By: ABP Desam | Updated at : 14 Jan 2022 02:57 PM (IST)
Edited By: Ramakrishna Paladi
Images: Twitter | Getty Images
టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శల వర్షం కురుస్తోంది. అతడు యువతకు ఎలా ఆదర్శంగా నిలుస్తాడని మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. అతడు పరిణతి ప్రదర్శించడం లేదని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. స్టంప్ మైక్ వద్ద మాట్లాడాల్సిన పద్ధతి అదికాదంటూ విమర్శించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే!!
కేప్‌టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మూడో టెస్టులో తలపడుతున్న సంగతి తెలిసిందే. మూడో రోజు ఛేదనలో సఫారీ జట్టు 60/1తో ఉన్నప్పుడు రవిచంద్రన్ అశ్విన్ ఓ ఫ్లయిటెడ్ డెలివరీ వేశాడు. ఆ బంతి డీన్ ఎల్గర్ ప్యాడ్లకు తగలడంతో అంపైర్ మారియస్ ఎరాస్మస్ ఎల్బీ ఇచ్చాడు. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎల్గర్ సమీక్ష కోరాడు. అయితే ట్రాజెక్టరీ చూసినప్పుడు బంతి ఇన్‌లైన్‌లోనే పిచ్ అయినట్టు కనిపించింది. అయితే వికెట్లకు తగలకుండా పోతున్నట్టు చూపించింది.
Indian captain Virat Kohli yells into the stump microphone after an on-field decision was overturned by DRS: “Focus on your team while they shine the ball. Not just the opposition. Trying to catch people all the time.”#SAvIND pic.twitter.com/rtqYsQcHVn
— Nic Savage (@nic_savage1) January 13, 2022
నిర్ణయం భిన్నంగా రావడంతో అంపైర్ మరియస్ 'ఇది అసాధ్యం' అన్నాడు. ఇదే సమయంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లంతా చిరాకుకు గురయ్యారు. చూస్తుంటే మొత్తం దేశం కేవలం 11 మందికి వ్యతిరేకంగా ఆడుతున్నట్టు కనిపిస్తోందని కేఎల్ రాహుల్ అన్నాడు. రానురాను ఆట చెడ్డగా మారుతోందని మయాంక్ అగర్వాల్ అన్నాడు. ఇదే సమయంలో స్టంప్ మైక్ వద్దకు వచ్చిన కోహ్లీ 'కేవలం ప్రత్యర్థిపైనే కాకుండా వాళ్లు బంతిని నునుపు చేస్తున్నప్పుడు నీ జట్టుపైనా దృష్టి పెట్టు. ప్రతిసారీ జనాల గురించే ప్రయత్నిస్తావు' అని అన్నాడు.
కోహ్లీ మాట్లాడిన విధానాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. అతడు అపరిణతితో వ్యవహరించాడని గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇలాగైతే టీమ్‌ఇండియా కెప్టెన్ యువకులకు ఆదర్శంగా ఉండలేడని పేర్కొన్నాడు. స్టంప్‌మైక్‌లో ఇలా మాట్లాడటం అస్సలు సరికాదని వెల్లడించాడు.
UMPIRE: THAT'S IMPOSSIBLE ; HUH ! THAT IS IMPOSSIBLE
— Mohit Arora (@_MohitArora_) January 13, 2022
KL RAHUL: WHOLE COUNTRY PLAYING AGAINST 11 GUYS
MAYANK: MAKING THE SPORT LOOK BAD NOW
VIRAT KOHLI: FOCUS ON YOUR TEAM AS WELL WHEN THEY SHINE THE BALL NOT JUST THE OPPOSITION#INDvSA #SAvIND #DRS Supersport #IndianCricketTeam pic.twitter.com/gX0UabmdMA
భారత్, ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగే స్టేడియంలో పవర్ కట్, రూ.3 కోట్ల బిల్ పెండింగ్
Ravichandran Ashwin: ఆ టైంలో వాళ్లను చూసి చాలా బాధేసింది: అశ్విన్
ICC T20 World Cup 2024: టీ20 వరల్డ్‌కప్ కు బెర్త్ ఖాయం చేసుకున్న ఉగాండా
India vs Australia 4th T20 match: సమం చేస్తారా, సాధించేస్తారా ..
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి
/body>