Viral News: అండర్‌వేర్‌లో సిగరెట్ లైటర్స్ - శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్ట్ - వాటితో ఏం చేయాలనుకుంది ?
Shamshabad airport: లోదుస్తుల్లో మూడు లైటర్లను పెట్టుకుని వెళ్తున్న మహిళను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. ఏ ఉద్దేశంతో వాటిని తీసుకెళ్లాలనుకున్నారన్నదానిపై ప్రశ్నిస్తున్నారు.

woman arrested at the Shamshabad airport carrying three lighters in underwear : శంషాబాద్ ఎయిర్ పోర్టులో లోదుస్తుల్లో మూడు సిగరెట్ లైటర్లను పెట్టుకుని వెళ్తున్న మహిళను తనిఖీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మూడు లైటర్లను కలిపి ఒకటిగా అంటించుకుని దాన్ని సెక్యూరిటీ కంట కనబడనీయకుండా అండర్‌వేర్‌లో పెట్టుకుని వెళ్లారు. అయితే బీప్ సౌండ్ రావడంతో ఆమెను మహిళా సెక్యూరిటీ అధికారులు పూర్తి స్థాయిలో చెక్ చేశారు. అప్పుడు లైటర్లు బయట పడ్డాయి.
విమానాల్లో లైటర్లకు అనుమతి ఉండదు !
విమానాల్లోకి ఇలాంటి వస్తువులకు అనుమతి ఉండదు. లైటర్లలో మండే గుణం ఉన్న కిరసనాయిల్ లేదా.. గ్యాస్ వంటివి ఉంటాయి. అలాంటివి మూడు ఉన్నాయంటే.. చిన్న విషయం కాదని భావిస్తున్నారు. విమానంలో ఏదైనా బెదిరింపు పని చేయడానికి అయినా ఉపయోగపడుతుందని .. అలాంటి ప్రయత్నం ఏమైనా ఈ మహిళ చేసిందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ మహిళ హైదరాబాద్ నుంచి ముంబైకి ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకున్నారు. ముంబై ఎదుకు వెళ్తున్నారు.. అసుల లైటర్లను తీసుకెళ్లాల్సిన అవసరమేమిటన్నదానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Hanumakonda Murder Case: హనుమకొండలో పట్టపగలే దారుణం, నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ దారుణహత్య
పది రూపాయలు చేయని వాటిని స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం ఏమిటి ?
విమానాశ్రయంలోకి మండే గుణం ఉన్న వాటిని అనుమతించరు. విమానాల్లో ప్రయాణికులు కూడా వాటిని తీసుకెళ్లడం నిషేదం. దీనిపై ఆ మహిళకు స్పష్టత ఉంది కాబట్టి రహస్యంగా తీసుకెళ్లాలని చూశారని అనుకుంటున్నారు. స్మగ్లింగ్ చేయడానికి అవేమీ అత్యంత విలువైన వస్తవులు కాదు. పది రూపాయలకు ఎక్కడైనా దొరుకుతాయి. మరి ఎందుకు స్మగ్లింగ్ చేయాలనుకున్నది పోలీసులకు కూడా మిస్టరీగా మారింది. ఆమెకు ఎంత సిగరెట్ అలవాటు ఉన్నప్పటికీ ఇలా లైటర్లను స్మగ్లింగ్ చేస్తారని అనుకోవడం లేదు.
ముంబైకు వెళ్లాలనుకున్న మహిళ
ఆ మహిళ వెనుక ఎవరైనా ఉన్నారా అన్నదానిపై ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. విద్రోహ చర్యకు పాల్పడే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారన్న అనుమానాలు బలంగా ఉండటంతో.. ఫోన్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీఐఏస్ఎఫ్ సిబ్బంది.. ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. విదేశాల నుంచి వచ్చే వారిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తూంటారు. ఈ క్రమంలో చాలా స్మగ్లింగ్ వస్తువులు బయటపడుతూంటాయి కానీ..లైటర్లు దొరకడం మాత్రం చాలా అరుదుగా భావిస్తున్నారు.
Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో యువతి ఛాటింగ్ - అక్కకు తెలిసిందన్న భయంతో సూసైడ్, హైదరాబాద్‌లో ఘటన





















