అన్వేషించండి

Heat Stroke Deaths in Telangana : తెలంగాణలో పెరుగుతోన్న హీట్ స్ట్రోక్ మరణాలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే, ఎండతో జాగ్రత్త

Heat Stroke : పెరుగుతోన్న ఉష్ణ్రోగతల కారణంగా తెలంగాణలో హీట్ స్ట్రోక్​తో చనిపోతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే హీట్ స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలుప్స్ ఇప్పుడు చూసేద్దాం.

Heat Stroke Prevention : తెలుగు రాష్ట్రాలో ఉష్ణోగ్రతలు చాలా పెరిగిపోతున్నాయి. సూర్యుడు ఏ మాత్రం జాలి, దయ, కరుణ లేకుండా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణలో ఈ ఎండలు మరీ ఘోరంగా ఉన్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో ఎండతీవ్రత 45 డిగ్రీలుగా ఉంది. దీంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. వారం రోజుల్లో తెలంగాణలో హీట్ స్ట్రోక్​ వల్ల దాదాపు 11 మంది చనిపోయారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందుకే ప్రజలు హీటో స్ట్రోక్​పై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. 

వేసవి కాలంలో వడదెబ్బను చాలామంది ఎదుర్కొంటారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే అది ప్రాణాంతకమవుతుందని గుర్తించుకోవాలి. చాలామంది తెలియక దాని గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ దానికి ప్రాణాలు హరించే సత్తా ఉందని తెలుసుకోవాలి. అందుకే హీట్ స్ట్రోక్ రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ వస్తే ఏమి చేయాలో.. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూసేద్దాం. 

వడదెబ్బ.. 

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు.. శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవిస్తాయి. అవి హీట్​స్ట్రోక్​కి దారితీస్తాయి. ఎండలో తిరిగినప్పుడు లేదా.. ఎండలో ఎక్కువ పని చేసినప్పుడు ఇలా జరుగుతుంది. సాధారణంగా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా శరీర ఉష్ణోగ్రతలు మారిపోయి వడదెబ్బకు దారితీస్తాయి. మేజర్ కేస్​లలో హీట్ స్ట్రోక్ మెదడు, గుండె, మూత్రపిండాలు, కండారలపై తీవ్రమైన ప్రభావం చూపించి మృత్యువుకు దారి తీస్తాయి. 

వడదెబ్బకు కారణాలివే.. 

అధిక ఉష్ణోగ్రతల్లో బయటకు వెళ్లడం, పని చేయడం వడదెబ్బకు దారితీస్తాయి. శరీరానికి కావాల్సిన నీటిని తీసుకోనప్పుడు.. డీహైడ్రేషన్ వల్ల కూడా హీట్ స్ట్రోక్ వస్తుంది. ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఎక్కువగా శారీరకంగా కష్టపడినా కూడా దీని బారిన పడతారు. బిగుతుగా ఉండే డ్రెస్​లు కూడా శరీరానికి గాలిని అందించకుండా ఉక్కబోతను పెంచి వడ దెబ్బ సమస్యలను రెట్టింపు చేస్తాయి. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా వడదెబ్బ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

వడదెబ్బ లక్షణాలివే.. 

శరీర ఉష్ణోగ్రత సడెన్​గా పెరిగిపోతుంది. 104°F లేదా 40°C దాటిపోతుంది. చర్మం ఎర్రగా, వేడిగా మారుతుంది. ఎక్కువ చెమట రావడం వల్ల పొడిబారిపోతుంది కూడా. గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు కూడా వడదెబ్బ లక్షణాలే. తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం, కన్​ఫ్యూజన్ ఎక్కువ అవ్వడం, వాంతులు, కండరాలు వీక్​గా మారడం, నడవలేకపోవడం కూడా హీటోస్ట్రోక్ లక్షణాలని చెప్తున్నారు నిపుణులు. 

వడదెబ్బ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. ముఖ్యంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఇంట్లోనో లేదా ఆఫీస్​లోనో ఉండండి. వీలైనంత వరకు నీటిని తాగండి. మీకు దాహంగా లేకున్నా శరీరానికి నీటిని అందించండి. హైడ్రేషన్​ని అందించే ఫుడ్స్​ కూడా తినొచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా, కంఫర్ట్​గా ఉండే దుస్తులు వేసుకోండి. తలకు కచ్చితంగా క్యాప్ పెట్టుకోండి. లేదా స్కార్ఫ్ కట్టుకుని కళ్లకు షేడ్స్ పెట్టుకోండి. 

సన్​స్క్రీన్​ కచ్చితంగా ఉపయోగించాలి. దీనివల్ల శరీరం కూలింగ్ లక్షణాలు పొంది హీట్ బర్న్స్ రాకుండా చేస్తుంది. చల్లని నీటితో స్నానం చేయండి. వీలైనంతవరకు కూల్​గా ఉండేందుకు ట్రై చేయండి. వేడి ఎక్కువగా ఉన్న సమయంలో శారీరక శ్రమ ఎక్కువగా లేకుండా చూసుకోండి. పిల్లలు, ఆరోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి. 

హీట్ స్ట్రోక్ వస్తే ఫాలో అవ్వాల్సిన టిప్స్.. 

ఒకవేళ ఎవరైనా వడదెబ్బతో ఇబ్బంది పడుతుంటే వారికి వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించాలి. బాధిత వ్యక్తిని ముందు నీడలోకి తీసుకెళ్లాలి. శరీరంపై బిగుతుగా ఉన్న దుస్తులు తీసేయాలి. చల్లని నీటిని కాకుండా నార్మల్ నీటిని చిన్న చిన్నగా వ్యక్తికి అందించాలి. గాలి ఆడేలా చూసుకోవాలి. వెంటనే వైద్యుల దగ్గరికి తీసుకెళ్తే మరీ మంచిది. 

సరైన జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ రాకుండా చూసుకోవచ్చు. కానీ మీకు వడదెబ్బ వస్తుందని అనిపించిన వెంటనే నీడ ఉండే ప్రదేశాలకు వెళ్లిపోండి. తగినంత నీటిని అందించడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు పోయే ప్రమాదముంది. కాబట్టి వీలైనంత వరకు నిపుణుల సూచనలు ఫాలో అయిపోండి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget