Rajamouli: మహేష్ బాబు సినిమా కోసం... ఆర్టీఏ ఆఫీసుకు రాజమౌళి... విదేశాల్లో జక్కన్నకు డ్రైవర్ అవసరం లేదా?
Rajamouli International Driving License: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. అది రెన్యువల్ చేయించుకోవడానికి గురువారం ఆర్టీఏ ఆఫీసుకు ఆయన వెళ్లారు.

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)కి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. గురువారం ఆ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆయన హైదరాబాద్ సిటీలోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. త్వరలో ఆయన విదేశాలు వెళ్తారని, అక్కడ డ్రైవింగ్ చేసేందుకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త తీసుకున్నారని తెలిసింది.
మహేష్ బాబు సినిమా కోసమే...
జక్కన్నకు అక్కడ డ్రైవర్ అవసరం లేదా!?
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రాజమౌళి ఓ సినిమా (SSMB29) రూపొందిస్తున్నారు. ఇండియాలో చిత్రీకరణ ప్రారంభమైంది. మహేష్ బాబు సహా సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం చిత్రీకరణలో పాల్గొన్నారు. ఒరిస్సా రాష్ట్రంలోని హిల్స్ స్టేషన్స్ దగ్గర కొంత చిత్రీకరణ చేశారు. హైదరాబాద్ సిటీలో సినిమా కోసం ప్రత్యేకంగా ఒక సెట్ వేశారు. ప్రస్తుతం అందులో చిత్రీకరణ జరుగుతోంది. దీని తర్వాత ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేశారట.
Also Read: ప్రవస్తి ఆరాధ్య ఏమిట్లు? కాంట్రవర్సీలోనూ కులం గోల... గూగుల్ చేస్తున్న నెటిజన్లు
సాధారణంగా సెలబ్రిటీలు కార్ డ్రైవింగ్ చేయడం తక్కువ. క్రియేటర్స్ డ్రైవింగ్ కంటే సీటింగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సీన్ గురించి డిస్కషన్ కోసం కావొచ్చు లేదంటే మరొకటి కావొచ్చు... ఆలోచించే సమయంలో డ్రైవింగ్ చేయడం కష్టం. ఇండియాలో ఉన్నప్పుడు తప్పనిసరిగా సెలబ్రిటీలకు డ్రైవర్స్ అందుబాటులో ఉంటారు. ఫారిన్ వెళితే తమ వెంట డ్రైవర్లను తీసుకువెళ్లడం కష్టం. రాజమౌళి లాంటి దర్శకుడికి విదేశాలలో డ్రైవర్ దొరకడం కష్టమేమీ కాదు. కానీ ఆయన సొంతంగా డ్రైవ్ చేయడానికి ఇష్టపడతారు. అందుకే తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకున్నారని ఫిలిం నగర్ వర్గాల టాక్.
అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లిన రాజమౌళి
— SocialPost Times (@socialposttimes) April 24, 2025
మహేశ్ బాబు - రాజమౌళి సినిమాకు సంబంధించి విదేశాల్లో షూటింగ్ ఉన్న నేపథ్యంలో తన డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకున్న రాజమౌళి#SSMB29 #MaheshBabu #Rajamouli
#SSMB29Shooting #Tollywood pic.twitter.com/taz0vDwNYy
ఒరిస్సాలో షూటింగ్ వీడియో లీక్...
అప్పటి నుంచి మరింత జాగ్రత్తగా జక్కన్న!
మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలుసు. సినిమా ఓపెనింగ్ వీడియో కాదు కదా... కనీసం ఒక్క ఫోటో కూడా బయటకు రానివ్వకుండా రాజమౌళి జాగ్రత్త పడ్డారు. అయితే ఒరిస్సా షెడ్యూల్ చేసేటప్పుడు ఏకంగా లొకేషన్ నుంచి వీడియో లీక్ అయింది. దాంతో మరింత జాగ్రత్త పడుతున్నారు. చిత్రీకరణ దగ్గర కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. గ్లోబ్ ట్రాంటింగ్ జోనర్ సినిమా అని రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఎప్పుడో వెల్లడించారు. ఇండియానా జోన్స్ తరహాలో సినిమా ఉంటుందని టాక్. దీని కోసం పలువురు హాలీవుడ్, బాలీవుడ్ టెక్నీషియన్ల సైతం వర్క్ చేయనున్నారని తెలిసింది.
దుర్గా ఆర్ట్స్ పతాకం మీద మహేష్ బాబు - రాజమౌళి సినిమాను సీనియర్ నిర్మాత కె.ఎల్. నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత రాజమౌళి, సోదరుడు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.





















