Ind Vs Eng T20 Series Updates: టీమిండియా కొంపముంచిన మిస్టేక్స్ అవేనా? - పుంజుకున్న ఇంగ్లాండ్‌ను ఆపేదెలా!, నాలుగో టీ20లో మేలుకోకపోతే కష్టమే
Team India: టీ20ల్లోనే కాకుండా అన్ని ఫార్మాట్లలో ఇంగ్లాండ్ ప్రమాదకరమైన జట్టు.. కొంచెం సందు ఇస్తే, అంతా నాదే అనే రకం. రెండు పరాజయాల తర్వాత వచ్చిన విజయంతో నూతనోత్సాహంతో ఉంది.
![Ind Vs Eng T20 Series Updates: టీమిండియా కొంపముంచిన మిస్టేక్స్ అవేనా? - పుంజుకున్న ఇంగ్లాండ్‌ను ఆపేదెలా!, నాలుగో టీ20లో మేలుకోకపోతే కష్టమే These are the mistakes done by Team India Vs Englang In Rajkot T20 Ind Vs Eng T20 Series Updates: టీమిండియా కొంపముంచిన మిస్టేక్స్ అవేనా? - పుంజుకున్న ఇంగ్లాండ్‌ను ఆపేదెలా!, నాలుగో టీ20లో మేలుకోకపోతే కష్టమే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/28/9b2d932f6cb6eaf5fd39c4b731ce71a51738085547200344_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Team India News: ఇంగ్లాండ్‌తో సొంతగడ్డపై జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. 172 పరుగుల ఛేదనతో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. 26 పరుగుల దూరంలో నిలిచి పరాజయం పాలైంది. అయితే తొలి రెండు టీ20ల్లో భారత్ గెలవడంతో జట్టులోని లోపాలపై ఎవరూ మాట్లాడలేదు. అయితే రాజకోట్‌లో మాత్రం ఆ లోపాలతోనే టీమిండియా పరాభవం పాలైందని చెప్పకతప్పదు. జట్టులోని ఈ లోపాలు సరిదిద్దుకోకపోతే మరిన్ని నష్టాలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమర్ యాదవ్, హెడ్ కోచ్ గౌతం గంభీర్ మిస్టేక్స్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. టీ20ల్లోనే కాకుండా అన్ని ఫార్మాట్లలో ఇంగ్లాండ్ ప్రమాదకరమైన జట్టు.. కొంచెం సందు ఇస్తే, అంతా నాదే అనే రకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు పరాజయాల తర్వాత వచ్చిన విజయంతో నూతనోత్సాహంతో ఉన్న బట్లర్ సేనను కట్టడి చేయాలంటే టీమిండియా తమ వ్యూహాలకు పదును పెట్టక తప్పదు..
తోకను తెంచలేమా..?
చెన్నై, రాజకోట్ టీ20లను గమనించినట్లయితే ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ పోరాటపటిమతోనే పోరాడగలిగే స్కోరును సాధించింది. చెన్నైలో 137/8తో నిలిచిన ఇంగ్లాండ్‌ను లోయర్ ఆర్డర్ బ్యాటర్లు 165 వరకు తీసుకెళ్లారు. ఛేదనంలో తిలక్ వర్మ స్టన్నింగ్ ఫిప్టీతో ఆదుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే చెన్నైలోనే భారత్‌కు పరాభం ఖరారయ్యేది. చెన్నై నుంచి పాఠాలు నేర్చుకుని భారత్.. రాజ కోట్‌లోనూ అదే తప్పును చేసింది 127/7తో నిలిచిన జట్టును 171 వరకు వెళ్లేలా ఉదాసీనత ప్రదర్శించింది. టెయిలెండర్లను నిలువరించే ఆటగాళ్లు లేకపోవడమే దీనికి కారణం. ఇక రెండు మ్యాచ్‌ల్లోనూ వాషింగ్టన్ సుందర్‌ని ఆల్ రౌండర్ కోటాలో తీసుకున్నారు. బౌలింగ్లో ఒక్కో ఓవర్ చొప్పున చేసిన సుందర్.. బ్యాటింగ్ లోనూ అంతంతమాత్రంగానే రాణించాడు. అతనికంటే మంచి పేసర్ ను తీసుకుంటే ఫలితం వేరేలాగా ఉండేది. టెయిలెండర్లను త్వరగా పెవిలియన్‌కు పంపే వికెట్ టేకింగ్ పేసర్ అందుబాటులో ఈ కథ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. ఇక జట్టులో నలుగురు స్పిన్నర్ల అవసరం కూడా అంత లేదు. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తమ పాత్రలను పోషిస్తున్నారు. సో సుందర్ స్థానంలో ఒక పేసర్ ఉంటే బాగుంటుందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ పరజాయాలు ఎదురైనా తన ప్రణాళికలకే కట్టుబడి విజయం సాధించింది.
మ్యూజికల్ చెయిర్స్ లా బ్యాటింగ్ ఆర్డర్..
ఇక భారత బ్యాటర్లు అసలే ఫామ్‌లో లేరు. దీనికి తోడు ఎవరు ఏ స్థానంలో ఆడాలనే దానిపై స్పష్టత లేదు. రెండో టీ20లో వన్డౌల్ వచ్చిన తిలక్ వర్మను మూడో టీ20లో నాలుగో స్థానంలో ఆడించాల్సిన అవసరం ఏముంది.? కెప్టెన్ సూర్య.. మూడో స్థానంలోకి వచ్చి సాధించినదేమీ లేదు. అదే తిలక్ మూడో స్థానంలో వస్తే కథ వేరేలాగా ఉండేదని అభిమానులు భావిస్తున్నారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో నిలకడ లోపిస్తోంది. స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంటే ఆటగాళ్లకు సన్నద్ధమయ్యేందుకు అవకాశముంటుంది. తాము ఎప్పుడు ఎక్కడా బ్యాటింగ్ చేయాలనేదానిపై కన్ఫ్యూజన్ ఉండదు. మూడో టీ20లో స్పెషలిస్టు బ్యాటర్ ధ్రువ్ జురెల్ ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ లో దింపడంలో అర్థం లేదు. ఛేదనలో తనను కనీసం కాస్త ముందు పంపించినా జట్టుకు యూజు అయ్యేది. ఐపీఎల్లో మిడిలార్డర్లో తను మెరుపు బ్యాటింగ్ చేసిన అనుభవం ఉంది. ఇక ఓపెనర్ సంజూ శాంసన్ వీక్నెస్ ను జోఫ్రా ఆర్చర్ పట్టేశాడు. సిరీస్ లో వరుసగా మూడుసార్లు ఆర్చర్ కే శాంసన్ చిక్కాడు. తను కూడా బాధ్యాతయుతంగా బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. ఏదేమైనా నాలుగో టీ20లోనై జట్టు కూర్పుపై శ్రద్ధ పెట్టి, విజయం సాధిస్తే సిరీస్ భారత్ సొంతం అవుతుంది.
Also Read: Rajkot T20 Result: పోరాడి ఓడిన భారత్.. హార్దిక్ పోరాటం వృథా.. ఇంగ్లాండ్ ను గెలిపించిన బౌలర్లు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)