అన్వేషించండి
Advertisement
Paris Olympics 2024: చివరి అంకానికి ఒలింపిక్స్, ఇక ఆశలు మిగిలింది రితికాపైనే
Olympic Games Paris 2024: పారిస్ విశ్వ క్రీడల్లో భారత క్రీడాంశాలు దాదాపుగా పూర్తవ్వగా నేడు రెజ్లింగ్‌లో రితికా హుడా బరిలోకి దిగనుంది. రీతికా ఓడిపోతే భారత పతక ఆశలకు తెరపడనుంది.
Olympics 2024 Schedule For Day 15, Saturday, August 10: పారిస్ ఒలింపిక్స్( Paris Olympics 2024) చివరి అంకానికి సమీపించాయి. ఈసారి విశ్వ క్రీడల్లో భారత్ స్వర్ణ పతక ఆశలు నిలుస్తాయా...లేదా అన్నది నేటితో తేలిపోనుంది. పారిస్ విశ్వ క్రీడల్లో భారత క్రీడాంశాలు దాదాపుగా పూర్తవ్వగా నేడు... రెజ్లింగ్‌లో రితికా హుడా( Reetika Hooda) బరిలోకి దిగనుంది. గోల్ఫ్‌లో దీక్షా ధాగర్, అదిత్ అశోక్‌ల పోరాటం కొనసాగుతోంది. ఇక పతక ఆశలన్నీ గోల్ఫ్‌లో దీక్షా దాగర్, అదితి అశోక్, రెజ్లింగ్‌లో రీతికా హుడాపైనే ఉన్నాయి. విశ్వ క్రీడలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ట్రాక్ ఫీల్డ్ ఈవెంట్స్ ఈరోజు కూడా కొనసాగనున్నాయి. రీతికా మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహిళల 76 కేజీల ఈవెంట్‌లో రీతికా ఓడిపోతే భారత పతక ఆశలకు నేడే తెరపడనుంది.
ఇవాళ్టి భారత షెడ్యూల్
గోల్ఫ్ - మహిళల వ్యక్తిగత స్ట్రోక్ రౌండ్ 4- దీక్షా దాగర్ అదితి అశోక్...12:30 PM:
రెజ్లింగ్:
మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ రీతికా హుడా 2:30 PM
మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ క్వార్టర్ ఫైనల్( రితికా అర్హత సాధిస్తే) -4.20PM
మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ సెమీ ఫైనల్( రితికా అర్హత సాధిస్తే)-10.25PM
ఇతర ముఖ్యమైన పతక ఈవెంట్‌లు
11:30 AM: అథ్లెటిక్స్, పురుషుల మారథాన్
4:30 PM: వాలీబాల్, పురుషుల ఫైనల్ -- ఫ్రాన్స్ vs పోలాండ్
6:30 PM: టేబుల్ టెన్నిస్, మహిళల టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ -- చైనా vs జపాన్
8:30 PM: ఫుట్‌బాల్, మహిళల ఫైనల్ -- బ్రెజిల్ vs USA
10:30 PM: అథ్లెటిక్స్, పురుషుల హైజంప్ ఫైనల్
11:05 PM: అథ్లెటిక్స్, మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్
11:20 PM: అథ్లెటిక్స్, పురుషుల 5000మీ ఫైనల్
11:45 PM: అథ్లెటిక్స్, మహిళల 1500మీ ఫైనల్
12:30 AM: అథ్లెటిక్స్, పురుషుల 4x400 మీటర్ల రిలే ఫైనల్
12:44 AM: అథ్లెటిక్స్, మహిళల 4x400 మీటర్ల రిలే ఫైనల్
1:00 AM: బాస్కెట్‌బాల్, పురుషుల ఫైనల్ -- ఫ్రాన్స్ vs USA
14వ రోజు మరో పతకం సాధించిన్ భారత్ పతకాల సంఖ్య 6కి చేరుకుంది, మొన్న నీరజ్ చోప్రా రజత పతకంతో మెరిశాడు. నిన్న భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ అదరగొట్టాడు. 57 కేజీల విభాగం కాంస్య పోరులో ఘన విజయం సాధించాడు. గోల్ఫ్‌లో భారత్‌కు పెద్దగా ఆశలు లేకపోయినా రెజ్లింగ్‌లో మాత్రం భారత్ రితికాపై కూడా ఆశలు పెట్టుకుంది. రితికా పతక మోత మోగిస్తే భారత్ ఈ ఒలింపిక్స్‌ను సగర్వంగా ముగిస్తుంది. మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ రీతికా హుడా ఫైనల్ చేరితేనే భారత్ పోరాటం ఒలింపిక్స్ చివరి రోజుకు వెళ్తుంది, లేకపోతే టీమిండియా పోరాటానికి నేడే తెరపడనుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement