Crime News: ట్రయల్ కోసం కుక్కను చంపి ఉడకబెట్టాడు - భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Hyderabad News: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పీఎస్ పరిధిలో భార్యను చంపి ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు ట్రయల్ కోసం ఓ కుక్కను చంపినట్లు తెలుస్తోంది.

Husband Killed Wife And Cut Into Pieces In Meerpet: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట (Meerpet) పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను చంపి ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తన భార్యను చంపడానికి ముందు నిందితుడు ఓ కుక్కను చంపి ట్రయల్ వేసినట్లుగా తెలుస్తోంది. కుక్కను ముక్కలుగా నరికి ఉడకబెట్టినట్లు సమాచారం. మీర్‌పేట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు ఇంకా అధికారికంగా ఏ వివరాలు వెల్లడించడం లేదు. ఈ విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవి (35)కి అదే గ్రామానికి చెందిన పుట్ట గురుమూర్తి (39)తో 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు. గురుమూర్తి ఆర్మీలో పని చేసి రిటైరై ప్రస్తుతం డీఆర్డీవోలో కాంట్రాక్ట్ భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నాడు.
భార్యను ముక్కలుగా నరికాడు
వీరు రంగారెడ్డి జిల్లా (Rangareddy District) బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర్‌నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. భార్యపై అనుమానంతో ఆమెను వేధించేవాడు. ఇటీవల ఇంట్లో పిల్లలు లేని సమయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్యను చంపేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో వేసి ఉడికించాడు. ఎముకలను వేరు చేసి రోట్లో వేసి పొడిగా మార్చాడు. ఎముకల పొడి, శరీరం అవశేషాలను సమీపంలోని జిల్లెలగూడ చెరువులో పడేశాడు. అనంతరం ఏమీ తెలియదన్నట్లుగా తన భార్య కనిపించడం లేదని అత్తకు ఫోన్ చేసి చెప్పాడు. ఎవరికీ అనుమానం రాకుండా అమాయక చక్రవర్తిలా నటించాడు. ఈ క్రమంలో ఈ నెల 18న తమ బిడ్డ మిస్ అయినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీల ఆధారంగా..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకట మాధవి ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలోనే ఆమె ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఆమె ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటకు వచ్చిన ఆధారాలు కనిపించలేదు. గురుమూర్తి రాకపోకలు సాగించిన దృశ్యాలు మాత్రం రికార్డయ్యాయి. దీంతో అతన్ని అనుమానంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. భార్యను తానే హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు తొలుత పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు అంగీకరించాని పేర్కొన్నారు. దీంతో మృతదేహం ఆనవాళ్ల కోసం వెతుకుతున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతోనే..
భార్యాభర్తల మధ్య అనుమానంతో చాలాసార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. అటు, ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గురుమూర్తి శాడిజం ఇటు కన్నబిడ్డలతో పాటు అటు బంధువులను సైతం నివ్వెరపోయేలా చేసింది. కేవలం అనుమానంతోనే భార్యను చంపాడా.? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా.? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మర్డర్ ఎపిసోడ్‌లో నిందితుడికి ఎవరైనా సహకరించారా.? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

