AINU Kidney Surgery: ఏషియన్‌లో అరుదైన కిడ్నీ ట్రాన్సప్లాంటేషన్.. అపెండిక్స్‌నే మూత్రవాహికగా అమర్చిన వైద్యులు
AINU Kidney Surgery: అత్యంత అరుదైన యూరాలజీ సర్జరీని హైదరాబాద్ AINU వైద్యులు నిర్వహించారు. మనిషి శరీరంలోని అపెండిక్స్ నే మూత్రవాహికగా అమర్చి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు.

Rare Neprology Surgery: హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు అసాధారణ సర్జరీ చేశారు. రెండు కిడ్నీలు చెడిపోయి ప్రాణాంతకంగా మారిన పరిస్థితి నుంచి 65ఏళ్ల వ్యక్తిని కాపాడారు. అతని సొంత మూత్రపిండాన్నేమరోక ప్లేసులోకి మార్పిడి చేసిన దెబ్బతిన్న మూత్ర వాహికను అతని అపెండిక్స్‌తో భర్తీ చేశారు. యూరాలాజికల్ సర్జరీలో ఇదో అరుదైన ఆపరేషన్ అని వైద్యులు AINU వైద్యులు తెలిపారు. అపెండిక్స్ మన శరీరంలో పేగులతో కలిసి ఉండే ఓ అవశేషం. ఇది కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారినప్పుడు.. వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగిస్తుంటారు. ఇప్పుడు దానినే ఓ అరుదైన ఆపరేషన్ కోసం వైద్యులు ఉపయోగించారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ రోగి, 2023లో జరిగిన సాధారణ కిడ్నీ స్టోన్ తొలగింపు శస్త్రచికిత్స (RIRS) తర్వాత తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. శస్త్రచికిత్స తర్వాత, మూత్రపిండాల నుంచి మూత్రాశయానికి మూత్రాన్ని పంపింగ్ చేసే మూత్రవాహికలు పూర్తిగా పూడుకుపోయాయి. దీంతో క్రియాటినిన్ స్థాయిలు పెరిగి, తీవ్రమైన నొప్పితో ప్రమాదకరంగా మారాయి.
మూత్రపిండాల పనితీరు కష్టంగా మారిపోయి.. తాత్కాలిక ట్యూబ్‌ల (నెఫ్రోస్టమీ) ద్వారా మూత్రం బయటకు పోతున్న ఈ రోగి, చాలా రాష్ట్రాల్లో ఆసుపత్రులను సంప్రదించి.. సరైన పరిష్కారం దొరక్క హైదరాబాద్‌కు చేరుకున్నాుడు. AINU వైద్యులు డీటైయిల్డ్‌గా పరిశీలించి… రెండు మూత్రవాహికల్లో చాలా భాగం దెబ్బతిన్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స విషయంలోనూ ఇది అత్యంత అరుదైన, సవాలుతో కూడిన పరిస్థితి.
అపెండిక్స్‌తో మూత్రవాహిక పునర్నిర్మాణం
రోగి పరిస్థితిని పూర్తిగా మదింపు చేసిన వైద్య బృందం ఓ అసాధరణ నిర్ణయం తీసుకుంది. ఆయన కుడి మూత్ర పిండాన్ని కొంచం జరిపి… పూర్తిగా దెబ్బతిన్న మూత్ర వాహిక స్థానంలో అతని శరీరంలోని అపెండిక్స్ Apendixను అమర్చారు. అపెండిక్స్, మూత్రవాహిక యొక్క పరిమాణంతో సమానంగా ఉండటం వల్ల, రోబోటిక్-సహాయక శస్త్రచికిత్స ద్వారా జాగ్రత్తగా దాన్ని మార్చిపెట్టారు. ఇది అత్యంత అరుదైనదే అయినప్పిటకీ… అపెండిక్స్ ఇంటర్ పొజిషన్ అనే ఈ టెక్నిక్ సైంటిఫిక్ గా డాక్యుమెంట్ చేసిన విధానమే అని AINU తెలిపింది.
