Satya Nadella: ప్రపంచకప్ ఫైనల్‌పై స్పందించిన సత్య నాదేళ్ల, భారత ఓటమిపై ఏమన్నారంటే
ODI World Cup 2023: భారత జట్టు ఓటమిపై ఓ ప్రశ్నకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. కంగారూ జట్టును ఓపెన్ ఏఐ తో పోల్చి చూడటం తప్ప కొనలేమంటూ సరదా వ్యాఖ్యలు చేశారు.
ICC ODI WC 2023: భారత్(Bharat) వేదికగా జరిగిన ప్రపంచకప్(World Cup) ముగిసి రెండు రోజులైంది. అయినా సెమీస్(Semi-Finals) వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా(Team India) ఫైనల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన రోజు నుంచి అభిమానులంతా తీవ్ర దు:ఖంలో ఉన్నారు. ఇప్పటికే పలువురు దిగ్గజాలు టీమిండియా ఓటమిపై స్పందించి రోహిత్ (Rohit)సేనకు అండగా నిలిచారు. తాజాగా ఆస్ట్రేలియా(Austrelia) చేతిలో భారత జట్టు ఓటమిపై మైక్రోసాఫ్ట్ సీఈఓ(Micro Soft CEO) సత్య నాదెళ్ల (Satya Nadella) స్పందించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో సత్య నాదెళ్ల పాల్గొనగా ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న వ్యక్తి ప్రపంచకప్ ఫైనల్లో భారత ఓటమిపై ప్రశ్నించారు. భారత్ ఓటమికి ప్రతీకారంగా ఆస్ట్రేలియా టీంను కొనేస్తారా అని సరదాగా సత్య నాదేళ్లను ప్రశ్నించారు. ఈ సరదా ప్రశ్నకు స్పందంచిన సత్య నాదెళ్ల.. కంగారు జట్టును కొనడం అంటే ఓపెన్ ఏఐను సొంతం చేసుకోవడం లాంటిదేనని... అవి రెండు ఎప్పటికీ సాధ్యం కాదని నవ్వుతూ బదులిచ్చాడు. కానీ, ఓపెన్ ఏఐతో తాము భాగస్వాములం కాగలమని... అలాగే ఆస్ట్రేలియా క్రికెట్ ఆడడాన్నీ ఆనందించగలమని సరదాగా సత్య నాదేళ్ల బదులిచ్చారు.
భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌ను సత్య నాదేళ్ల టీవీలో వీక్షించారు. ఆస్ట్రేలియా విజయం ఖరారు కాగానే సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ వేదికగా ఆ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో శ్రమించి అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టును కూడా అభినందించారు. క్రికెట్టే తనకు టీమ్‌లో కలిసి పనిచేయడాన్ని, నాయకత్వాన్ని నేర్పించిందని మైక్రోసాఫ్ట్ సీఈఓగా నియమితులైన సమయంలో సత్య నాదెళ్ల తెలిపారు. అదేవిధంగా న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ను రాత్రంతా మేల్కొని మరీ చూసినట్లు తెలిపారు.
ప్రపంచకప్ 2023లో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది. టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది.
ఈ ఓటమిని జీర్ణించుకోలేక టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి క్షణాల్లో నిరాశలో కూరుకుపోయిన మన జట్టుకు భరోసానిచ్చి, ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించినా ఫైనల్లో ఓడిపోవడంతో తమ గుండె బద్దలైందని రవీంద్ర జడేజా ట్వీట్ చేశాడు. మీ మద్దతుతోనే మేం ముందుకు సాగుతున్నామని ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్‌కు రావడం చాలా ప్రత్యేకంగా అన్పించిందన్న రవీంద్ర జడేజా... ఇదీ ఎంతో ప్రేరణనిచ్చిందని జడ్డూ పోస్ట్‌లో పేర్కొన్నాడు. షమీ కూడా మరో ఫొటోను షేర్ చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. మళ్లీ బలంగా తిరిగొస్తామని తాను చేసిన ట్వీట్‌లో ఈ స్పీడ్ స్టార్ పేర్కొన్నాడు.