పీవీ నరసింహా రావుకి రతన్ టాటా లెటర్, వైరల్ అవుతున్న లేఖ
రతన్ టాటాకి ట్రిబ్యూట్ ఇస్తూ ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్షా గోయెంక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. 1996లో రతన్ టాటా స్వయంగా రాసిన ఓ లెటర్‌ని షేర్ చేశారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావుకి ఈ లేఖ రాశారు టాటా. భారత్‌లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన నరసింహారావుకి థాంక్స్ చెబుతూ ఈ నోట్ రాశారు. ఈ లెటర్‌లో పీవీపై ప్రశంసలు కురిపించారు రతన్ టాటా. మీరు తీసుకొచ్చిన సంస్కరణలకు ప్రతి భారతీయుడూ ఎప్పటికీ రుణపడి ఉండాలని అన్నారు. దేశ అభివృద్ధికి ఇదెంతో దోహదం చేసిందని కొనియాడారు. భారత దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత మీదే అని పీవీని ప్రశంసించారు టాటా. ఈ లెటర్‌ని షేర్ చేసిన గోయెంక "బ్యూటిఫుల్ రైటింగ్ ఫ్రమ్ బ్యూటిఫుల్ పర్సన్" అనే క్యాప్షన్ ఇచ్చారు. 1996 ఆగస్టు 27వ తేదీన ఈ లెటర్ రాశారు రతన్ టాటా. ఇండియా అభివృద్ధిపై టాటాకి ఎంత కమిట్‌మెంట్ ఉందో ఈ లేఖ ఓ సాక్ష్యమని అంతా ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.