అన్వేషించండి

BRS : ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం - గ్రౌండ్ ను బీజేపీ, కాంగ్రెస్‌కు వదిలేస్తున్నట్లే ?

Telangana: తెలంగాణలో త్వరలో ఓ గ్రాడ్యూయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల్ని ఖరారు చేసుకుంటున్నాయి. కానీ బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంది.

Will BRS stay away from MLC elections : తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు మార్చిలో జరిగే అవకాశం ఉంది. బీజేపీ ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల కసరత్తు చేస్తోంది. అయితే భారత రాష్ట్ర సమితిలో మాత్రం సందడి కనిపించడం లేదు. మూడు స్థానాల్లో ఒకటి ఉత్తర తెలంగాణలోని కీలక జిల్లాలు కలిపి ఉండే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం. మిగతా రెండు టీచర్స్ నియోజకవర్గాలు. ఒకప్పుడు అన్ని చోట్లా తిరుగులేని విజయాలు సాధించిన బీఆర్ఎస్ ఇప్పుడు పోటీకే ముందుకు రావడం లేదు. 

మూడు ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 29న ఖాళీ 
 
మూడు ఎమ్మెల్సీ స్థానాల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. అందులో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు, ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం . ఆదిలాబాద్ - నిజామాబాద్ - కరీంనగర్ - మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి  పదవి కాలం ముగుస్తుంది. ఆదిలాబాద్ - నిజామాబాద్ - కరీంనగర్ - మెదక్  టీచర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రఘోత్తమ్ రెడ్డి, వరంగల్ - ఖమ్మం - నల్గొండ టీచర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన నర్సిరెడ్డి పదవీ కాలం కూడా పూర్తి అవుతుంది. ఈ మూడు స్థానాల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది.   మార్చి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ 

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీజేపీ ముందుగా రెడీ అయింది. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన అంజిరెడ్డిని ప్రకటించారు. ఉపాధ్యాయ నియోజకవర్గాలకు విద్యాసంస్థల యజమానుల్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చాన్స్ ఇవ్వాలా లేకపోతే కొత్త వారికి చాన్సివ్వాలా అని ఆలోచిస్తోంది. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో మాత్రం మిత్రపక్షాలు అయిన కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.  

అందరి దృష్టి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ! 

ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రదానంగా ఆయా టీచర్ల సంఘాల మధ్యనే పోటీ ఉంటుంది. అందుకే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. 2019లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ గులాబీ పార్టీ అధికారికంగా అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలపలేదు. స్వతంత్రంగా పోటీ చేసిన చంద్రశేఖర్‌ గౌడ్‌కు చివరి నిమిషంలో అనధికారిక మద్ధతు పలికింది. కానీ జీవన్ రెడ్డి గెలిచారు. ఈ సారి ఏం చేయబోతున్నారన్నది మాత్రం స్పష్టత లేదు. పోటీ చేసేందుకు పలవురు ఆసక్తిగా ఉన్నారు.    కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టీఎస్టీఎస్ మాజీ ఛైర్మన్ చిరుమల్ల రాకేష్, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ అవకాశంపై హామీ ఇస్తే పని చేసుకుంటామన్నారు. కానీ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో సైలెంట్ గా ఉన్నారు. 

పోటీకి దూరమని కేటీఆర్ సంకేతాలు ? 

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణంగా రాజకీయ పార్టీలు పోటీ చేయబోవని, ఉద్యమ సమయంలో తెలంగాణ వాదం ఎజెండాగా పార్టీ అధినేత కేసీఆర్ ఆ ఎన్నికలను ఉపయోగించుకున్నారని   కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఓటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని, వాటి కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని ఆయన చెప్పారు. అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారని అనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే ఓటర్ల నమోదు సహా ఏ విషయంలోనూ బీఆర్ఎస్ చురుగ్గా లేదు. పరిస్థితి చూస్తూంటే..  ఎన్నికల గ్రౌండ్‌ను బీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీలకు వదిలేస్తున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget