By: ABP Desam | Updated at : 19 Dec 2022 08:10 PM (IST)
Edited By: jyothi
రూ. 11.60 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం!
Sitaphalmandi Govt Hospital: హైదరాబాద్ సీతాఫల్ మండిలోని కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో దవాఖానాల కొత్త భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.11.60 కోట్ల మేరకు నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వ జీవో విడుదలైందని ఉప సభాపతి పద్మారావు గౌడ్ వెల్లడించారు. సోమవారం సీతాఫల్ మండిలోని తన క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. అనంతరం కుట్టి వెల్లోడి ఆసుపత్రిని పరిశీలించారు. ఈ ఆస్పత్రిలో నిత్యం కనీసం 10 డెలివరీ ప్రసూతి కేసులు, 200 మంది రోగులకు ఓపీ వైద్య సేవలు, ఉచితంగా మందులను అందిస్తున్నట్లు తెలిపారు.
సికింద్రాబాద్ పరిధిలో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఈ ఆసుపత్రి పరిధిలో ఉన్నాయి. సుమారుగా 90 గజాల స్థలంలో సీతాఫల్ మండి కుట్టి వెల్లోడి ఆసుపత్రి కొనసాగుతోంది. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా దీనిని తీర్చి దిద్దాలనే లక్ష్యంతోనే కొత్త భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదికలు అందజేసినట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వివరించారు. తాము అడిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి రూ.11.60 కోట్ల నిధులను మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వెంటనే స్పందించినందుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వెంటనే ఏర్పాట్లు జరుపుతున్నామని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఆసుపత్రిని తరలించేందుకు సహకరించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ లను కోరారు.
సికింద్రాబాద్ పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న లాలాపేట స్విమ్మింగ్ పూల్, లాలాపేట మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, అడ్డగుట్ట మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం పనులను పద్మారావు పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో తిరుగుతూ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకున్నారు. లాలాపేట స్విమ్మింగ్ పూల్ కు రూ.ఆరు కోట్లు, ఫంక్షన్ హాల్ కు రూ.ఆరు కోట్లు, అడ్డగుట్ట ఫంక్షన్ హాల్ కు రూ.2.25 కోట్లు మంజూరు చేసినట్లు అయన తెలిపారు. అలాగే సీతాఫల్ మండీలో జూనియర్ డిగ్రీ కళాశాలను సాధించామని వివరించారు. అసాధ్యం అనుకున్న దానిని పోరాడి సాదించుకున్నామని తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
సికింద్రాబాద్ లో మధ్య తరగతి ప్రజలే ఎక్కువని.. మొత్తం రూ.102 కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులన్ని చేపట్టామని స్పష్టం చేశారు. ఏడాదిన్నర కాలంలోనే పనులన్నీ పూర్తి చేసే విదంగా ప్రణాళిక చేసినట్లు వెల్లడించారు. తాను ఎన్నికల అప్పుడు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నట్లు చెప్పారు. తమ పదవీ కాలం ముగిసే లోపు కచ్చితంగా తానిచ్చిన హామీలు పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో పాటు వైద్య శాఖ అధికారులు, బీఆర్ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
TSRJC CET - 2023 దరఖాస్తు గడువు పెంపు, పరీక్ష ఎప్పుడంటే?
నడ్డా తెలంగాణ పర్యటన రద్దు- 8న రానున్న ప్రధానమంత్రి
ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ
YS Sharmila: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత, వైఎస్ షర్మిల అరెస్టు
Biometric Attendance: ఇక ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 'వేలిముద్ర' పడాల్సిందే! అక్రమార్కుల ఆగడాలకు చెక్!
ట్విటర్ వేదికగా కేటీఆర్-బండి మాటల యుద్ధం- మధ్యలో కాంగ్రెస్ కౌంటర్!
NBK108 Dussehra Release : దసరా బరిలో బాలకృష్ణ సినిమా - రామ్, విజయ్, రవితేజ సినిమాలతో పోటీ
Mosquito Coil Fire Delhi: ఢిల్లీలో దారుణం, ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్
Bathukamma Song Bollywood : వెంకీ సలహాతో బాలీవుడ్ సినిమాలో బతుకమ్మ పాట - బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఆట