అన్వేషించండి

Kohli Steps Down: షాక్‌..! టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై.. బీసీసీఐ, ధోనీకి థాంక్స్‌ చెబుతూ లేఖ

టీమ్‌ఇండియా అభిమానులకు షాక్‌! టెస్టు జట్టు కెప్టెన్సీకి విరాట్‌ కోహ్లీ రాజీనామా చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ నాయకత్వం నుంచి నిష్క్రమిస్తున్నానని అతడు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు.

దేశమంతా మకర సంక్రాంతి పండుగను ఆహ్లాదకరంగా జరుపుకుంటున్న వేళ..! టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఊహించని షాకిచ్చాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. కొత్త ఏడాదిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తాడని.. సెంచరీల వరద పారిస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల గుండెలు బద్దలు చేశాడు! 

Kohli Steps Down: షాక్‌..! టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై.. బీసీసీఐ, ధోనీకి థాంక్స్‌ చెబుతూ లేఖ

ఏడేళ్ల సారథ్యంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని కోహ్లీ చెప్పాడు. తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐ, తనను వ్యక్తిగా, ఆటగాడిగా వెలుగులోకి తీసుకొచ్చిన ఎంఎస్ ధోనీకి ధన్యవాదాలు తెలిపాడు. సోషల్‌ మీడియాలో సుదీర్ఘ లేఖను పోస్టు చేశాడు.

2014, ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన విరాట్‌ కోహ్లీ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసు ఓటమి తర్వాత ఆ బాధ్యతల నుంచి నిష్క్రమించాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏం జరిగిందో తెలియదు! జట్టు యాజమాన్యం ఏమైనా అందా తెలియదు! నాయకుడిగా జట్టును ముందుకు నడిపించలేక పోతున్నానని భావించాడా తెలియదు! వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం బాధించిందా తెలియదు! అనూహ్య నిర్ణయమైతే తీసుకున్నాడు. ఇక ఆటగాడిగానే కొనసాగనున్నాడు.

'టీమ్‌ఇండియాను నడిపించేందుకు ఏడేళ్లుగా శక్తివంచన లేకుండా ప్రతి రోజూ కష్టపడ్డాను. అత్యంత నిజాయితీతో నా బాధ్యతలు నిర్వర్తించాను. ఏ పనైనా ఏదో ఒక చోట వదిలేయాల్సిందే. నా వరకు టెస్టు సారథిగా ఆ సమయం ఇప్పుడే! ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూశాను. ఎప్పుడూ నమ్మకంతోనే ఉన్నాను. ప్రతి క్షణం శ్రమించాను. నేను చేసే ప్రతి పనిలో 120 శాతం కష్టపడ్డాను. అలా చేయకపోతే సరికాదనే నా అభిప్రాయం. నా హృదయంలో ఎంతో స్పష్టత ఉంది. నా జట్టును నేను మోసం చేయలేను' అని విరాట్‌ లేఖలో ప్రస్తావించాడు.

'సుదీర్ఘ కాలం నా దేశాన్ని నడిపించేందుకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. అలాగే నా దార్శనికతను పంచుకున్న, ఎక్కడా వదిలేయని జట్టులోని ప్రతి ఆటగాడికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ప్రయాణాన్ని మీరే అందంగా తీర్చిదిద్దారు. టెస్టు క్రికెట్‌లో నిరంతరం ముందుకెళ్లేలా ఈ వాహనం ఇంజిన్‌కు మద్దతిచ్చిన రవిశాస్త్రి, సహాయ బృందానికి ధన్యవాదాలు. ఈ విజన్‌ కోసం మీరంతా ఎంతో కష్టపడ్డారు. చివరగా ఎంఎస్‌ ధోనీకి బిగ్‌ థాంక్స్‌. ఒక కెప్టెన్‌గా ఆయన నన్ను నమ్మాడు. భారత క్రికెట్‌ను ముందుకు నడిపించే వ్యక్తిగా నన్ను గుర్తించాడు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

Also Read: IND vs SA, 3rd Test: కోహ్లీ.. స్టంప్‌మైక్‌ వద్ద ఆ మాటలేంటి? ఇంకేం ఆదర్శంగా ఉంటాడని గౌతీ విమర్శ

Also Read: IND vs SA: 1 గెలిచి 2 ఓడటం: మనకిదేం కొత్త కాదు బాబూ.. ఓసారి వెనక్కి వెళ్లండి!!

Also Read: IND vs SA ODI Series Schedule: టెస్టు సిరీసు పోయింది! ఇక వన్డేల్లోనైనా గెలుస్తారా? షెడ్యూలు ఇదే

టాప్ హెడ్ లైన్స్

Auqib Nabi Selection: తొలి మూడు వన్డేల స్క్వాడ్‌లోకి జమ్మూ స్పీడ్‌స్టర్ ఎంట్రీ.. యువ ప్లేయ‌ర్లకు మొండిచేయిపై యువరాజ్ ఘాటు వ్యాఖ్యలు
తొలి 3 వన్డేల స్క్వాడ్‌లోకి జమ్మూ స్పీడ్‌స్టర్ ఎంట్రీ.. వారిపై మొండిచేయిపై యువీ ఘాటు వ్యాఖ్యలు
Manisha Bhanwala Historic Gold:  వరల్డ్ రెజ్లింగ్ లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళగా మనీషా భన్వాలా కొత్త‌ చరిత్ర.. సుశీల్ కుమార్ రికార్డు సమం.. 
వరల్డ్ రెజ్లింగ్ లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళగా మనీషా భన్వాలా కొత్త‌ చరిత్ర.. సుశీల్ కుమార్ రికార్డు సమం.. 
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
Rohit- Virat Mission: 2027 వన్డే వరల్డ్ కప్ వేటలో దిగ్గజ ద్వయం.. నెట్స్ లో రచ్చ లేపిన రోకో జంట‌, కివీస్ గడ్డపై బిగ్ వార్ కు సై
2027 వన్డే వరల్డ్ కప్ వేటలో దిగ్గజ ద్వయం.. నెట్స్ లో రచ్చ లేపిన రోకో జంట‌, కివీస్ గడ్డపై బిగ్ వార్ కు సై

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Punjab Assembly Elections.. ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Raptadu Crime News: రాప్తాడు జెడ్పీ స్కూల్లో దారుణం- టెన్త్ విద్యార్థినిపై రంపంతో దాడి.. తెగిన చెయ్యి, తీవ్ర గాయాలు
రాప్తాడు జెడ్పీ స్కూల్లో దారుణం- టెన్త్ విద్యార్థినిపై రంపంతో దాడి.. తెగిన చెయ్యి, తీవ్ర గాయాలు
Embed widget