ఉల్లిపాయలు సమ్మర్​లో పచ్చిగా తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయంటున్నారు.

పచ్చి ఉల్లిపాయ శరీరంలో వేడిని తగ్గించే లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది సమ్మర్​కి మంచిది.

వీటిని రెగ్యులర్​గా తీసుకోవడం వల్ల వేడి తగ్గి హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ సమస్యలు తగ్గుతాయి.

విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఇన్​ఫెక్షన్లు రాకుండా హెల్ప్ చేస్తాయి. ఇన్​ఫ్లమేషన్​ను తగ్గిస్తాయి.

సహజమైన ప్రొబయోటిక్​గా హెల్ప్ చేస్తుంది. హెల్తీ బ్యాక్టీరియాను పెంచి.. గట్ హెల్త్​ని మెరుగుపరుస్తుంది.

సల్ఫర్ కాంపౌండ్స్, ఫ్లేవనాయిడ్స్ బీపీని కంట్రోల్ చేస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్​ని తగ్గిస్తాయి.

బ్లడ్ షుగర్​ లెవెల్స్​ని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి మధుమేహమున్నవారు కూడా పచ్చిగా ఉల్లిపాయను తినొచ్చు.

దీనిలోని సల్ఫర్ బ్లడ్, ఫ్లష్​ని క్లెన్స్ చేసి టాక్సిన్లను బయటకు పంపిస్తుంది.

ఉల్లిలో కాల్షియం, మెగ్నేషియం, ఫాస్పరస్ బోన్​ హెల్త్​ని ఇంప్రూవ్ చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.