“భారీగా ఉన్న మూత్రవాహిక లోపాన్ని పరిష్కరించడానికి ఇది ఒక ఇన్నోవేటివ్ మినిమల్ ఇన్వాసివ్ పద్ధతి,. ఇది సాధారణం కాదు, కానీ ఈ రోగి విషయంలో ఇదే సరైన పరిష్కారం,” అని డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ ఘౌస్, సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జన్ & యూరాలజిస్ట్, AINU తెలిపారు.
ఈ శస్త్రచికిత్స తర్వాత కుడి మూత్రపిండం సాధారణ స్థితికి చేరుకుంది, బాహ్య డ్రైనేజీ ట్యూబ్‌ను విజయవంతంగా తొలగించారు.
ఆటో-ట్రాన్స్‌ప్లాంట్: మూత్రపిండాన్ని సొంత శరీరంలోనే మార్పిడి
రెండు నెలల తర్వాత, ఎడమ మూత్రపిండం ఇంకా సమస్యాత్మకంగానే ఉంది. అపెండిక్స్ కేవలం కుడి వైపున మాత్రమే ఉండటం, అలాగే పేగు సంబంధమైన intestinal interposition సమస్యలు అలాగే ఉండటంతో వైద్య బృందం రీనల్ ఆటో ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే ఒక ధైర్యమైన, అరుదైన పరిష్కారాన్ని ఎంచుకుంది
ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సలో, రోగి ఎడమ మూత్రపిండాన్ని దాని రక్తనాళాలతో సహా తొలగించి, కడుపులో కింది భాగంలో మళ్లీ అమర్చారు. దీనివల్ల దెబ్బతిన్న మూత్రవాహికను తొలగించి, మూత్రం సహజంగా ఆరోగ్యవంతమైన భాగంలోకి ప్రవహించేలా చేశారు.
“రీనల్ ఆటోట్రాన్స్‌ప్లాంటేషన్ అత్యంత అధునాతన కేంద్రాల్లో మాత్రమే జరుగుతుంది, ఇది చివరి పరిష్కారంగా, అత్యంత ఖచ్చితమైన ప్రక్రియ. మేము రోగి మూత్రపిండానికి అతని సొంత శరీరంలో కొత్త స్థానాన్ని ఇచ్చాము,” అని కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ శర్మ మద్దూరి వివరించారు.
ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. క్రియాటినిన్ స్థాయిలు సాధారణ పరిధిలో ఉన్నాయి, నొప్పి, ఇతర సమస్యలు కూడా లేవు.
“ఈ కేసు ఒక అరుదైన వైద్య మైలురాయి. రెండు విభిన్న, అత్యాధునిక శస్త్రచికిత్స పరిష్కారాలను ఉపయోగించి రోగి రెండు మూత్రపిండాలను కాపాడాము. ఒకటి అపెండిక్స్‌ను సృజనాత్మకంగా ఉపయోగించడం, మరొకటి అతని సొంత మూత్రపిండాన్ని ఆటోట్రాన్స్‌ప్లాంట్ చేయడం—ఇది ప్రపంచంలో కొద్ది మంది రోగులు మాత్రమే విజయవంతంగా చేయించుకున్న టెక్నిక్,” అని AINU MD, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి. మల్లికార్జున తెలిపారు.
ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ & యూరాలజీ గురించి:
ఈ శస్త్ర చికిత్స ద్వారా అరుదైన వైద్య పరిస్థితులకు హైదరాబాద్ పరిష్కారం చూపుతుందన్న విషయం మరోసారి రుజైనైంది. AINU యూరాలజీ నెఫ్రాలజీలో దేశంలోని అతిపెద్ద ఒకే-స్పెషాలిటీ హాస్పిటల్ నెట్‌వర్క్. యూరో-ఆంకాలజీ, రీకన్‌స్ట్రక్టివ్ యూరాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ, ఫీమేల్ యూరాలజీ, ఆండ్రాలజీ, ఫంక్షనల్ యూరాలజీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్, డయాలసిస్ వంటి సేవలను అందిస్తుంది. రోబోటిక్ యూరాలజీ శస్త్రచికిత్సలో పయనీర్‌గా గుర్తింపు పొందింది.





















