BRS Meeting In Warangal: వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
BRS Meeting In Warangal: తెలంగాణలొో గతంలో ఎన్నడూ లేని విధంగా బిఆర్ ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ వేదికగా రజతోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపబోతోింది.

BRS Meeting In Warangal: తెలంగాణలో పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు బిఆర్ ఎస్ పార్టీ సిద్దమయ్యింది. వరంగల్ జల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27వ తేది జరగబోయే ఈ సభకు గతంలో ఎన్నడూ లేనివిధంగా జన సమీకరణ చేపట్టింది. అందుకే అదేస్థాయిలో ఏర్పాట్లను సైతం చేస్తోంది గులాబీ దళం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా 25ఏళ్ల క్రింత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమతి (టిఆర్ ఎస్ ), రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించడంతోపాటు దాదాపు దశాబ్దకాలం నూతన రాష్ట్రాన్ని పాలించి చరిత్ర సృష్టించింది. దేశ రాజకీయాల్లోె చక్రం తిప్పాలనే వ్యూహంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుకున్న గులాబీపార్టీకి అధికారం దూరమైంది. ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్న ఈ భారీ సభ అత్యంత కీలకంగా మారింది. ఓటమి తరువాత ప్రజాసమస్యలపై విమర్శలకు కాస్త గ్యాప్ తీసుకున్న కేసీఆర్, వరంగల్ రజతోత్సవంలో మరోసారి తన మార్క్ వ్యూహత్మక రాజకీయ విమర్శలతో అధికారపార్టీకి చుక్కలు చూపించేందుకు సిద్దమైంది.


కళ్లు చెదిరే ఏర్పాట్లు
వరంగల్ లో ఈనెల 27వ తేది జరగనున్న వేడకులకు గులాబీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. తెలంగాణవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పదిలక్షల మందికి తక్కువ కాకుండా సభకు తరలించేందుకు బిఆర్ ఎస్ కార్యకర్తలు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ, బొట్టుపెట్టి మరీ వరంగల్ సభకు రావాలంటూ ఆహ్వానిస్తున్నారు. 1213 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్దం చేశారు. లక్షలాదిగా జనం హారైనప్పటికీ ఎవరెక్కడ కూర్చున్నా వేదికపై జరుగుతున్న వేడుకలు, కేసీఆర్ ప్రసంగం సభాప్రాంగణం మొత్తం క్లారీటీగా కనిపించే విధంగా ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు. ఎండలు దంచికొడుతున్న వేళ సభా ప్రాంగణం మొత్తం చల్లటి వాతావరణం ఉండేలా టెంట్లు, కూలర్లతోపాటు అత్యాధునిక టెక్నాలజీని వాడిని ఎండవేడి నుంచి కార్యకర్తలకు రక్షణ కల్పించేలా సర్వం సిద్దం చేశారు. ఇదిలా ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేడుకలు జరిగే అవకాశం ఉండటంతో ఎండ వేడిని తట్టుకునేందుకు 10లక్షల మజ్జిన ప్యాకెట్లు పంచేందేందుకు ఏర్పాట్లు చేశారు. తాగునీటికి సమస్య లేకుండా ఏకంగా 10లక్షల వాటర్ బాటిల్స్ తెప్పించారు. ఇంకా అవసరమైతే వాటర్ బాటిల్స్ తెచ్చేందుకు గులాబీ టీమ్ సిద్దమైంది.
కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాల స్దలం..
బీఆర్ఎస్ రజతోత్సవం కోసం తెలంగాణ నలుమూలల నుంచి వేలాదిగా వాహానాలు తరలి వస్తాయి అందుకే పార్కింగ్ సమస్య తలెత్తకుండా ఏకంగా పార్కింగ్ కోసం వెయ్యి ఎకరాలు కేటాయించారు. వాహనాలు పార్కింగ్ చేసుకుని, నేరుగా సభాప్రాంగణం వద్దకు చేరుకునేలా, తొక్కిసలాటకు అవకాశం లేకుండా భారీ కేడ్లను ఏర్పాటు చేశారు. ఒకేసారి వేదికపై 500 మంది బీఆర్ ఎస్ నాయకులు కూర్చునేలా అత్యంత భారీ ఏర్పాట్లు సిద్దం చేశారు. కేసీఆర్ , కేటీఆర్ లతో సెల్పీలు దిగే ముచ్చట తీర్చేందుకు ప్రత్యేకంగా సభా ప్రాంగణంలో సెల్పీ బోర్డులు ఏర్పాటు చేశారు. విద్యుత్ కోతల ప్రభావం ఈ ప్రభుత్వంలో ఎక్కువగా ఉందని , తమకు విద్యుత్ సరఫరా పై నమ్మకంలేదంటూ ఏకంగా 200 జనరేటర్లను సిద్దం చేశారు. అనారోగ్య సమస్యలు, వడదెబ్బ వంటివి తలెత్తినప్పుడు వెంటనే వైద్య సదుపాయం అందించేందు 100కి పైగా వైద్య బృందాలను సభప్రారంగణంలో అందుబాటులో ఉంచారు. అత్యవసర సమయంలో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించేందకు 20 అంబులెన్స్ లు సైతం ఏర్పాటు చేశారు. తాత్కాలిక టాయిలెట్స్, సభకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు 2వేలమంది వాలంటీర్లను అందుబాటులో ఉంచారు. ఇలా చెప్పుకుంటే పోతే బీఆర్ ఎస్ రజతోత్సవాన్ని ఓ మహాాజాతరలా జరిపేందుకు గులాబీ దళం సన్నద్ధమైంది.





















