Virat Kohli Resigns: బీసీసీఐపై కోహ్లీ అలిగాడా? జట్టుకు ముందు, బోర్డుకు ఒక రోజు తర్వాత రాజీనామా విషయం
విరాట్ కోహ్లీ హఠాత్తుగా సుదీర్ఘ ఫార్మాట్లో బాధ్యతల నుంచి నిష్క్రమించాడు. అతడికి బీసీసీఐతో కమ్యూనికేషన్ బాగాలేనట్టుంది. అందుకే ఈ విషయం ముందుగా టీమ్‌ఇండియా ఆటగాళ్లకే చెప్పాడట.
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. మొన్నటి వరకు వన్డే కెప్టెన్సీ కోసం పట్టుబట్టిన ఆటగాడు. హఠాత్తుగా సుదీర్ఘ ఫార్మాట్లో నాయకత్వ బాధ్యతల నుంచి నిష్క్రమించాడు. చూస్తుంటే బీసీసీఐతో కమ్యూనికేషన్ బాగాలేనట్టు తెలుస్తోంది.
టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని విరాట్ కోహ్లీ ముందుగా టీమ్‌ఇండియా ఆటగాళ్లకే చెప్పాడట. దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్టు చివరి రోజు డ్రస్సింగ్ రూమ్‌లో జట్టు సమావేశం జరిగింది. అప్పుడే కోహ్లీ మాట్లాడాడు. నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగుతానని చెప్పాడు. దాంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ విషయం ఇప్పుడే ఎవరికీ చెప్పొద్దని, తమవద్దే రహస్యంగా ఉంచుకోవాలని విరాట్ వారిని కోరాడట.
Also Read: ప్రపంచంలోని బెస్ట్ కెప్టెన్‌లలో కోహ్లీ స్థానం ఇదే! ఫ్యాన్స్ డోన్ట్ వర్రీ ప్లీజ్!!
Also Read: ఈ రికార్డులు ఎవరైనా కొడతారా.. మళ్లీ తనే ట్రై చేయాలా..విరాట్ తిరుగులేని కెప్టెన్సీ రికార్డులు!
Also Read: షాక్..! టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై.. బీసీసీఐ, ధోనీకి థాంక్స్ చెబుతూ లేఖ
శుక్రవారం రోజు రాజీనామా గురించి ఆటగాళ్లకు చెబితే శనివారం మధ్యాహ్నం వరకు బీసీసీఐకి తెలియలేదు. మూడు గంటల తర్వాత బీసీసీఐ కార్యదర్శి జే షాతో కోహ్లీ కొద్ది సమయమే మాట్లాడాడని తెలిసింది. సుదీర్ఘ ఫార్మాట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని చెప్పాడట. అప్పటికే నిర్ణయం తీసేసుకోవడంతో అతడిని వారించేందుకు జే షా ప్రయత్నించలేదు. రాజీనామాను వెనక్కి తీసుకోవడంపై ఆలోచించుకోవాలని చెప్పలేదట.
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో కోహ్లీ మాట్లాడాడో లేదో తెలియడం లేదు. ఇక చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మకు ఫోన్ చేశాడా అన్న విషయంలోనూ స్పష్టత లేదు. తమకు తెలిసినంత వరకు ఎవరూ కాల్ చేయలేదని సెలక్షన్ కమిటీలోని ఇద్దరు సభ్యులు మీడియాకు తెలిపారు. రవిశాస్త్రి నిష్క్రమణతోనే తన ఆధిపత్యం ముగిసిందని కోహ్లీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తర్వాత దిగిపోవాలని ముందే నిర్ణయించుకున్నాడని కొందరి అంచనా. విజయంతో ముగించాలని భావించినా అదృష్టం కలిసిరాలేదు.
As Virat Kohli steps down as Team India’s Test Captain, the Board of Control for Cricket in India congratulates him on an outstanding career as #TeamIndia’s Test Captain.
— BCCI (@BCCI) January 16, 2022
More Details 🔽
Courage, Passion, Grit & Determination! 🙌 🙌
— BCCI (@BCCI) January 15, 2022
Thank you, @imVkohli! 👏 👏#TeamIndia pic.twitter.com/q36KXhiJac