MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే!
Telangana News: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఏపీ, తెలంగాణల్లో 3 చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది.
![MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే! election commission released mlc elections schedule in telugu states MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/09cb86f6bb02c87869e8eb974e0601551738138981850876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Election Commission Released MLC Elections Schedule In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ (MLC Election Schedule) విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలోని ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా - గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది.
అటు, తెలంగాణలో 2 ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే, వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి సైతం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
కాగా, మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ జీవన్ రెడ్డి కొనసాగుతుండగా.. ఇదే చోట టీచర్ స్థానం నుంచి కూర రఘోత్తంరెడ్డి, వరంగల్ - ఖమ్మం - నల్లగొండ ఉపాధ్యాయ స్థానం నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనసాగుతున్నారు. వీరి పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది.
షెడ్యూల్ పూర్తి వివరాలివే..
- నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 3
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ - ఫిబ్రవరి 10
- నామినేషన్ల పరిశీలన - ఫిబ్రవరి 11
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - ఫిబ్రవరి 13
- పోలింగ్ ప్రక్రియ - ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ..
- ఓట్ల లెక్కింపు ప్రక్రియ - మార్చి 3
Also Read: BRS : ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం - గ్రౌండ్ ను బీజేపీ, కాంగ్రెస్‌కు వదిలేస్తున్నట్లే ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)