Crime News: 5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
YouTuber Arrest: ప్రైవేటు వీడియోలు ఉన్నాయని చెప్పి ఓ ఎమ్మెల్యేను బెదిరించిన యూట్యూబర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ కూడా ఈ బెదిరింపుల ఘటనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Police arrest YouTuber: జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతరావును బెదిరించిన శ్యామ్ అనే యూట్యూబర్ ను పోలీసులు అరెస్టు చేశారు. జుక్కల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత రావుకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయంటూ.. 5 కోట్లు ఇవ్వకుంటే అవి బైటపెడతా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిరూప అనే మహిళతో కలిసి రిపోర్టర్ శ్యామ్ బ్లాక్ మెయిల్ చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. శ్యామ్ పై ఎక్స్‌టార్షన్ కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు .. అరెస్టు చేశారు. ఉప్పర్ పల్లి మెట్రోపాలిటన్ కోర్టులోని జడ్జ్ ముందు ప్రవేశ పెట్టారు.
ఓ మహిళతో కలిసి ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేయాలనుకున్న యూట్యూబర్
మహిళతో కలిసి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసి డబ్బులు వసూలు చేయాలని యూట్యూబర్ ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. పాత సినిమాల్లోలా సంబంధం లేని మహిళకు.. ఎమ్మెల్యేతో సంబంధం అంటగట్టి మీడియాలో ప్రచారం చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. రాజకీయాలు కాబట్టి నిజాలు తెలియక ముందే తన గురించి కథలు కథలుగా చెబుతారని భయపడిపోయి..డబ్బులు ఉంటే ఆ ఐదు కోట్లు ఇచ్చేసేవాళ్లు ఉంటారని అనుకుంటారు కాబట్టే.. యూట్యూబర్లు ఇలా బరి తెగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఎమ్మెల్యేకు బిడ్డ ఉన్నాడని.. బ్లాక్ మెయిల్ - పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
అరెస్టు అయినా శ్యామ్ అనే వ్యక్తి తీన్మార్ మల్లన్న వద్ద పని చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మి కాంత రావును నేను బ్లాక్ మెయిల్ చేయలేనదని శ్యామ్ చెబుతున్నారు. ఒక మహిళ నా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే నన్ను మోసం చేశాడు మాకు ఒక బాబు కూడా ఉన్నాడు అని చెప్పిందన్నారు. తాను ఎమ్మెల్యేను కలిసి మీకు ఇబ్బంది కాకుండా చూసుకోండి అని ఒక బ్రదర్‌గా చెప్పాను అంతే.. నేను 5 కోట్లు డిమాండ్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేను నేను బెదిరిస్తున్నట్టు నా మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడని తెలిపారు.
ఓ బ్రదర్ లా చెప్పానని బ్లాక్ మెయిల్ చేయలేదన్న ఎమ్మెల్యే
రిపోర్టర్ శ్యామ్ తో పాటు.. ఈ బ్లాక్ మెయిలింగ్ లో పాలు పంచుకున్న మహిళను కూడా అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ శ్యామ్ అనే వ్యక్తిపై పలు ఆరోపణలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పేరుతో ఆయన పలువురి నుంచి డబ్బులు వసూలు చేసేవారని అంటున్నారు. ఆయన బాధితులు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
పలువురు ప్రజా ప్రతినిధుల్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు ఇలాంటి యూట్యూబర్లుచాలా మంది ప్రయత్నిస్తున్నారు. కొంత మంది బయపడి డబ్బులు ఇస్తున్నారని అంటున్నారు. ఇలాంటి బ్లాక్ మెయిల్ యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అన్నారు.





















