By: ABP Desam | Updated at : 09 May 2022 10:53 AM (IST)
గీతా ఆర్ట్స్ కార్యాలయం (ఫైల్ ఫోటో)
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట ఓ మహిళ నగ్నంగా నిరసన తెలపడం సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని గీతా ఆర్ట్స్ వద్దకు సోమవారం ఉదయం వచ్చిన ఓ మహిళా ఆర్టిస్ట్ నగ్నంగా ఆందోళనకు దిగింది. తనకు గీతా ఆర్ట్స్ నుంచి డబ్బులు రావాల్సి ఉందని, వాటిని ఇప్పించాలంటూ మహిళా ఆర్టిస్ట్ డిమాండ్ చేసింది. గతంలోనూ ఈ మహిళ ఫిలిం ఛాంబర్, బంజారాహిల్స్ పీఎస్ ఎదుట ఆందోళన చేసినట్లు తెలుస్తోంది. అయినా తనకు డబ్బుల విషయంలో న్యాయం జరగలేదని నేరుగా గీతా ఆర్ట్స్ వద్దకు వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చింది. ఆమె నగ్నంగా ఆందోళన చేస్తుండడాన్ని స్థానిక జీహెచ్ఎంసీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు బట్టలు ఇచ్చి, అక్కడి నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Yoga Day Utsav: యోగా ఉత్సవ్ డే ప్రారంభం- యంగ్‌గా ఉండాలంటే యోగా చేయమంటున్న సెలబ్రెటీలు
Karimnagar News : కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు
TRS Leaders On Modi: తెలంగాణ నేలపై కమలం వికసించే ఛాన్స్ లేదు- మోదీ కామెంట్స్‌కు టీఆర్ఎస్ కౌంటర్
KTR In Davos: తెలంగాణలో హ్యుండాయ్ భారీ పెట్టుబడి- దేశాభివృద్ధికి త్రి ఐ చాలా అవసరమన్న కేటీఆర్
Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు
Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్, నిఫ్టీ
Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్
Mahanadu 2022: టార్గెట్ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం
TDP Mahanadu Live Updates: మహానాడు ప్రారంభం, జ్యోతిప్రజ్వలన చేసిన చంద్రబాబు