YS Sharmila: ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
PM Modi: ప్రధాని మోదీని ఇంటర్నల్ టెర్రరిస్టుగా షర్మిల అభివర్ణించారు. నిఘా వ్యవస్థను మోడీ వ్యవస్థలుగా మార్చడం వల్లే ఉగ్రదాడులు జరుగుతున్నాయన్నారు

Sharmila calls PM Modi an internal terrorist: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రధాని మోదీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ ఇంటర్నల్ టెర్రరిస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ అని మండిపడ్డారు. ఇండియా నిఘా వ్యవస్థలను మోడీ వ్యవస్థలుగా మార్చారని ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇండియా ఇంటలిజెన్స్ అంతా మోడీ కోసం పని చేస్తోందని.. మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కేందుకు నిఘా వ్యవస్థ పని చేస్తోందని ఆరోపించారు. పహెల్గాం ఘటన కు బాధ్యులు మోడీ,అమిత్ షానే అని విమర్శించారు. మోడీ,అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలన్నారు. పాలన చేసే హక్కు లేదు చౌకిదార్ మోడీ దేశానికి కాదు..కేవలం బీజేపీ కి మాత్రమేనని ఘాటు విమర్శలు చేశారు.
దేశంపై జరిగిన దాడి
జమ్మూ కశ్మీర్ లోని పెహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడిని దేశం మీద జరిగిన దాడిగా షర్మిల అభివర్ణించారు. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని మోడీ ఒక క్యాంపెయిన్ నడిపారని.. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారన్నారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కాశ్మీర్ కి వెళ్తుంటారని.. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకు అని షర్మిల ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి భద్రత లోపమేనన్నారు. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్ళు లేనే లేరని.. ఒక కన్ను వేసి ఉంటే వాళ్ళు వచ్చే వాళ్లు కాదన్నారు. ప్రొటెక్షన్ కోసం ఉండే సెక్యూరిటీ కూడా లేదన్నారు. ఇంతమంది చనిపోయారు అంటే ప్రభుత్వ లోపమేనని విమర్శించారు.
మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి !
ఉగ్రవాదం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బీజేపీ పై ఉందని షర్మిల అన్నారు. మోడీ చౌకిదార్ అని చెప్పుకుంటున్నారు. ఇదేనా చౌకిదార్ తనం అని ప్రశ్నించారు. ఈ ఘటనకు అమిత్ షా, మోడీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ ఇవ్వాళ దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం పని చేయడం లేదు.. ఇండియా ఇంటలిజెన్స్ అంతా బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్నా వల్ల మీద వాడుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద వాడుతున్నారు .. ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమన్నరాు. వీళ్లకు అధికారంలో ఉండే హక్కు లేదు.. వీళ్ళు దేశానికి చౌకిదార్ కాదు..బీజేపీ కి చౌకి దార్లు అని మండిపడ్డారు. ఈ దేశ దర్యాప్తు వ్యవస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని.. నిఘా వ్యవస్థ బలం అంతా మోడీ కోసం పని చేస్తుందన్నారు. ఇది ముమ్మాటికి కేంద్రం తప్పిదమేనన్నారు.
ముస్లింలను చెడ్డవాళ్లుగా చూపిచే ప్రయత్నం
ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారు. దేశంలో ఉన్న ముస్లింలను చెడ్డవాళ్ళు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని షర్మిల ఆరోపించారు. ఈ దేశంలో మతం పేరుతో యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దేశంలోనే ఇంటర్నల్ గా భద్రత లేదు.. అన్ని మతాలు సమానం అనే పరిస్థితి లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ.. మోడీ శ్రమ దేశ భద్రత కోసం పెట్టీ ఉంటే బయట వాళ్ళు చొరబడే పరిస్థితి లేదని విమర్శిచారు.





















