Virat Kohli Steps Down: ప్రపంచంలోని బెస్ట్ కెప్టెన్‌లలో కోహ్లీ స్థానం ఇదే! ఫ్యాన్స్ డోన్ట్ వర్రీ ప్లీజ్!!
విరాట్ కోహ్లీ 2014లో టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి జట్టును సరికొత్త శిఖరాలను అధిరోహించేందుకు కృషి చేశాడు. విదేశాల్లో ఆడేటప్పుడు పిచ్‌లు, వాతావరణం అంటూ సాకులు చెప్పడం తగ్గించాడు.
Virat Kohli Steps Down as Test Captain: టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పడం అందరికీ షాకిచ్చింది. నిజానికి అభిమానులకైతే హార్ట్ బ్రేక్ అయింది. అతడిక భారత జట్టును నడిపించడని తెలిసి బాధపడుతున్నారు. అయితే ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు సారథుల్లో ఒకడిగా నిలవడం వారికి ఆనందం కలిగిస్తోంది. కనీసం 20 మ్యాచులకు సారథ్యం వహించిన ఆటగాళ్లలో విరాట్ నాలుగో స్థానంలో నిలిచాడు.
విరాట్ కోహ్లీ 2014లో టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి జట్టును సరికొత్త శిఖరాలను అధిరోహించేందుకు కృషి చేశాడు. విదేశాల్లో ఆడేటప్పుడు పిచ్‌లు, వాతావరణం అంటూ సాకులు చెప్పడం తగ్గించాడు. ప్రతి సవాల్‌కు ఎదురు నిలిచాడు. విదేశాల్లో అక్కడి ఆటగాళ్లకు తన నోటితోనూ సమాధానం చెప్పాడు.
Also Read: షాక్..! టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై.. బీసీసీఐ, ధోనీకి థాంక్స్ చెబుతూ లేఖ
Also Read: ఏదైనా చేసుకో! టెస్టు క్రికెట్ వదిలేయొద్దంటూ కోహ్లీకి వేడుకోలు..! ట్విటర్లో ట్రెండింగ్
Also Read: ప్చ్..! చరిత్ర సృష్టిస్తారని కలగంటే.. పీడకలే మిగిలింది.. సన్నీ నిట్టూర్పు
టీమ్‌ఇండియాను విరాట్ 68 టెస్టుల్లో నడిపించాడు. మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో 40 విజయాలు అందించాడు. 17 మ్యాచులు డ్రా అవ్వగా.. 11 ఓడాడు. మొత్తంగా అతడి విజయాల శాతం 58.82గా ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు సారథుల్లో నాలుగో స్థానంలో నిలిచాడు. భారత క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ సాధించని రికార్డులు అందుకున్నాడు. ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సిరీసులు గెలిచాడు. ఇంగ్లాండ్‌లోనూ దాదాపుగా సిరీస్ గెలిచినంత పనిచేశాడు.
ప్రపంచ టెస్టు క్రికెట్లో అత్యధిక విజయాల శాతం రికార్డలన్నీ ఆస్ట్రేలియా ఆటగాళ్లపైనే ఉన్నాయి. ఒకప్పటి కంగారూ కెప్టెన్ స్టీవ్ వా 57 మ్యాచుల్లో జట్టును నడిపించి 41 విజయాలు అందుకున్నాడు. తొమ్మిది డ్రా అవ్వగా 7 ఓడిపోయాడు. అతడి విజయాల శాతం 71.93గా ఉంది. ఆ తర్వాతి స్థానంలోని డాన్ బ్రాడ్‌మన్ విజయాల శాతం 62.50. అతడు 25 మ్యాచుల్లో 15 విజయాలు, 3 డ్రా, 6 ఓటములు చవిచూశాడు. ఇక రికీ పాంటింగ్ అత్యధికంగా 77 మ్యాచుల్లో సారథ్యం వహించాడు. 48 విజయాలు, 16 డ్రాలు, 13 ఓటములతో మూడో స్థానంలో నిలిచాడు. విజయాల శాతం 58.82గా ఉంది.
Most successful Test captains
— Mohandas Menon (@mohanstatsman) January 15, 2022
[Min 20 Tests as captain]
%win (M-W-L-D)
71.93 - Steve Waugh (57-41-9-7)
62.50 - Don Bradman (25-15-3-6)
62.34 - Ricky Ponting (77-48-16-13)
58.82 - VIRAT KOHLI (68-40-17-11)
— Virat Kohli (@imVkohli) January 15, 2022