News
News
X

Virat Kohli Resigns: షాక్‌..! విరాట్‌ టెస్టు కెప్టెన్సీ వదిలేయడంపై గంగూలీ, రోహిత్‌ స్పందనేంటో తెలుసా!

విరాట్‌ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కొందరైతే షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందన ఆసక్తికరంగా మారింది.

FOLLOW US: 

Virat Kohli Resigns, Virat Kohli Telugu News: టీమ్‌ఇండియా నాయకుడిగా విరాట్‌ కోహ్లీ ప్రస్థానం ముగిసింది! భారత క్రికెట్లో తిరుగులేని రారాజుగా మారిన అతడు చివరికి అనివార్య పరిస్థితుల్లో నాయకత్వ బాధ్యతలు వదిలేశాడు. టీ20 కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందగా తప్పుకొంటే వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తొలగించిందని వార్తలు వచ్చాయి! మరి సుదీర్ఘ ఫార్మాట్‌ బాధ్యతల నుంచి హఠాత్తుగా ఎందుకు తప్పుకున్నాడన్నది మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు.

విరాట్‌ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. కొందరైతే షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎలా స్పందించారన్నది ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు కారణం.

కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని గంగూలీ అన్నాడు. అతడిది వ్యక్తిగత నిర్ణయమేనని పేర్కొన్నాడు. 'విరాట్‌ కోహ్లీ నాయకత్వం టీమ్‌ఇండియా అన్ని ఫార్మాట్లలో అత్యున్నత స్థాయికి చేరుకుంది. అతడిది వ్యక్తిగత నిర్ణయం. బీసీసీఐ దానిని అమితంగా గౌరవిస్తుంది. భవిష్యత్తులో భారత జట్టు సరికొత్త శిఖరాలను చేరుకొనేందుకు కీలక సభ్యుడిగా అతనెప్పటికీ ఉంటాడు. గొప్ప ఆటగాడు. వెల్‌డన్‌ కోహ్లీ' అని దాదా ట్వీట్‌ చేశాడు.

ఇక రోహిత్‌ శర్మైతే షాక్‌కు గురయ్యానని అంటున్నాడు. 'షాక్‌ అయ్యాను!! అయితే టీమ్‌ఇండియాకు విజయవంతమైన కెప్టెన్‌గా వ్యవహరించినందుకు అభినందనలు. మున్ముందు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా కోహ్లీ' అని హిట్‌మ్యాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

Also Read: ప్రపంచంలోని బెస్ట్‌ కెప్టెన్‌లలో కోహ్లీ స్థానం ఇదే! ఫ్యాన్స్‌ డోన్ట్‌ వర్రీ ప్లీజ్‌!!

Also Read: ఈ రికార్డులు ఎవరైనా కొడతారా.. మళ్లీ తనే ట్రై చేయాలా..విరాట్ తిరుగులేని కెప్టెన్సీ రికార్డులు!

Also Read: షాక్‌..! టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై.. బీసీసీఐ, ధోనీకి థాంక్స్‌ చెబుతూ లేఖ

విరాట్‌ టెస్టు కెప్టెన్సీ వదిలేస్తున్నానన్న విషయం బీసీసీఐకి ముందుగా చెప్పాడా లేదా తెలియడం లేదు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి అతడు ఫోన్‌ చేసి విషయం చెప్పలేదని సమాచారం. అయితే శనివారం మూడు గంటల ప్రాంతంలో కార్యదర్శి జే షాకు ఫోన్‌ చేసి చూచాయగా విషయం చెప్పాడని అధికార వర్గాల ద్వారా తెలిసింది. నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మరికొన్నాళ్లు కొనసాగాల్సిందిగా జే షా చెప్పలేదట.

View this post on Instagram
 
A post shared by Rohit Sharma (@rohitsharma45)

Published at : 16 Jan 2022 12:14 PM (IST) Tags: Virat Kohli Rohit Sharma Team India BCCI Virat Kohli news Sourav Ganguly virat kohli steps down Virat Kohli Test Career Virat Kohli Test Record Virat Kohli Resign Virat Kohli steps down telugu Virat kohli Telugu news

సంబంధిత కథనాలు

Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్‌ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్‌ పంచ్‌లు!

Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్‌ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్‌ పంచ్‌లు!

తొమ్మిది నెలల గర్భంతో ఒలంపియాడ్‌లో పతకం- ఎమోషనల్‌ అయిన ద్రోణవల్లి హారిక

తొమ్మిది నెలల గర్భంతో ఒలంపియాడ్‌లో పతకం- ఎమోషనల్‌ అయిన ద్రోణవల్లి హారిక

తండ్రి అడుగులే ఆదర్శంగా కామన్వెల్త్‌లో గోల్డ్‌ కొట్టిన శ్రీజ- ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

తండ్రి అడుగులే ఆదర్శంగా కామన్వెల్త్‌లో గోల్డ్‌ కొట్టిన శ్రీజ- ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

Roger Federer: లెజెండ్‌ ప్రామిస్‌ మరి! ఐదేళ్ల క్రితం మాటిచ్చిన కుర్రాడితో టెన్నిస్‌ ఆడిన ఫెదరర్‌!

Roger Federer: లెజెండ్‌ ప్రామిస్‌ మరి! ఐదేళ్ల క్రితం మాటిచ్చిన కుర్రాడితో టెన్నిస్‌ ఆడిన ఫెదరర్‌!

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: వైఎస్ విజయమ్మకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, కర్నూలు వద్ద ఘటన

Breaking News Live Telugu Updates: వైఎస్ విజయమ్మకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, కర్నూలు వద్ద ఘటన

Vice President Election 2022: భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కఢ్ ప్రమాణ స్వీకారం

Vice President Election 2022: భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కఢ్ ప్రమాణ స్వీకారం

Raksha Bandan 2022: రాఖీ కడితే డబ్బు, బంగారం ఇవ్వకండి! ఇలా ప్రేమను చాటుకోండి!

Raksha Bandan 2022: రాఖీ కడితే డబ్బు, బంగారం ఇవ్వకండి! ఇలా ప్రేమను చాటుకోండి!

Allu Arjun: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!

Allu Arjun: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!