(Source: ECI/ABP News/ABP Majha)
Anushka on Kohli Resignation: ఎంతో ఎత్తుకు ఎదిగావు.. లోపల, బయట కూడా.. విరాట్‌పై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్!
విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై అనుష్క శర్మ తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు.
విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ వదిలేయడంపై భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఎంతో ఎమోషనల్‌గా సాగిన ఈ పోస్టులో కోహ్లీ ఏడేళ్ల ప్రయాణంలో తన మానసిక పరిస్థితి అనుష్క శర్మ ఆవిష్కరించింది. ఈ పోస్టులో అనుష్క మాటలు యథాతథంగా..
‘2014లో నాకు ఆరోజు ఇంకా గుర్తుంది. ఎంఎస్ ధోని టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడంతో నువ్వు కెప్టెన్ అయ్యావని చెప్పిన రోజు. ధోని, నేను, నువ్వు కూర్చుని మాట్లాడుకోవడం, గడ్డం ఎంత త్వరగా తెల్లగా అవుతుందనే విషయం మీద ధోని వేసిన జోకులు నాకు ఇంకా గుర్తున్నాయి. మనం ఆరోజు చాలా నవ్వుకున్నాం. అప్పటి నుంచి నీ గడ్డం తెల్లబడటం కంటే చాలా మార్పులు నేను చూశాను. నువ్వు ఎదగడం కాదు. ఎంతో ఎత్తుకు ఎదిగావు. బయట, లోపల కూడా. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నువ్వు ఎదిగిన తీరు, నీ నాయకత్వంలో జట్టు సాధించిన విజయాలకు నేనెంతో గర్వపడుతున్నాను.
2014లో నువ్వు చాలా చిన్నవాడివి, అమాయకుడివి. మంచి ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్ నిన్ను జీవితంలో ముందుకు తీసుకెళతాయని అనుకున్నావు. అవి కచ్చితంగా తీసుకెళ్లాయి. కానీ దారిలో సవాళ్లు కూడా ఎదురయ్యాయి. అయితే ఈ సవాళ్లు గ్రౌండ్ లోపల మాత్రమే కాదు. బయట కూడా వెంటాడాయి. కానీ ఇది జీవితం కదా? మనం అంచనాలు వేసుకున్న చోట తక్కువగానూ.. ఊహించని చోట ఎక్కువగానూ ఇవి ఎదురవుతాయి. కానీ నీ మంచి ఆలోచనల దగ్గరికి వాటిని నువ్వు రానివ్వలేదు. దానికి నాకు చాలా గర్వంగా ఉంది.’
‘నువ్వు ఇతరులకు ఉదాహరణగా ఉండేలా జట్టును లీడ్ చేశావు. గెలుపు కోసం నీ శక్తినంతా ధారపోశావు. ఓటమి తర్వాత నీ కళ్లు నీటితో నిండిపోయినప్పుడు నేను నీ పక్కన ఉన్నాను. అప్పటికీ నువ్వు ఇంకొంచెం బాగా ఆడితే బాగుండేది అనుకునేవాడివి. అదే నువ్వు. అందరి నుంచి నువ్వు దాన్నే కోరుకున్నావు. నువ్వు ముక్కుసూటిగా ఉన్నావు. నువ్వు ఎంతో స్వచ్ఛమైన వ్యక్తివి. నీకు ఎప్పుడు చెడు ఆలోచనలు రాలేదు. కానీ దీన్ని అందరూ అర్థం చేసుకోలేరు.’
‘నువ్వు పర్ఫెక్ట్ కాదు. నీలోనూ లోపాలున్నాయి. కానీ వాటిని నువ్వెప్పుడూ దాచిపెట్టలేదు. సరైనది చేయడానికి ఎప్పుడూ నిలబడ్డావు. అది ఎప్పుడైనా కష్టమే! నీకు దేని మీదా ఆశలేదు, చివరికి ఈ పదవి మీద కూడా. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఎవరైనా ఒకదాని కోసం పాకులాడితే వారు పరిమితులకు బందీ అవుతారు. కానీ నీకు అస్సలు పరిమితులే లేవు. తన తండ్రి ఏడు సంవత్సరాల్లో ఎలా ఉన్నాడో మన కూతురు నేర్చుకుంటుంది. నువ్వు ఎంతో మంచి చేశావు.’ అని అనుష్క ఈ పోస్టులో పేర్కొంది.
View this post on Instagram
Also Read: ప్రపంచంలోని బెస్ట్ కెప్టెన్‌లలో కోహ్లీ స్థానం ఇదే! ఫ్యాన్స్ డోన్ట్ వర్రీ ప్లీజ్!!
Also Read: ఈ రికార్డులు ఎవరైనా కొడతారా.. మళ్లీ తనే ట్రై చేయాలా..విరాట్ తిరుగులేని కెప్టెన్సీ రికార్డులు!
Also Read: షాక్..! టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై.. బీసీసీఐ, ధోనీకి థాంక్స్ చెబుతూ లేఖ