అన్వేషించండి

IND vs SA ODI Series Schedule: టెస్టు సిరీసు పోయింది! ఇక వన్డేల్లోనైనా గెలుస్తారా? షెడ్యూలు ఇదే

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీసులో టీమ్ఇండియా 1-2 తేడాతో ఓటమి చవిచూసింది. క్లీన్‌స్వీప్‌ చేసే పరిస్థితుల నుంచి ఓటమి బాట పట్టింది. మరికొన్ని రోజుల్లోనే సఫారీ జట్టుతో వన్డే సిరీస్‌లో తలపడబడబోతోంది.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియాకు ఓ సిరీస్‌ ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీసులో 1-2 తేడాతో ఓటమి చవిచూసింది. మొత్తంగా సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే పరిస్థితుల నుంచి ఓటమి బాట పట్టింది. మరికొన్ని రోజుల్లోనే సఫారీ జట్టుతో వన్డే సిరీస్‌లో తలపడబడబోతోంది.

వన్డే షెడ్యూలు
మూడో టెస్టు తర్వాత టీమ్‌ఇండియా నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుంటుంది. జనవరి 19న పార్ల్‌లో బొలాండ్‌ పార్క్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో తలపడుతుంది. ఇదే వేదికలో జనవరి 21న రెండో వన్డే ఆడుతుంది. సిరీసులో చివరిదైన మూడో వన్డేను మాత్రం కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ మైదానంలోనే ఆడనుంది. ఈ మ్యాచ్‌ జనవరి 23,  ఆదివారం జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచులన్నీ మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతాయి.

వాస్తవంగా దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సింది. పర్యటనకు ముందు భారత క్రికెట్లో జరిగిన కొన్ని పరిణామాల వల్ల షెడ్యూలు మారింది. విరాట్‌ కోహ్లీని వన్డే  కెప్టెన్సీ నుంచి తప్పించడం, దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ విస్తృతంగా వ్యాపించడంతో టీ20 మ్యాచులను వాయిదా వేశారు. ముందుగా జరగాల్సిన సుదీర్ఘ ఫార్మాట్‌ను వారం రోజులు వెనక్కి జరిపారు.

Also Read: IPL New Sponsor: వివో ఔట్‌! ఇకపై 'టాటా ఐపీఎల్‌'! చైనా కంపెనీకి గుడ్‌బై!!

Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్‌ మెగా వేలం

Also Read: Tata Group IPL Sponsor: మైదానంలో సిక్సర్ల వర్షం.. బీసీసీఐకి కాసుల వర్షం..! టాటా రావడంతో బోర్డుకు ఎంత డబ్బు వస్తోందంటే?

ఇక సఫారీ గడ్డపై టీమ్‌ఇండియా 30 ఏళ్ల చరిత్రను తిరగరాసే అవకాశం కోల్పోయింది. తొలిసారి అక్కడ టెస్టు సిరీసును గెలిచే అవకాశం చేజార్చుకుంది. బ్యాటర్ల వైఫల్యంతో ప్రత్యర్థికి తక్కువ లక్ష్యాలను నిర్దేశించింది. రెండో టెస్టులో డీఎన్‌ ఎల్గర్‌ ఆతిథ్య జట్టును గెలిపిస్తే మూడో టెస్టులో కీగన్‌ పీటర్సన్‌ భారత ఆశలను ఆవిరి చేశాడు.

మూడు టెస్టులో 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆడుతూ పాడుతూ మ్యాచ్ గెలిచేసింది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను ఏ దశలోనూ ఇబ్బంది పెట్టలేకపోయారు. బుమ్రా, షమి, శార్దూల్ ఠాకూర్‌లకు తలో వికెట్ దక్కింది. కీగన్ పీటర్సన్ (82: 113 బంతుల్లో, 10 ఫోర్లు), వాన్ డర్ డసెన్ (41 నాటౌట్: 95 బంతుల్లో, మూడు ఫోర్లు), టెంపా బవుమా (32 నాటౌట్: 58 బంతుల్లో, ఐదు ఫోర్లు), డీన్ ఎల్గర్ (30: 96 బంతుల్లో, మూడు ఫోర్లు) రాణించారు.

టాప్ హెడ్ లైన్స్

Gambhir Coaching Split: రెండు గ్రూపులుగా విడిపోనున్న భారత కోచింగ్ స్టాఫ్.. గంభీర్ వన్డేలతోనే ఉండగా, టెస్టుల కోసం వెల్లింగ్టన్ వెళ్లనున్న మోర్కెల్, సితాన్షు
రెండు గ్రూపులుగా విడిపోనున్న భారత కోచింగ్ స్టాఫ్.. గంభీర్ వన్డేలతోనే ఉండగా, టెస్టుల కోసం వెల్లింగ్టన్ వెళ్లనున్న మోర్కెల్, సితాన్షు
Chennai Open Smog: 1500 ఏక్యూఐతో ఊపిరాడని పరిస్థితి ఉన్నా మ్యాచ్ ఆడించాలంటూ నిర్వాహకుల పట్టు.. చెన్నై ఓపెన్ ఫైనల్ వాయిదా
1500 ఏక్యూఐతో ఊపిరాడని పరిస్థితి ఉన్నా మ్యాచ్ ఆడించాలంటూ నిర్వాహకుల పట్టు.. చెన్నై ఓపెన్ ఫైనల్ వాయిదాపై జానిస్ జెన్ సంచలన ఆరోపణలు
Anuj Shrivatri Centenary: ఇండియా 100వ గ్రాండ్‌మాస్టర్‌గా అనుజ్ శ్రీవాత్రి చారిత్రక రికార్డు, మధ్యప్రదేశ్ నుంచి తొలి ప్లేయర్ గా కొత్త చరిత్ర
ఇండియా 100వ గ్రాండ్‌మాస్టర్‌గా అనుజ్ శ్రీవాత్రి చారిత్రక రికార్డు, మధ్యప్రదేశ్ నుంచి తొలి ప్లేయర్ గా కొత్త చరిత్ర
Hardik - Arshdeep Swap: PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్
PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
KTR: తెలంగాణలో తుగ్లక్ పాలన.. పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టుపై కేటీఆర్ ఫైర్
తెలంగాణలో తుగ్లక్ పాలన.. పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టుపై కేటీఆర్ ఫైర్
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Embed widget