IND vs SA: 1 గెలిచి 2 ఓడటం: మనకిదేం కొత్త కాదు బాబూ.. ఓసారి వెనక్కి వెళ్లండి!!
సిరీసులో తొలి టెస్టు గెలిచిన కోహ్లీసేన వరుసగా రెండు మ్యాచుల్లో ఓడటం అభిమానును బాధిస్తోంది. మొదట గెలిచి మిగిలిన మ్యాచుల్లో ఓడిపోవడంతో ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి.
India losing a series after going 1-0 up: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసు ముగిసింది. ఆతిథ్య జట్టును ఓడిస్తుందనుకున్న టీమ్‌ఇండియాకు దక్షిణాఫ్రికా పెద్ద షాకే ఇచ్చింది! 0-1తో వెనకబడ్డ ఎల్గర్ సేన్ చివరికి 2-1తో గెలిచేసింది. సిరీసులో తొలి టెస్టు గెలిచిన కోహ్లీసేన వరుసగా రెండు మ్యాచుల్లో ఓడటం అభిమానును బాధిస్తోంది. మొదట గెలిచి మిగిలిన మ్యాచుల్లో ఓడిపోవడంతో ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి.
* 1984/85లో ఇంగ్లాండ్ జట్టుకు టీమ్‌ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. ఈ సిరీసులో మొదటి మ్యాచ్ గెలిచిన భారత్ ఆ తర్వాత రెండు ఓడి 1-2 సిరీస్‌ను చేజార్చుకుంది.
* 2002లో టీమ్‌ఇండియా వెస్టిండీస్‌లో పర్యటించింది. మొదటి మ్యాచ్ గెలిచిన భారత్ తర్వాత రెండు మ్యాచుల్లో ఓడి 1-2 సిరీస్ అప్పగించింది.
* 2006/07 సీజన్లో టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాకు వెళ్లింది. అప్పుడూ 1-2తో ఇంటిబాట పట్టింది.
* 2012/13లో ఇంగ్లాండ్‌కు భారత్‌కు వచ్చింది. తొలి మ్యాచులో ఓడినా తర్వాతి మ్యాచులో గెలిచి సిరీసును 2-1తో కైవసం చేసుకుంది.
* 2014లో ఇంగ్లాండ్‌లో పర్యటించిన టీమ్‌ఇండియా తొలి మ్యాచ్ గెలిచి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మూడు మ్యాచుల్లో ఓడింది.
* తాజా దక్షిణాఫ్రికా సిరీసులో ఏం జరిగిందో తెలిసిందే. తొలి మ్యాచుల గెలిచిన భారత్ తర్వాత రెండు ఓడి 1-2తో ఓటమి పాలైంది.
ఇక కేప్‌టౌన్ టెస్టులో 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆడుతూ పాడుతూ మ్యాచ్ గెలిచేసింది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను ఏ దశలోనూ ఇబ్బంది పెట్టలేకపోయారు. బుమ్రా, షమి, శార్దూల్ ఠాకూర్‌లకు తలో వికెట్ దక్కింది. కీగన్ పీటర్సన్ (82: 113 బంతుల్లో, 10 ఫోర్లు), వాన్ డర్ డసెన్ (41 నాటౌట్: 95 బంతుల్లో, మూడు ఫోర్లు), తెంబా బవుమా (32 నాటౌట్: 58 బంతుల్లో, ఐదు ఫోర్లు), డీన్ ఎల్గర్ (30: 96 బంతుల్లో, మూడు ఫోర్లు) రాణించారు.
మొదటి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం సాధించినప్పటికీ భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో పంత్, కోహ్లీ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ దారుణంగా విఫలం అయ్యారు. అలాగే నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. దీంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
South Africa win the final Test by 7 wickets and clinch the series 2-1.#SAvIND pic.twitter.com/r3pGCbbaTx
— BCCI (@BCCI) January 14, 2022
Also Read: IPL New Sponsor: వివో ఔట్! ఇకపై 'టాటా ఐపీఎల్'! చైనా కంపెనీకి గుడ్‌బై!!
Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్ మెగా వేలం