అన్వేషించండి

Chandrababu: చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు - తేల్చి మూసేసిన పోలీసులు

Chandrababu Cases: చంద్రబాబుపై అంగళ్లు దాడుల కేసులను మూసివేశారు. తప్పుడు కేసులు పెట్టినట్లుగా పోలీసులు నిర్దారించారు.

Angallu Case On Chandrababu: చిత్తూరు జిల్లా అంగళ్లు సమీపంలో  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనల్లో నమోదైన కేసులను పోలీసులు మూసివేశారు.   పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయనపై చేసినవి తప్పుడు ఫిర్యాదులుగా పోలీసులు నిర్ధారణకు వచ్చాు.  ప్రతిపక్ష నేత హోదాలో 2023 ఆగస్టు 9న చంద్రబాబు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చారు.   కురబలకోట మండలం అంగళ్లు సర్కిల్‌లో చంద్రబాబు వాహనాన్ని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. చంద్రబాబుపైకీ రాళ్లు రువ్వారు. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి అడ్డుకోవడంతో ఆయనకు ఎటువంటి గాయాలూ కాలేదు.                

ప్రాజెక్టుల సందర్శనకు వస్తున్న చంద్రబాబుకు వినతిప్రతం ఇచ్చేందుకు తాము వెళ్తుంటే.. టీడీపీ నాయకులు తమపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని, చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే ఈ దాడులు జరిగాయని వైసీపీకి చెందిన ఉమాపతిరెడ్డి మూడు రోజుల తర్వాత  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ముదివేడు పోలీసులు చంద్రబాబుపై ఏకంగా హత్యాయత్నం  సహా పలు నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లతో నాలుగు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రులు దేవినేని ఉమ, అమరనాథ్‌రెడ్డి సహా 20 మంది క్రియాశీల టీడీపీ నాయకులపైనా కేసులు పెట్టారు.  

తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలకు  పలువురు  క్రియాశీల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.  కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు  పూర్తి స్థాయిలో విచారించారు. చంద్రబాబు పర్యటనను వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడమే కాకుండా.. ఆయనపై రాళ్లు రువ్వినట్లు వీడియోల ద్వారా గుర్తించారు. దాడులకు దిగిన వారిపై కేసులు నమోదు చేయకపోగా బాధితుడిగా ఉన్న చంద్రబాబుపైన, ఇతర టీడీపీ నాయకులపై  కేసులు బనాయించినట్లు గుర్తించారు.  హత్యాయత్నం కేసుతో పాటు.. మిగిలిన మూడు కేసులూ తప్పుడువేనని తేల్చి వాటిని మూసివేస్తూకోర్టుకు నివేదిక సమర్పించారు.            

చంద్రబాబుపై, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి..  చివరికి వారిపైనే కేసులు పెట్టడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోలేదు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు..  కోర్టు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది.                    

టాప్ హెడ్ లైన్స్

Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
UDID Card Apply Online: దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
VB GRAM G Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Ketan Agarwal Lohagad Fort death case: కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
Embed widget