Military Power: ఆయుధ సంపత్తిలో భారత్, పాకిస్థాన్‌లో ఎవరి బలం ఎంత? బాహుబలి ఎవరు? భల్లాదేవ ఎవరు?
Military Power:గ్లోబల్ ఫైర్‌పవర్ ర్యాంకింగ్ 2025 ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటి. పాకిస్తాన్ కంటే భారతదేశంలో చాలా రెట్లు ఎక్కువ ఆయుధ సంపత్తి కలిగి ఉంది.

Military Power: మంగళవారం (ఏప్రిల్ 22) జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఉగ్రవాద దాడి జరిగిన వెంటనే భారతదేశం కఠన చర్యలు తీసుకుంది. 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడం, వీసాలు నిరాకరణ, భారత్‌లోని పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న అధికారులు 48 గంటల్లోపు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు. అటు పాకిస్థాన్ కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందిస్తోంది. పాకిస్థాన్ గగనతలం మీదుగా భారత్ విమానాలకు, భారత్‌కు వెళ్లే విమానాలను నిషేధించింది. తమ దేశంలో ఉన్న భారత పౌరులు వెళ్లిపోవాలని చూడా చెప్పింది. దీంతో భారతదేశం పాకిస్తాన్ మధ్య సైనిక చర్య ఉంటుందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం, భారతదేశం ఏదైనా చర్య తీసుకుంటే, వారు దానికి సిద్ధంగా ఉంటారని పాకిస్తాన్ తెలిపింది.
అటువంటి పరిస్థితిలో, యుద్ధం లేదా దాడి జరిగినప్పుడు ఏ దేశం ఎంత శక్తివంతమైందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ సందర్భంలో, గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ఏం చెబుతోందో చూద్దాం. ఆ నివేదిక ప్రకారం, 145 దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం నాల్గో స్థానంలో ఉంది. పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి.
భారత్ బలం భూ ఉపరితలం నుంచి ప్రారంభం
భారత సైన్యంలో 14.44 లక్షల మంది యాక్టీవ్ సైనికులు ఉన్నారు. వీటికి తోడు 11.55 లక్షల మంది రిజర్వ్ ఫోర్స్ 25.27 లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి. ఆధునిక, స్వదేశీ సాంకేతికత అద్భుతమైందిగా ఉంది భారత్ ఫైర్‌పవర్. భారత్ మొత్తం 4201 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. అర్జున్ ట్యాంక్, T-90 భీష్మ వంటి విధ్వంసకర ట్యాంకులు పాకిస్తాన్‌ను తుక్కు తుక్కు చేస్తాయి. గేమ్ ఛేంజర్‌లా పని చేసే శక్తి వీటికి ఉంది. అర్జున్ ట్యాంక్ మేడిన్ ఇండియా అయితే... T-90 భీష్మ రష్యాకు చెందినది. దీనిని భారత అప్‌గ్రేడ్ చేసింది. భారత సైన్యంలో ఉన్న పినాకా రాకెట్ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణి, బోఫోర్స్ హోవిట్జర్ తుపాకులకు పాకిస్థాన్ భూభాగాన్ని జల్లెడ చేసే దమ్ముంది.
పాకిస్తాన్ సైన్యం గురించి చెప్పాలంటే 6.54 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. 3742 ట్యాంకులు, 50523 సాయుధ వాహనాలు, 752 సెల్ఫ్ డ్రైవింగ్ ఫిరంగి యూనిట్లు ఉన్నాయి. 692 రాకెట్ లాంచర్లు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద 2627 ట్యాంకులు ఉన్నాయి. ఇది భారతదేశం సంఖ్యలో సగం.
ఆకాశంలో భారతదేశానిదే ఆధిపత్యం
భారత వైమానిక దళంలో 2229 విమానాలు ఉన్నాయి. వీటిలో 600 యుద్ధ విమానాలు, 831 సహాయక విమానాలు, 899 హెలికాప్టర్లు, 50+ UAVలు ఉన్నాయి. భారత్ అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిలో రాఫెల్ యుద్ధ విమానాలు, సుఖోయ్ Su-30MKI, మిరాజ్-2000, MiG-29 యుద్ధ విమానాలు ఉన్నాయి. భారత వైమానిక దళం బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలు కలిగి ఉంది.
పాకిస్తాన్ వద్ద 1399 విమానాలు ఉన్నాయి.వాటిలో 328 యుద్ధ విమానాలు, 64 రవాణా విమానాలు, 565 శిక్షణ విమానాలు, 373 హెలికాప్టర్లు ఉన్నాయి. 57 దాడి చేయగలిగే హెలికాప్టర్లు , 4 వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి. ఇక్కడ కూడా భారత వైమానిక దళం సంఖ్యలోనే కాకుండా పోరాట సామర్థ్యంలో ముందుంది.
నీటి మీద కూడా మనదే పైచేయి
భారత నౌకాదళం వేగంగా విస్తరిస్తోంది. ఆధునిక సాంకేతికతను చేరుతోంది. బిబిసి నివేదిక ప్రకారం, భారతదేశం వద్ద 150 యుద్ధనౌకలు ఉన్నాయి. ధనుష్, కె-15 వంటి క్షిపణులను ఉపయోగించగల ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి వైమానిక వాహక నౌకలు కూడా ఉన్నాయి. భారత నావికాదళంలో మొత్తం 1,42,252 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. పాకిస్తాన్ నావికాదళంలో 114 నౌకలు, 8 జలాంతర్గాములు, 9 యుద్ధనౌకలు ఉన్నాయి. ఇటీవలి పాకిస్తాన్ తన నావికా శక్తిని పెంచుకున్నప్పటికీ, భారత నావికాదళం పరిధి, నెట్‌వర్కింగ్ అణు సామర్థ్యంలో చాలా ముందుంది.
భారతదేశం రక్షణ బడ్జెట్
సైనిక సామర్థ్యం, సాంకేతిక ఆధిపత్యం, వ్యూహాత్మక సంసిద్ధత విషయానికి వస్తే పాకిస్తాన్ కంటే భారతదేశం చాలా ముందుంది. భారతదేశ సైనిక మౌలిక సదుపాయాలు భారీగా ఉండటమే కాకుండా నిరంతరం స్వావలంబన, నిరంతరం అప్‌గ్రేడ్ అవుతూ ఉంది. భారతదేశ పారామిలిటరీ బలం, ఉపగ్రహ నెట్‌వర్క్, డ్రోన్ టెక్నాలజీ, బహుళ-డొమైన్ యుద్ధ వ్యూహంతో ప్రపంచ సైనిక పటంలో ముందంజలో ఉంచాయి.
పాకిస్తాన్ దాని పరిమిత వనరులు, సహాయ-ఆధారిత సైనిక విధానం కారణంగా వెనుకబడి ఉంది. భారతదేశం రక్షణ ఉత్పత్తి, సైబర్ వార్, అంతరిక్ష ఆధారిత సైనిక వ్యవస్థల్లో నిరంతరం పెట్టుబడులు పెడుతోంది.





















