అన్వేషించండి

Adilabad Holi: మోడువారిన అడవిలో ఎర్రని మోదుగ పూలు! జోరుగా ఆదివాసీల హోలీ సంబరాలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు నిర్వహించే మోదుగ పూల హోలీ సంబరాలపై ABP దేశం ప్రత్యేక కథనం.

ఆదిలాబాద్ అడవుల్లోని ప్రకృతి అందాలు అందరిని కనువిందు చేస్తున్నాయి. వర్షాకాలంలో కనిపించే పచ్చని చెట్లు... వేసవిలో మోడువారిన అడవిలో విరబూసిన ఎర్రని మోదుగ పూలు.. దారిలో వస్తు పోయే పర్యాటకులకు చూడముచ్చటగా కనబడటమే కాకుండా ప్రకృతి రమణీయమైన వాతావరణంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. హోళి పండుగను పురస్కరించుకుని ఆదివాసీలు మోదుగ పూలను పూజల్లో వినియోగించడంతో పాటు మోదుగ పూలతో రంగులు తయారు చేసి స్వచ్చమైన పూల రంగులను చల్లుకుంటు హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. వారి జీవనానికి తోడ్పాటునందించే వ్యవసాయ పనుల్లోను హోలీ సందర్భంగా కామ దహనం చేసిన బూడిదను పంట చేలలో ఇళ్ళ గుమ్మాల్లో వేస్తు దుష్ట శక్తులు తొలగిపోయి అంతా మంచి జరగాలని మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు నిర్వహించే మోదుగ పూల హోలీ సంబరాలపై ABP దేశం ప్రత్యేక కథనం.

Adilabad Holi: మోడువారిన అడవిలో ఎర్రని మోదుగ పూలు! జోరుగా ఆదివాసీల హోలీ సంబరాలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో అనేక రకాల చేట్లు ప్రకృతిలో ఓడిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో విరబూసే మోదుగ పూలు ఎర్రని రంగులతో కనువిందు చేస్తు అందరి మనస్సును దోచేస్తున్నాయి. అడవుల్లోనే కాదు ఆదిలాబాద్ జిల్లాను ఆనుకుని ఉన్న రహాదారుల వేంట సైతం ఈ మొధుగ చేట్లు ఎర్రని పూలతో అందరిని ఆకర్షణకు గురి చేస్తున్నాయి. ఆదిలాబాద్ కు వచ్చి పోయే ప్రకృతి ప్రేమికులను ఈ ఎర్రని మోదుగ పూలు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ మోదుగ చెట్టు ఆకులతో పాటు మోదుగ పూలు అడవి బిడ్డలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. 

Adilabad Holi: మోడువారిన అడవిలో ఎర్రని మోదుగ పూలు! జోరుగా ఆదివాసీల హోలీ సంబరాలు

హోళి పండుగ రోజు ఇతర మార్కెట్ లో లభించే రంగులను కాకుండా  ఆదివాసీలు ఈ మోదుగ పూలతో రంగులు తయారు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఆదివాసీల ప్రత్యేక పూజల్లోను ఈ మోదుగ ఆకులతో నైవేద్యం పెట్టడం.. మోదుగ పూలతో ప్రత్యేక పూజలు చేయడం.. హోలీ సందర్భంగా కామదహనంలో మోదుగ పూల హారం 'పుల్లార' లోను వినియోగంలోకి వస్తున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అడవులు అన్ని అటవి ప్రాంతాలకన్న భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో ఎక్కడ చూసిన చూట్టు అడవి.. వేసవిలో మోడు వారిన అడవి కనిపిస్తుంది. మోడు వారిన అడవిలో విరబూసే ఎర్రని మోదుగ పూలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. అడవి చుట్టూ జిల్లా నలుమూలల నుండి పలు రహాదారుల వెంట సైతం ఈ మోదుగ చేట్లు ఉండటంతో బస్సుల్లో వాహానాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను సైతం అవి ఆకర్షణకు గురి చేస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ హోలీ పండుగకు ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలంతా తమ గ్రామాల్లో "దురాడి" ఆతరువాత రోజున "దుర్డి" అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముందుగా దురాడి రోజు అందరి ఇళ్ళలోనుండి కట్టుబాటు ప్రకారం కుడకలు, చక్కేర పెర్లు ప్రసాదలు సేకరించి గ్రామ పెద్ద పటేల్ ఇంటి వద్దకు తెస్తారు. వాటితో సాంప్రదాయ వెదురు కర్రలను చీల్చి నలువైపులా ఉండేలా వాటికి తాడును కట్టి వాటీకి మోదుగ పూలు.. వంకాయ గారేలు.. కుడకలు బిగించి నాలుగు మూలలు వేదురు కర్రకు బిగిస్తారు. దీన్ని ఆదివాసీలు "పుల్లార" అని అంటారు. ఇలా రెండు పుల్లార లను తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 

