(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022: లఖ్‌నవూకూ షాకిచ్చిన రషీద్! అహ్మదాబాద్‌కు హార్దిక్, గిల్!
అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకుంది. ఇషాన్ కిషన్ కోసం తీవ్రంగా ప్రయత్నించిందట. కుదరకపోవడంతో శుభ్‌మన్ గిల్‌ను తీసుకుంది. ఇక తొలి ప్రాధాన్యం ఎవరికి ఇచ్చిందంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాతి సీజన్‌కు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ సిద్ధమైంది. ముసాయిదాలోని ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకుంది. ముంబయి ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, సన్‌రైజర్స్ హైదరాబాద్ మిస్టర్సీ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను తొలి ప్రాధాన్యం కింద తీసుకుందని తెలిసింది. టీమ్‌ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను మూడో ఆటగాడిగా ఎంచుకుందని సమాచారం. ఈ మేరకు ముసాయిదాను బీసీసీఐకి సమర్పించింది.
కొన్నేళ్లుగా రషీద్ ఖాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సేవలు అందిస్తున్నాడు. రీటెన్షన్‌లో రెండో ప్రాధాన్యం ఇస్తున్నారని అతడు జట్టును వదిలేశాడని వార్తలు వచ్చాయి. రూ.16 కోట్లు రాలేదన్న ఉద్దేశంతో హైదరాబాద్‌ను వదిలేసిన రషీద్ రూ.15 కోట్లకే అహ్మదాబాద్‌కు వెళ్లాడు. నిజానికి అతడికి వేలంలో మరింత ఎక్కువ డబ్బే వచ్చేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక లీగుల్లో ఆడిన అనుభవం అతడికి ఉంది.
ఇక ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకూ అహ్మదాబాద్ రూ.15 కోట్లే చెల్లించనుంది. కొన్నేళ్లుగా అతడు ముంబయి కీలక సభ్యుల్లో ఒకడు. రీటెన్షన్‌లో రోహిత్, పొలార్డ్, బుమ్రా, సూర్యకుమార్‌ను తీసుకోవడంతో అతడికి స్థానం దక్కలేదు. కొత్త ఫ్రాంచైజీకి అతడే సారథ్యం వహిస్తాడని తెలుస్తోంది.
Also Read: Virat Kohli Resigns: బీసీసీఐపై కోహ్లీ అలిగాడా? జట్టుకు ముందు, బోర్డుకు ఒక రోజు తర్వాత రాజీనామా విషయం
కోల్‌కతాకు ఆడిన శుభ్‌మన్ గిల్‌ను రూ.7 కోట్లకు అహ్మదాబాద్ తీసుకుంది. నిజానికి ఇషాన్ కిషన్ కోసం ఆ జట్టు తీవ్రంగా ప్రయత్నించిందని తెలిసింది. వేలంలో మరింత డబ్బు వస్తుందన్న ధీమా, ముంబయి ఇండియన్స్ కచ్చితంగా కొనుగోలు చేస్తామన్న హామీ ఇవ్వడంతో అతడు అహ్మదాబాద్ ఆఫర్ నిరాకరించాడు.
'అహ్మదాబాద్ ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేసింది. హార్దిక్, రషీద్, శుభ్‌మన్‌ను తీసుకుంది' అని బోర్డు అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. 'ఇషాన్ కిషన్ కోసం వారు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అతడు వేలంలోకి వెళ్లాలనే నిర్ణయించుకున్నట్టు తెలిసింది. బహుశా ముంబయి భారీ ధరకు అతడిని తీసుకోవచ్చు' అని ఆ అధికారి వెల్లడించారు.
Also Read: Team India Next Captain: విరాట్ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్..! లాజిక్ ఇదే!
Also Read: Virat Kohlis Successor: టీమిండియా టెస్టు పగ్గాలు అతడి చేతికే.. రోహిత్ శర్మకు మాత్రం నో ఛాన్స్!