తు బెయిల్‌పై విచారణ
ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం రామ్‌గోపాల్ వర్మ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి తిరస్కరణకు గురైనప్పటికీ మరోసారి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబందించి ఏపీ హైకోర్టు నేడు విచారణకు రానుంది.
ఈ సోషల్ మీడియా కేసుల్లో రెండుసార్లు నోటీసులు ఇచ్చారు ప్రకాశం జిల్లా పోలీసులు. రెండుసార్లు కూడా విచారణకు రామ్‌గోపాల్ వర్మ హాజరుకాలేదు. దీంతో రెండు రోజుల క్రితం నేరుగా హైదరాబాద్‌లో ఉన్న ఆర్జీవీ ఇంటికి పోలీసులు వెళ్లారు. విచారించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వస్తున్నారనే విషయం ముందే తెలుసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయంపై క్లారిటీ లేదు. తమిళనాడులో ఉన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ పోలీసులకు మాత్రం చిక్కడం లేదు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఫ్యామిలీపై అనుచిత కామెంట్స్ సోషల్ మీడియాలో చేశారని ఆరోపణలతో ప్రకాశం జిల్లాలో కేసు నమోదు అయింది.
Also Read: దుమారం రేపుతోన్న మంత్రి సుభాష్ వ్యాఖ్యలు, లోనికి వెళ్లనున్న ఆ మాజీ మంత్రి ఎవరు?