Hyderabad Crime: డిజిటల్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం - చేసిందో ఎవరో కాదు బ్యాంక్ మేనేజర్లే - ఇంకెవర్ని నమ్మాలి ?
Digital Trading: డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసం చేసిన బ్యాంక్ మేనేజర్లను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు.
![Hyderabad Crime: డిజిటల్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం - చేసిందో ఎవరో కాదు బ్యాంక్ మేనేజర్లే - ఇంకెవర్ని నమ్మాలి ? Hyderabad police arrested bank managers who cheated in the name of digital trading Hyderabad Crime: డిజిటల్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం - చేసిందో ఎవరో కాదు బ్యాంక్ మేనేజర్లే - ఇంకెవర్ని నమ్మాలి ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/16/270e9247b345cfceb63a3340dfc24e201734369123426252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad police arrested bank managers who cheated in the name of digital trading: స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తే లక్షలకు లక్షలే అని ప్రచారం చేసి ఉన్నతందా ఊడ్చేసే మోసగాళ్లు బయలుదేరారు. ఎవరో నైజీరియా వాళ్లు.. నార్త్ వాళ్లు ఇలా మోసం చేస్తే పాపం అమాయకులు మోసపోయారు అనుకుంటాం.. కానీ తెలుగు వాళ్లే అందునా బ్యాంకు మేనేజర్లే ఓ ముఠాగా ఏర్పడి వేల మందిని మోసం చేశారు. వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్ పేజీల్లో ప్రమోట్ చేశారు. చివరికి 88 కోట్లను స్వాహా చేశారు. పెద్ద ఎత్తున ఫిర్యాదు రావడంతో పోలీసులు మొత్తం నెట్ వర్క్ ను చేధించారు. 52 మందిని అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు బ్యాంక్ మేనేజర్లు కూడా ఉన్నారు.
షేర్ మార్కెట్ పెట్టుబడులకు సలహాల పేరుతో వాట్సాప్ గ్రూపులు
ముందుగా ఓ గ్రూపుకొంత మంది వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తారు. అందులో బాగా లాభాలు వచ్చే షేర్లు కొనేలా సలహాలు ఇస్తామని ట్రేడింగ్ చేయవచ్చని నమ్మబలుకుతారు. మొదట్లో ఎవరి అకౌంట్లతో వారు ట్రేడింగ్ చేసుకోవచ్చని చెబుతారు. కానీ రాను రాను వారు సామూహికంగా ట్రేడింగ్ చేయడం వల్లచాలా ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ పెడతారు. తమ ఖాతాల ద్వారా షేర్లు కొని లాభాలు రాగానే బదిలీ చేస్తామని చెబుతారు. మొదట్లో నమ్మకంగా ఉండే వారు తర్వాత డబ్బులు కాస్త ఎక్కువ జమ కాగానే ఇనాక్టివ్ అయిపోతారు. తమ డబ్బులు ఏ షేర్లలో పెట్టారో..కూడా వారికి తెలియదు.
మీ బదులు మేమే పెట్టుబడి పెడతామంటూ డబ్బులు వసూలు చేసి పరార్
ఇలా పెద్ద ఎత్తువ వినియోగదారుల్ని మోసం చేసి కోట్లు కొల్లగొట్టారు. దాదాపుగా 88 కోట్లు కొల్లగొొట్టినట్లుగా పోలీసులు తేల్చారు. వీరు ఈ డబ్బుల్ని తరలించడానికి బ్యాంక్ మేనేజర్ల సహకారం తీసుకున్నారు. వారు తమకు ఉన్న పవర్ తో మ్యూల్ ఖాతాల్ని సృష్టించి డబ్బులు తరలించడానికి సహకరించారు. ఇందుకుగాను కమిషన్లు తీసుకున్నారు. ఈ విషయం తెలిసిపోవడంతో వారు అరెస్టు అయ్యారు. ఉద్యోగాలకు ముప్పు తెచ్చుకున్నారు.
మ్యూల్ ఖాతాలతో డబ్బులు తరలించే అవకాశం కల్పిస్తున్న బ్యాంక్ మేనేజర్లు
డిజిటల్ ట్రేడింగ్ అంటే నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రేడింగ్ పేరుతో వచ్చే వాట్సాప్ గ్రూపుల్లో అసలు చేరవద్దని సలహాలిస్తున్నారు. డిజిటల్ మోసాలు, సైబర్ మోసాల వల్ల వేలకోట్ల రూపాయలు ప్రజలు నష్టపోతున్నారని .. రికవరీ చాలా క్లిష్టమని చెబుతున్నారు. మొత్తంగా పదమూడు శాతం డబ్బులు మాత్రమే రికవరీ చేస్తున్నారు. అందుకే.. డబ్బులు పోతే తిరిగి రావడం చాలా కష్టం కాబట్టి సైబర్ మోసాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పిలుపుసిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)