ఈ పుల్లార పూర్తయిన తరువాత ఒ గొంగడిలో పుల్లారలను తీసుకొని అందరు గ్రామస్తులు కలిసి డోలు వాయిద్యాలతో గ్రామ పొలిమెరలోని పవిత్ర స్థలంలోకి చేరుకొని అడవిలో నుండి తెచ్చిన రెండు ఎండిన వెదురు కర్రలను తీసుకొచ్చి నెలబెడతారు. అక్కడ పూజారితో పూజలు నిర్వహించి వాటిని నెలబెట్టి అందులో దిష్టి తగలకుండా నాటుకోడి గుడ్డును ఉంచుతారు. ఆ తరువాత అందరు గ్రామ పటెల్ దేవారీ గ్రామస్తులంతా కలిసి మాతరి - మాతర అనే వెధురు కర్రలకు పూజలు చేసి... ఆపై అందరిలా కామ దహానం చేస్తారు. ఈ దహనం జరుగుతున్నప్పుడు కొంతమంది తమ ఆచారం ప్రకారం మంటల్లో నుండి అటు, ఇటు వైపు దునుకుతారు. దుష్ట శక్తులు తొలగిపోతాయని ఇలా మంటల్లో నుండి దునుకుతారని ఆదివాసీల నమ్మకం. అనంతరం మంటల్లో కాలుతున్న మాతరి మాతర వెధురు కర్రలు కాలిన తరువాత పడిపోతున్న క్రమంలో రెండు కర్రలకు ఉన్న పుల్లారలు కిందపడకుండా గొంగడిలో సేకరిస్తారు. ఆ పుల్లారలను ప్రసాదాల్లో భాగంగా వినియోగించి.. అక్కడ పాల్గొన్న వారికి మాత్రమే అందిస్తారు. 

Adilabad Holi: మోడువారిన అడవిలో ఎర్రని మోదుగ పూలు! జోరుగా ఆదివాసీల హోలీ సంబరాలు

ఆపై అంతా కలిసి భోజనాలు చేసుకొని డోలు వాయిద్యాలు నడుమ గ్రామాల్లో జాజిరి జాజిరి అంటు సాంప్రదాయ పాటలు పాడుతు ఇంటింటా నూతనంగా వచ్చిన పంటల నవ ధాన్యాలు చెకరిస్తారు. ఈ నవధాన్యాలను సేకరించి ఉడకబెడతారు. ఇది హోలి కి మొదటి రోజున ఆదివాసీలు నిర్వహించే "దురాడి" కార్యక్రమం.. మరుసటి రోజు "దుర్డి" అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం వెకువ జామున ఈ ఉడికించిన నవ ధన్యవాదాలను ఓ పాత్రలో  వేసుకొని, ఓ చెంబులో నీళ్ళు, చేతిలో గొడ్డలి తీసుకొని కామ దహనం అయిన ప్రదేశంలో ఉన్న కొంత బూడిదను తమ వెంట తీసుకొని తమ తమ చేలలోకి వెళ్ళి బూడిదను చల్లి పూజలు చేస్తారు. నవధాన్యాలు భూమాతకు సమర్పించి నీళ్ళు పోసి మొక్కులు చెల్లించి చేలలో ఉన్న పొరకలను గొడ్డలితో కొడతారు. ఆ తరువాతే తమ పొలాల్లో దుక్కి దున్నే పనులను ప్రారంభిస్తారు. ఇలా తమ పంట పొలాలు బాగుండాలని పనులు సాఫీగా జరగాలని పూజలు చేయడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. ఆ తరువాత తిరిగి కామ దహనం అయిన చోట ఈ గొడ్డలని, చేత పట్టుకొచ్చిన కొన్ని నవధాన్యాలను కామ దహనం బూడిద చుట్టూ ఉంచుతారు. ఆపై అందరు గ్రామస్తులు కామ దహనం చోట కోడి లేదా మేకను బలి ఇచ్చి పూజలు చేస్తారు. 

