అన్వేషించండి
Pahalgam Terror Attack:ఆసేతు హిమాచలం కన్నీటిపర్యంతం
Pahalgam Terror Attack:ఉగ్రమూకల దుశ్చర్యకు బలైన వారిని తలుచుకొని భరతమాత గగ్గోలు పెడుతోంది. ఇది 26 కుటుంబాల్లో నెలకొన్న విషాదం 140కోట్ల మంది కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
ఆసేతు హిమాచలం కన్నీటిపర్యంతం
1/14

ఉత్తరాఖండ్‌కు చెందిన నీరజ్ ఉధ్వాని దుబాయ్‌లో సీఏగా పని చేస్తున్నారు. సెలవులకు వచ్చి భార్యతో కలిసి కశ్మీర్ వెళ్లి మృతి చెందాడు.
2/14

సయ్యద్ అదిల్ హుస్సేన్ షా అనే పోనీ ఆపరేటర్ స్థానికుడు. ముష్కర మూక నుంచి ప్రజలను కాపాడే క్రమంలో ప్రాణాలు వదిలేశాడు. ఇతనికి భార్య పిల్లలు ఉన్నారు.
3/14

ఇండోర్‌కు చెందిన నివాసి అయిన సునీల్ నాథల్ ఎల్‌ఐసీ బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.
4/14

సునీల్ మృతితో ఆ ఫ్యామిలీ ఇప్పుడు రోడ్డున పడింది. ఈ దాడిలో ఆయన కుమార్తె కూడా గాయపడ్డారు.
5/14

హేమంత్ సుహాస్ జోషి ముంబై నివాసి. ప్రైవేటు కార్గో కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య కుమారుడు ఉన్నారు.
6/14

పశ్చిమ బెంగాల్‌కు చెందిన బితన్ అధికారి ఐటీ సాఫ్ట్‌వేర్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య మూడేళ్ల కుమారుడితో పహల్గాం వెళ్లి కన్నుమూశాడు.
7/14

శుభమ్ ద్వివేది అనే కాన్పూర్‌కు చెందిన వ్యాపారవేత్త కొత్తగా పెళ్లి అయిందని భార్యతో ఇక్కడకు వచ్చాడు.
8/14

ప్రశాంత్ కుమార్ సత్పతి అనే ఒడిశాలోని బాలాసోర్ వాసి కూడా మృతి చెందాడు. ఈయనకు భార్య కుమారుడు ఉన్నారు.
9/14

మనీష్ రంజన్ అనే ఐపీ అధికారి బెంగాల్ వాసి. హైదరాబాద్‌లో వర్క్ చేస్తున్నారు. భార్య ఇద్దరు పిల్లలతో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లి తిరిగి ఇక్కడకు వచ్చారు. అంతే ముష్కర మూకలకు బలైపోయారు.
10/14

ఎన్ రామచంద్రన్ అనే కేరళ వ్యక్తి కూడా ఈ దుశ్చర్యకు బలైపోయారు. థానేకు చెందిన సంజయ్ లక్ష్మణ్ లాలి భార్య పిల్లలతో వెళ్ళి కన్నుమూశారు. దినేష్ అగర్వాల్ అనే చండీగఢ్ వాసి కూడా ఈ కాల్పుల్లో చనిపోయాడు
11/14

సమీర్ గుహా అనే కోల్‌కతా వాసి ఎంఎస్పీఐలో పని చేస్తున్నారు. భార్య కుమార్తె ఉన్నారు. దిలీప్ దాసలి ముంబై వాసి చనిపోయిన వారిలో ఉన్నారు.
12/14

సంతోష్ జగ్దా అనే పూణె వాసి మరణించాడు. చంద్రమౌళి అనే విశాఖ వాసి కూడా ఈ దుర్ఘటనలో బలైపోయారు. మధుసూదన్ సోమిశెట్టి అనే నెల్లూరు వాసి కూడా ఉగ్రమూలకు చిక్కిచనిపోయాడు. ఈయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
13/14

సుమిత్ వర్మ, యతేష్ వర్మ గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన తండ్రీకుమారులు. ఇద్దర్నీ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు.
14/14

మంజునాథ రావు అనే కర్ణాటకకు చెందిన ఐపీ అధికారి కుటుంబంతో వెళ్లి బలైపోయాడు. ఆయన భార్య బ్యాంకు మేనేజర్. వీళ్లతోపాటు కస్తూబా గన్వోటీ(పూణే), భరత్ భూషణ (బెంగళూరు ), శైలేష్‌భాయ్(సూరత్), టేగే హైల్యాంగ్ అనే అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి భార్యతో వెళ్లి ఉగ్రచెరలో చిక్కి చనిపోయారు.
Published at : 24 Apr 2025 10:25 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
ఇండియా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















