అన్వేషించండి
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
వెడ్డింగ్ సీజన్ మొదలైంది. రాబోయే 44 రోజుల్లో 46 లక్షల పెళ్లిళ్లు జరగనున్నట్టు ఓ అంచనా. వీటిలో ఎక్కువ పెళ్లిళ్లు ఎక్కడ అవుతున్నాయో తెలుసా? ఎక్కువ ఏ రాష్ట్రంలో అవుతున్నాయంటే?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
1/8

భారతదేశంలో వివాహం అనేది కేవలం ఒక బంధం మాత్రమే కాదు... అనేక పరిశ్రమలలో ప్రాణం పోసే ఒక గొప్ప వేడుక. ఈ సంవత్సరం నవంబర్ 1 నుండి డిసెంబర్ 14 మధ్య 46 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా మినీ ఫైనాన్షియల్ ఫెస్టివల్‌గా మారింది.
2/8

మార్కెట్ నుండి టూరిజం, ఉపాధి వరకు ప్రతి రంగంలోనూ వెడ్డింగ్ సీజన్ ప్రభావం కనిపిస్తోంది. అసలు ఎక్కువ పెళ్లిళ్లు ఎక్కడ జరుగుతాయనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈసారి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో అత్యధిక వివాహాలు జరిగే అవకాశం ఉంది.
3/8

ఒక్క ఉత్తర ప్రదేశ్ లో దాదాపు 18-20 లక్షల వివాహాలు జరుగుతున్నాయట. మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. లక్నో, కాన్పూర్, పాట్నా, భోపాల్, జైపూర్ వంటి పెద్ద నగరాల్లోని వివాహ వేదికలు నెలల ముందుగానే బుక్ చేయబడ్డాయి.
4/8

ఢిల్లీ-NCR లో కూడా హై-ఎండ్ వివాహాల కారణంగా భారీ బుకింగ్‌లు జరిగాయి. ఫైవ్ స్టార్ హోటళ్ల సగటు ధరలు సీజన్‌లో రెట్టింపు అయ్యాయి.
5/8

వెడ్డింగ్ సీజన్ కారణంగా హాస్పటాలిటీ, ట్రావెంలింగ్ రంగాల్లో బిజినెస్ పెరిగింది. జైపూర్, ఉదయపూర్, రిషికేష్, గోవా వంటి నగరాల్లో బుకింగ్‌లు 100% వరకు చేరుకున్నాయి.
6/8

కొన్ని హోటళ్లు ఒక రోజు పెళ్లి కోసం 30 లక్షల రూపాయల నుండి 2 కోట్ల రూపాయల వరకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. పెళ్లి కార్యక్రమాలకు సంబంధించిన వేదికలు, కేటరింగ్, డెకరేషన్, ఫోటోగ్రఫీ వ్యాపారాలు కూడా రికార్డు స్థాయిలో బుకింగ్‌లతో బిజీగా ఉన్నాయి.
7/8

నవంబర్ - డిసెంబర్ నెలల్లోని 44 రోజుల్లో జరిగే వివాహాల ద్వారా 6.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. ఇందులో ప్రధానంగా ఆభరణాలు, దుస్తులు, హోటల్స్, కేటరింగ్, ప్రయాణం, మేకప్, ఈవెంట్ నిర్వహణ వంటివి ఉన్నాయి.
8/8

ఒక సగటు భారతీయ వివాహంపై దాదాపు 5 లక్షల నుండి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే హై-ఎండ్ వివాహాల ధరలు కోట్లకు చేరుకుంటాయి. బంగారం ధరలు వేగంగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికీ, భారతీయ వివాహాలలో బంగారం కొనుగోలు చేసే క్రేజ్ తగ్గలేదు.
Published at : 27 Nov 2025 07:16 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















