Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
Mahakumbh Mela 2025: ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో సెక్టార్ 2 వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
![Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు several devotees died and several injured in mahakumbh mela 2025 Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/04326d8c4739a55c687a15098ae024e71738128347354876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Several People Died In Mahakumbh Mela Stampede 2025: ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో (Maha Kumbhmela 2025) బుధవారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్దకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలిరాగా.. విపరీతమైన రద్దీ నెలకొని సెక్టార్ 2 వద్ద బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనీసం 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. వెంటనే స్పందించిన అధికారులు, సిబ్బంది క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలంలో ఎటు చూసిన హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుండగా.. మరణాల సంఖ్యపై యూపీ ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తొక్కిసలాట నేపథ్యంలో అమృతస్నానం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు 13 అఖాడాలు ప్రకటించారు.
అటు, ఘటనా స్థలానికి 70 అంబులెన్సులు చేరుకున్నాయి. దాదాపు 3 గంటల పాటు క్షతగాత్రుల తరలింపు ప్రక్రియ సాగింది. ప్రయాగ్‌రాజ్‌లో 8 నుంచి 10 కోట్ల మంది ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం వరకూ ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. భక్తులు భారీగా పోటెత్తడంతో అటుగా వెళ్లే జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. దాదాపు 20 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.
#WATCH | #MahaKumbh2025 | To ensure the security of all devotees amid massive crowds building in the Mahakumbh area on Mauni Amavasya, a team Bomb Detection and Disposal Squad along with a sniffer dog conducts regular checking of the area pic.twitter.com/rHIx0ylC1a
— ANI (@ANI) January 29, 2025
#WATCH | Prayagraj #MahaKumbh2025 | DIG Mahakumb, Vaibhav Krishna orders horse-mounted police personnel to move devotees in order to vacate Triveni Sangam ghat pic.twitter.com/5Z3PHIndet
— ANI (@ANI) January 29, 2025
సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్
అటు, ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేశారు. గంటల వ్యవధిలోనే మూడుసార్లు ఆయనతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీశారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఘటనపై ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
భక్తులకు సీఎం సూచనలు
ప్రస్తుతం, ప్రయాగరాజ్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. 'త్రివేణి సంగమం ముక్కు భాగానికి చేరుకోవాలన్న ఉద్దేశంతో జనం పోటెత్తారు. దీంతో తీవ్ర ఒత్తిడి ఉంటోంది. మౌనీ అమావాస్యం సందర్భంగా జనం భారీగా వచ్చారు. అఖాడాలు వెళ్లే మార్గం వద్ద ఉన్న బారికేడ్లను నెట్టివేశారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. గాయపడ్డ వారిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించండి. ఆదేశాలు, సూచనలు పాటిస్తూ అధికారులకు సహకరించండి. ఎలాంటి వదంతులను నమ్మొద్దు.' అని సీఎం స్పష్టం చేశారు.
#WATCH | Lucknow | Uttar Pradesh CM Yogi Adityanath says," The situation in Prayagraj is under control..."
— ANI (@ANI) January 29, 2025
"Around 8-10 crore devotees are present in Prayagraj today. There is continuous pressure due to the movement of devotees towards the Sangam Nose. A few devotees have… pic.twitter.com/lOc1OIraqm
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)