Pahalgam Terror Attack: శత్రువుల ఉచ్చులోపడకండి, రేపు నల్లబ్యాడ్జీలతో ప్రార్థనలు చేద్దాం- పహల్గాం దాడిపై అసదుద్దీన్ కీలక ప్రకటన
Pahalgam Terror Attack:జమ్ము కశ్మీరు ఉగ్రదాడిని AIMIM ఎంపీ ఖండించారు. ఇస్లాం పేరుతో హత్యలు చేసే ఉగ్రవాదులను ఉపేక్షించవద్దని కేంద్రానికి సూచించారు.

Pahalgam Terror Attack: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని కశ్మీరు ప్రజలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సంఘాలు, నేతలు ఖండించారు. గురువారం (24 ఏప్రిల్, 2025)న ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఒక విజ్ఞప్తి చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిపై అసదుద్దీన్ ఒవైసీ Xలో వీడియో పోస్ట్ చేశారు. 'మీ అందరికీ తెలిసిందే, పహల్గాంలో పాకిస్థాన్ లష్కర్-ఎ-తైయబా ఉగ్రవాదులు 27 మందికిపైగా ప్రాణాలను బలిగొన్నారు..అనేక మందిని గాయపరిచారు. వారంతా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.'
'రేపు నల్ల బ్యాడ్జ్‌లతో జుమ్మా నమాజ్ చేయడానికి వెళ్ళండి'
అసదుద్దీన్ ఒవైసీ ఇలా అన్నారు, 'ఈ ఉగ్రవాదం, దారుణదాడికి వ్యతిరేకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, రేపు మీరు జుమ్మా నమాజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు మీ చేతులకు నల్ల బ్యాడ్జెట్ కట్టుకొని వెళ్ళండి, తద్వారా మనం కలిసి ఒక సందేశాన్ని ఇవ్వగలం, మనం దేశ శాంతి ఏకత్వాన్ని బలహీనపరచడానికి విదేశీ శక్తులు అనుమతించేది లేదు. మన కశ్మీరు సోదరులను లక్ష్యంగా చేేసుకొని విదేశీ శక్తులు దాడి చేశాయి. వారి శత్రువుల ఉచ్చులో చిక్కుకోవద్దని భారతీయులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను,.'
पहलगाम के आतंकी हमले के सिलसिले में मेरी अपील: कल जब आप नमाज़-ए-जुम्मा पढ़ने जायेंगे तो आपने बांह पर काली पट्टी बांधकर जाएँ। इस से हम यह पैग़ाम भेजेंगे की हम भारतीय विदेशी ताक़तों को भारत के अमन और इत्तेहाद को को कमजोर करने नहीं देंगे। इस हमले की वजह से शर-परस्तों को हमारे… pic.twitter.com/r6uYdzQiOf
— Asaduddin Owaisi (@asadowaisi) April 24, 2025
'ప్రజలను చంపడానికి అనుమతి ఇవ్వలేము'
AIMIM ఎంపీ ఇంకా ఏమన్నారంటే...'మనం ఉగ్రవాదుల చర్యను ఖండించాం. దీన్-ఎ-ఇస్లాం ఆధారంగా ప్రజలను చంపడానికి అనుమతి ఇవ్వలేదు. బయటి శక్తులు వచ్చి ప్రాణాలు తీస్తుంటే సహించేది లేదు అందుకే మనం కలిసి ఖండించాలి. పహల్గాం దాడిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం సర్వపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసదుద్దీన్ ఒవైసీ కూడా పాల్గొన్నారు.
"किसी का नाम पूछकर जान लेना सरासर गलत है" पहलगाम आतंकी हमले पर बैरिस्टर @asadowaisi की Press Conference #PahelgamTerroristattack #pahelgam #JammuKashmir #AsaduddinOwaisi #TerroristAttack #Pahalgam #pahalgamattack #pahalgamterrorattack #owaisi #pressconference… pic.twitter.com/g0WeM88knJ
— AIMIM (@aimim_national) April 24, 2025





















