News
News
X

Gavaskar On KL Rahul: రాహుల్ టెస్ట్ ఇన్నింగ్స్.. మద్దతు తెలిపిన సునీల్ గావస్కర్

Gavaskar On KL Rahul: కేఎల్ రాహుల్ ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాడని.. ఒక్క ఇన్నింగ్స్ తో అతను చెత్త ప్లేయర్ అవ్వడని భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అన్నారు.

FOLLOW US: 

Gavaskar On KL Rahul: టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మద్దతుగా నిలిచారు. హాంకాంగ్ తో మ్యాచ్ లో నిదానంగా బ్యాటింగ్ చేసినందుకు రాహుల్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన గావస్కర్ అతనికి అండగా నిలిచారు. అతను ఇప్పుడే గాయం నుంచి కోలుకుని వచ్చాడని.. త్వరలోనే ఫామ్ అందుకుంటాడని ఆశాభావం వ్యక్తంచేశారు. 

ఆసియా కప్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 39 బంతుల్లో కేవలం 36 పరుగులు చేశాడు. ముందు రెండు అద్భుతమైన సిక్సర్లు కొట్టినప్పటికీ.. ఇన్నింగ్స్ అంతటా అదే ఊపు కొనసాగించలేకపోయాడు. క్రీజులో ఉన్నంతసేపు తడబడ్డాడు. దీనిపై విమర్శలు ఎదుర్కొన్నాడు. 

ఫాంలోకి వస్తే ప్రత్యర్థికి వణుకే

అతని బ్యాటింగ్ తీరుపై సునీల్ గావస్కర్ స్పందించాడు. రాహుల్ 5 నెలల విరామం తర్వాత బ్యాట్ పట్టుకున్నాడని.. అంత గ్యాప్ తర్వాత మునుపటిలా బ్యాటింగ్ చేయడం తేలిక కాదన్నాడు. రాహుల్ కు టీ20ల్లో మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. మిగతా వారికి జట్టు యాజమాన్యం అవకాశాలిస్తున్నప్పుడు.. రాహుల్ కు కూడా మద్దతుగా ఉండాలని కోరాడు. అతను గాడిలో పడడానికి కేవలం ఒక్క మంచి ఇన్నింగ్స్ సరిపోతుందని అన్నాడు. అతను ఒక్కసారి ఫాంలోకి వస్తే ప్రత్యర్థి జట్లకు నిద్రపట్టని ఇన్నింగ్స్ ఆడతాడని అన్నాడు. 

సమయం ఇవ్వాలి

కేఎల్ రాహుల్ క్లాస్ ప్లేయర్ అని గావస్కర్ అభినందించాడు. ఎన్నో సంవత్సరాలుగా అతను దేశంకోసం పరుగులు చేస్తున్నాడని గుర్తుచేశారు. ఒక్క మ్యాచ్ లో బాగా ఆడనంత మాత్రాన అతను చెత్త ప్లేయర్ అవ్వడని అన్నాడు. అతను టీమిండియాకు వైస్ కెప్టెన్ అని.. అతను ఎంత బాగా ఆడగలడు అనే విషయం అందరికీ తెలుసునని గావస్కర్ చెప్పాడు. గాయం తర్వాత రిథమ్ అందుకోవడానికి సమయం పడుతుందని.. అది అతనికి ఇవ్వాలని సూచించారు. 

రాహుల్ టచ్ కోల్పోలేదు

మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా రాహుల్ కు మద్దతుగా నిలిచారు. అతను బంతిని టైమింగ్ చేసిన విధానం చూస్తే.. పూర్తిగా టచ్ కోల్పోయినట్లుగా అనిపించట్లేదని అన్నాడు. తిరిగి ఫాంలోకి రావడానికి పెద్దగా సమయం పట్టదని అభిప్రాయపడ్డాడు. అతను అనుభవమున్న ఆటగాడని, గాడిన పడడానికి ఒక మంచి ఇన్నింగ్స్ సరిపోతుందని అన్నాడు. ఇప్పుడు మిగతా ఆటగాళ్లు రాణిస్తున్నందున రాహుల్ ఫాంపై ఆందోళన అవసరం లేదని అన్నాడు. 

ఐపీఎల్ 2022 తర్వాత కేఎల్ రాహుల్ జర్మనీలో హెర్నియా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం వెస్టిండీస్ సిరీస్ కు ముందు కరోనా బారిన పడ్డాడు. వీటన్నింటితో 5 నెలలు ఆటకు దూరమయ్యాడు. జింబాబ్వే పర్యటనలో జట్టుకు నాయకత్వం వహించినప్పటికీ పెద్దగా రాణించలేదు. 

Published at : 02 Sep 2022 03:35 PM (IST) Tags: KL Rahul Sunil Gavaskar KL Rahul News sunil gavaskar on kl rahul sunil gavaskar latest news kl rahul form

సంబంధిత కథనాలు

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

IND W vs ENG W: 0, 0, 0, 0, 0, 4, 3, 2, 50, 68* ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా బ్యాటర్ల స్కోర్లు ఇవీ!

IND W vs ENG W: 0, 0, 0, 0, 0, 4, 3, 2, 50, 68* ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా బ్యాటర్ల స్కోర్లు ఇవీ!

T20 World Cup: ఎందుకు అతని బుర్ర పాడుచేస్తున్నారు.. ఓపెనింగ్ చర్చపై రవిశాస్త్రి ఫైర్

T20 World Cup: ఎందుకు అతని బుర్ర పాడుచేస్తున్నారు.. ఓపెనింగ్ చర్చపై రవిశాస్త్రి ఫైర్

India Wicket Keeper T20 WC: పంత్ ఆ.. కార్తీక్ ఆ..  దిగ్గజ ఆటగాళ్ల సలహాలివే!

India Wicket Keeper T20 WC:  పంత్ ఆ.. కార్తీక్ ఆ..  దిగ్గజ ఆటగాళ్ల సలహాలివే!

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?