అనంతరం సాంప్రదాయ జొన్న గట్కా వంటకంతో పాటు బలిచ్చిన జంతువుల కూర ను వండుకొని అంతా కలిసి భోజనాలు చేస్తారు. భోజనాలు చేస్తున్న క్రమంలో ఇంటింటా సేకరించి ఉడకబెట్టిన నవధాన్యాలను, పుల్లార లోని ప్రసాదాలు కుడకలు.. చక్కెర పెర్లను అందిస్తారు. ఆపై అందరు తమ తమ గొడ్డల్లను నవ ధన్యవాదాల పాత్రలను తీసుకొని తమ వెంట కొంత కామ దహనం అయిన బూడిదను ఇళ్ళలోకి తిసుకేళ్ళి ఇంటి గుమ్మంలో.. ఇంటి చుట్టూ.. తమ దేవతల వద్ద పెడతారు. తమ వద్దకు ఏ దుష్టశక్తి దూరదన్న నమ్మకంతో ఇలా బూడిదను వెస్తారు. ఆపై హోలీ కోసం రంగులను తయారు చేసుకునేందుకు అడవిలో నుండి మోదుగ పూలను తీసుకొచ్చి మోదుగ పూలను రోట్లో దంచి నీళ్ళలో కలిపి రంగును తయారు చేస్తారు. ఈ తయారు చేసిన రంగులను అందరు తీసుకొని గ్రామస్తులంతా కలిసి డోలు వాయిద్యాలు వాయిస్తు జాజరి జాజిరి .. రెలా రెలా..పాటలు పాడుతు.. ఇంటింటా చేరుకొని ఒ గుల్ల లో కామ దహన బూడిదను కట్టుబాటు ప్రకారం ఇచ్చిన కుడకలను రెండు వక్కలను అందిస్తారు. ఆపై తమ సాంప్రదాయ పూజలు ముగిసాయని అంతా మంచి జరగాలని మొక్కులు చెల్లించి.. మోదుగ పూల రంగులను చల్లుకుంటు సందడిగా హోలి వేడుకలు జరుపుకుంటారు. ఇలా ప్రతియేటా ఆదివాసీలు సాంప్రదాయ బద్దంగా మోదుగ ఆకులతో నైవేద్యం సమర్పించడం.. మోదుగ పూలతో రంగులు తయారు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 

పూర్వకాలం నాటి వైభవాలను సాంస్కృతి సాంప్రదాయాలను నేటికి పాటిస్తున్నామని ఆదివాసీలు చెబుతున్నారు. హోలి రోజున బజారుల్లో అమ్మే కెమికల్ రంగులను వాడొద్దని వాటి వల్ల హాని కలుగుతుందని, తమ సాంప్రదాయ బద్దంగా పెద్దలు పాటిస్తు వస్తున్న క్రమంలో నేటికి తాము పాటిస్తున్నామని, ఈ మోదుగ పూలు.. మోదుగ ఆకులతో అన్ని విధాలుగా తమకు లాభాలున్నాయని, బయట మార్కెట్లో లభించే కెమికల్ రంగులను వాడకుండ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
IPL 2024: బ్యాటింగ్ కు దిగిన  కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sriram Interview | పరిటాల రవి చనిపోలేదంటున్న పరిటాల శ్రీరామ్ | ABP DesamJr NTR Fires on Photographer | ఫొటోగ్రాఫర్లపై ఎన్టీఆర్ ఆగ్రహం | ABP DesamRaptadu MLA Candidate Thopudurthi Prakash Reddy | రాప్తాడులో వైసీపీ జెండానే ఎగురుతుందన్న తోపుదుర్తిHarish Rao vs Addanki Dayakar on Resignation | హరీష్ రాజీనామా అస్త్రంపై అద్దంకి దయాకర్ కౌంటర్లు |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
IPL 2024: బ్యాటింగ్ కు దిగిన  కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Anupama Parameswaran: అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
Warangal News: ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Botsa counter to Piyush Goyal : పీయూష్  గోయల్  వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
పీయూష్ గోయల్ వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
Embed widget